Breaking News

పెద్దపూడి విజయకుమార్ కు అభినందనలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్

-దళిత జాతికి న్యాయం చేయాలని, దళిత సంక్షేమం కోసం పాటుపడాలని విజయ్ కుమార్ కు సూచించిన మంత్రి కందుల దుర్గేష్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల సంక్షేమ సహకార ఆర్ధిక సంఘం చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన పెద్దపూడి విజయకుమార్ కు పుష్పగుచ్చం అందించి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా దళిత జాతికి న్యాయం చేయాలని, దళిత సంక్షేమం కోసం పాటుపడాలని విజయ్ కుమార్ కు మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. నిబద్ధతతో పని చేసి ఛైర్మన్ పదవికి వన్నె తేవాలని, మాల సమాజాన్ని ఆర్థిక స్వావలంబన వైపు నడిపించాలని కోరారు.

అభినందనలు తెలిపిన మంత్రి నాదెండ్ల మనోహర్, పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్
బుధవారం తాడేపల్లి లోని ఆంధ్రప్రదేశ్ మాల సంక్షేమ సహకార ఆర్థిక సంస్థ లిమిటెడ్ కార్యాలయం లో ఆంధ్రప్రదేశ్ మాల సంక్షేమ సహకార ఆర్థిక సంస్థ చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన డా.పెదపూడి విజయకుమార్ కు పుష్పగుచ్చం అందించి రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *