Breaking News

కె.టి రోడ్డు విస్తరణ కొలతలను స్వయంగా పరిశీలించా…

-విస్తరణ కొలతల్లో తేడా ఉండకూడదు…
-ప్రభుత్వ నిబందనల ప్రకారమే రోడ్డు విస్తరణ…
-రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపారిశ్రామిఖాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు

పలాస, నేటి పత్రిక ప్రజావార్త :
పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో కె.టి రోడ్ విస్తరణలో ప్రభుత్వ నిబందనలను అనుసరించే నిర్మాణం జరుగుతుందని స్వయంగా కొలతలను పరిశీలించానని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. గురువారం పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో గల కె.టి రోడ్డు మూడు రోడ్డు కూడలి నుండి పాత బస్టాండు వరకు ఉన్న దుకాణు దారులతో మాట్లాడారు. రోడ్డు విస్తరణ పనులకు ఎటువంటి ఆటంకాలు కలుగకుండా 80 అడుగులు రోడ్డు విస్తరణ జరిగేలా చూడాలని వ్యాపారస్తులకు సూచించారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది కాబట్టి స్వయంగా క్షేత్ర స్థాయి పరిశీలన చేసి కొలతలు వేశామని అన్నారు. అందరికి ఆమోద యోగ్యమైనట్లుగా ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ పనులు వేగవంతం చేయాలని మున్సిపల్ అధికారులను మంత్రి సూచించారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ సుందరమైన వాతావరణంలో ఉండాలంటే ముందుగా రోడ్లు విస్తరణ జరిగి ట్రాఫిక్ సమస్యల నుండి ప్రజలు బయటపడాలని అన్నారు. 80 అడుగులు రోడ్డు విస్తరణ చేయడంతో రహదారులు బాగుపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు, వైస్ చైర్మన్ బోర క్రిష్ణారావు, కౌన్సిలర్ బెల్లాల శ్రీను, ఏ.ఎం.సి చైర్మన్ పివి సతీష్, మున్సిపల్ ఎస్.ఇ సుధాకర్, కమీషనర్ టి.రాజేంద్రప్రసాద్ తోపాటు సీనియర్ వైసిపి నాయకులు పాల్గొన్నారు.

Check Also

దేశ డ్రోన్ రాజ‌ధానిగా ఏపీని తీర్చిదిద్దుతాం

-ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కులో డ్రోన్ హబ్ కోసం 300 ఎకరాలు కేటాయిస్తాం. -రాష్ట్రంలో 35 వేల మంది డ్రోన్ పైలట్లకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *