అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో 22వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశం జరిగింది. పరిశ్రమలు, పర్యాటకం, ఇంధనం, ఐటీ, కమ్యూనికేషన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాల్లో పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలకు సమావేశంలో ఆమోదం తెలిపారు. గతంలో కుదుర్చుకున్న పెట్టుబడి ఒప్పందాలు కార్యరూపం దాల్చి, పరిశ్రమల్లో ఉత్పత్తి ప్రారంభమయ్యేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పోర్టులు, విమానాశ్రయాలు, రోడ్డు, రైలు కనెక్టివిటీని అభివృద్ధి చేయడంతో పాటు రాష్ట్రంలోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య అనుసంధానంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సెమీకండక్టర్ల రంగంలో ఆంధ్రప్రదేశ్లో తయారీ వ్యవస్థను అభివృద్ధి చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి వివిధ శాఖల మంత్రులు, అధికారులు వర్చువల్గా హాజరయ్యారు.
పెట్టుబడుల ప్రతిపాదనలకు ఎస్ఐపీబీ ఆమోదం.. సెమీకండక్టర్ల తయారీపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
