యథావిధిగా కాకుమాను, పెదనందిపాడు, ఫిరంగిపురం ఎన్నికలు

-జిల్లాలో 13 మండలాల్లో జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు
-ఓటర్లు తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
ఈ నెల 5వ తేదీన యథావిధిగా కాకుమాను, పెదనందిపాడు, ఫిరంగిపురం మండలాల్లో జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు జరుగుతాయని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు.   మురసు తుఫాను కారణంగా రాకపోకలకు ఇబ్బందులు ఉన్న దృష్ట్యా పోలింగ్ ను ఒక రోజు వాయిదా వేస్తున్నట్లు ముందుగా చెప్పడం జరిగిందని చెప్పారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ప్రత్యేకంగా
ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో జిల్లా కలెక్టర్ తెలిపారు.
మూడు మండలాల్లో జడ్పిటిసి, ఎంపీటీసీ పోలింగ్ ఈ నెల 5వ తేదీ గురువారం జరుగుతుందని, ఈ అంశాన్ని ప్రజలు, రాజకీయ పార్టీ ప్రతినిధులు గమనించి సహకరించాలని కోరారు. ఓటర్లు తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

జిల్లాలో 13 మండలాల్లో ఎన్నికలు జరుగుతాయని,  ఐదవ తేదీ, గురువారం పోలింగ్ జరుగుతుందని తెలిపారు. 13 జెడ్పీటీసీ, 2 వందల ఎంపిటిసి స్థానాలు ఉన్నాయన్నారు. ఏడు ఎంపిటిసి స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని, మిగిలిన 193 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా పారదర్శకంగా జరుగుటకు అన్ని చర్యలు చేపట్టామని చెప్పారు.

ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి పాల్గొన్నారు.