17 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చేందుకు ముందుకొచ్చిన రైతులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రజారాజధాని అమరావతి నిర్మాణం & అభివృద్ధి నిమిత్తం APCRDA అధికారులకు తాడికొండ గ్రామానికి చెందిన పలువురు రైతులు 17 ఎకరాల భూమిని పూలింగ్ కింద అందజేసేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు రైతులు తమ భూములను ఇచ్చేందుకు గురువారం, 2026 నవంబర్ 12న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె. గణపతి రావు గారికి 17 ఎకరాల భూమికి సంబంధించిన అంగీకార పత్రాలు అందజేశారు. రైతులు పూలింగ్ కింద భూమి ఇచ్చేందుకు అంగీకారం తెలపడంతో స్థానికంగా అమరావతి రైల్వేలైనుతో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు మార్గం సుగమం కానుంది. ప్రజారాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషంగా ఉందని రైతులు ఈ సందర్భంగా తెలియజేశారు.

గురువారం పూలింగ్‌కు అంగీకార పత్రాలు అందజేసిన రైతుల వివరాలు:
ముసునూరు శివశ్రీ- 6.51 ఎకరాలు
గర్నేని శివపార్వతి- 2.77 ఎకరాలు
యర్రమనేని ఉమ- 2.60 ఎకరాలు
ఆళ్ళ శేషిరెడ్డి- 2.7 ఎకరాలు
ఆలపాటి మనోహర సాయి – 1.67 ఎకరాలు
గోపిశెట్టి ఇందిర & పుప్పాల విఘ్నేష్(జాయింట్) – 0.5 ఎకరాలు
దేవభక్తుని శ్రీనివాస రావు- 0.25 ఎకరాలు