విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అన్ని జిల్లాల మాజీ సైనిక సంఘాలతో, నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ కమిటీతో, ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌సర్వీస్‌మెన్ వెల్ఫేర్ అసోసియేషన్‌తో, ఆంధ్రప్రదేశ్ మాజీ సైనికుల హక్కుల పోరాట సమితినీ కలుపుకుని ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ మాజీ సైనికుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ముఖ్య నేతల సమావేశం రేపు జరగబోతుంది. ఈ సందర్భంగా జెఎసీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌సర్వీస్‌మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మోటూరి శంకర్‌రావు, నేషనల్ ఎక్స్ సర్వీస్‌మెన్ కో ఆర్డినేషనల్ కమిటీ (ఎన్‌ఈఎక్స్‌సిసి) జాతీయ ఉపాధ్యక్షులు ప్రముఖ పారిశ్రామికవేత్త, జేఏసీ ప్రెసిడెంట్ కె.నాగరాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మాజీ సైనికుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ముఖ్య నేతల సమావేశంను తమ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ సమావేశంలో అందరిని కలుపుకుని ఒక్కత్రాటిపై నడిపిస్తూ సంఘటితం చేసి మాజీ సైనికుల వెల్ఫేర్‌ను దృష్టిలో వుంచుకుని తమ డిమాండ్లను నెరవేర్చుకోవడానికి అందరితో సంప్రదించి తమ భవిష్యత్ కార్యాచరణను తెలియజేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు తమకు అన్ని విధాల సహకరిస్తూ సహాయ సహకారాలు అందజేస్తున్న జెఎసీ కమిటీ సభ్యులందరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యనేతలందరూ ఈ సమావేశానికి హాజరుకావాలని కోరారు.
Check Also
యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …
Prajavartha Online Telugu News