Breaking News

రేపు మాజీ సైనికుల జెఎసీ ముఖ్యనేతల సమావేశం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అన్ని జిల్లాల మాజీ సైనిక సంఘాలతో, నేషనల్‌ కోఆర్డినేషన్‌ కమిటీ కమిటీతో, ఆంధ్రప్రదేశ్‌ ఎక్స్‌సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌తో, ఆంధ్రప్రదేశ్‌ మాజీ సైనికుల హక్కుల పోరాట సమితినీ కలుపుకుని ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ మాజీ సైనికుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ) ముఖ్య నేతల సమావేశం రేపు జరగబోతుంది. ఈ సందర్భంగా జెఎసీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ ఎక్స్‌సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మోటూరి శంకర్‌రావు, నేషనల్‌ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కో ఆర్డినేషనల్‌ కమిటీ (ఎన్‌ఈఎక్స్‌సిసి) జాతీయ ఉపాధ్యక్షులు ప్రముఖ పారిశ్రామికవేత్త, జేఏసీ ప్రెసిడెంట్‌ కె.నాగరాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ మాజీ సైనికుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ) ముఖ్య నేతల సమావేశంను తమ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ సమావేశంలో అందరిని కలుపుకుని ఒక్కత్రాటిపై నడిపిస్తూ సంఘటితం చేసి మాజీ సైనికుల వెల్ఫేర్‌ను దృష్టిలో వుంచుకుని తమ డిమాండ్లను నెరవేర్చుకోవడానికి అందరితో సంప్రదించి తమ భవిష్యత్‌ కార్యాచరణను తెలియజేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు తమకు అన్ని విధాల సహకరిస్తూ సహాయ సహకారాలు అందజేస్తున్న జెఎసీ కమిటీ సభ్యులందరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యనేతలందరూ ఈ సమావేశానికి హాజరుకావాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *