Breaking News

నగరంలో ‘‘డెసెర్టినో’’ షేక్స్‌ అండ్‌ మోర్‌ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
నగరంలో విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్‌ (చిన్ని) శనివారం టిక్కిల్‌రోడ్డులోని డివిమేనర్‌ హోటల్‌ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన ‘‘డెసెర్టినో’’ షేక్స్‌ అండ్‌ మోర్‌ బ్రాంచ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపి కేశినేని శివనాథ్‌ను ‘‘డెసెర్టినో’’ బ్రాంచ్‌ యజమాని, నిర్వాహకులు దరిశి నరసింహారావు, డి.వి.ఎన్‌.సతీష్‌కుమార్‌ పూర్ణకుంభంతో స్వాగతించి శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపి కేశినేని శివనాథ్‌ మాట్లాడుతూ క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని సూచించారు. యజమాని, నిర్వాహకులు దరిశి నరసింహారావు, డి.వి.ఎన్‌.సతీష్‌కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపి ఇంటర్‌నేషనల్‌ కంపెనీ ‘‘డెసెర్టినో’’ మంచి క్వాలిటీ కలిగిన ఆరోగ్యవంతమైన ఫుడ్‌ అని అటువంటి బ్రాండ్‌ కలిగిన ‘‘డెసెర్టినో’’ మరిన్ని బ్రాంచ్‌లతో అభివృద్ధి చెంది విస్తరించాలని అభినందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఇది ఇంటర్నేషనల్‌ దుబాయ్‌ కంపెనీ అని, ఫ్రూట్‌ థిక్‌ షేక్‌, డార్క్‌ చాక్లెట్‌ షేక్‌, ఛీజ్‌ కేక్స్‌, రాయల్‌ ఫాలుదా, జీరో షుగర్‌ మిల్క్‌ షేక్‌, జీరో షుగర్‌ థిక్‌ షేక్‌, కాఫీ ట్రీట్స్‌, బర్‌గర్‌, స్వీస్‌ వాఫిల్‌, ఫ్రైస్‌ Ê బైట్స్‌ తదితర 100 రకాల మిల్క్‌ షేక్స్‌, థిక్‌ షేక్స్‌ ప్రియులకు అందరికీ అందుబాటులో ధరలలో అందివ్వగలమని అన్నారు. పూర్తి క్వాలిటీతో ఆరోగ్యవంతమైన 100 శాతం వెజిటెబుల్‌ కంటెట్‌తో, అంతర్జాతీయ ప్రమాణాలతో నిపుణులైన వారితో తయారు చేస్తూ ‘‘డెసెర్టినో’’ కౌస్తుభ ఐస్‌క్రీములు, షేక్స్‌ అండ్‌ మోర్‌ అందజేస్తున్నామన్నారు. కస్టమర్ల అభిమానంతో విజయవాడలో ఇది రెండో బ్రాంచ్‌ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ‘‘డెసెర్టినో’’ ఎం.డి భవేష్‌, ‘‘డెసెర్టినో’’ ఆపరేషన్‌ జి.ఎం యోగేష్‌ పాండే, టిడిపి రాష్ట్ర వాణిజ్య విభాగ అధ్యక్షుడు డూండీ రాకేష్‌ తదితరులు పెద్ద సంఖ్యలో కస్టమర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *