– నామినేషన్ దాఖలకు చివరి తేది నవంబర్ 18
– పోలింగ్ తేదీ నవంబర్ 5 వ తేది ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకూ
– ఎన్నికల ప్రవర్తన నియమామలని అనుసరించడం జరుగుతుంది. జిల్లా పరిధిలో 21 ఎమ్ సీసీ బృందాలు
– తూర్పుగోదావరి జిల్లాలో 20 పోలింగ్ కేంద్రాలు, 2904 మంది ఓటర్లు
– కరెక్టర్ పి. ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి పశ్చిమ గోదావరీ జిల్లా ఉపాధ్యాయ శాసన మండలి ఉప ఎన్నికల షెడ్యూలు ను ఎన్నికల కమిషన్ ప్రకటించిన నేటి నుంచి నామినేషన్లు స్వీకరణ ప్రారంభం అయినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. సోమవారం సాయంత్రం కలెక్టరు ఛాంబర్ లో శాసనమండలి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. పూర్వపు ఉభయ గోదావరీ జిల్లా పరిధిలోని టీచర్స్ ఎమ్మెల్సి స్థానానికి ఎన్నికల కమిషన్ షెడ్యూలు విడుదల చెయ్యడం జరిగిందని తెలిపారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లడుతూ, పూర్వపు ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి గా కాకినాడ జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తారన్నారు . ప్రస్తుత తూర్పు గోదావరి జిల్లా – జిల్లా రెవిన్యూ అధికారి (డి ఆర్వో) సహాయ రిటర్నింగ్ అధికారి గా వ్యవహరిస్తారని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా పరిధిలో 20 పోలింగు కేంద్రాలలో ఉపాద్యాయ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకు నేందుకు ఏర్పాట్లు చెయ్యడం జరిగిందని కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. 18 మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో రెండు పోలింగు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 2904 మంది ఉపాధ్యాయులు ఓటర్లుగా నమోదు కాగా పురుషులు 1597 , మహిళలు 1307 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారని పేర్కొన్నారు. సదరు నోటిఫికేషన్ కు అనుగుణంగా రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ కాకినాడ వారు నోటిఫికేషన్ విడుదల చేసియున్నారు. సదరు నోటిఫికేషన్ ను అనుసరించి జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం, మండల ప్రజా పరిషత్ కార్యాలయాలు, తహాసిల్దార్ వారి కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాలు మరియు పోలింగ్ స్టేషన్లు నందు ప్రచురించడమైనది. పూర్వపు తూర్పు – పశ్చిమ గోదావరి జిల్లాల లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్టు ది: 04.11.2024నుండి అమలులో వున్నది. జిల్లాలో 21 ఎమ్ సి సి బృందాలను టీములు వేయడమైనదని తెలియ చేశారు. జిల్లాలో మొత్తం 20 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చెయ్యగా : ప్రతి మండలం ఒక్కొక్కటి చొప్పున, రాజమహేంద్రవరం అర్బన్ రెండు పోలింగు కేంద్రాల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. పోలింగ్ సిబ్బందికి ఎన్నికల విధులపై తర్ఫీదు ఇచ్చుటకు 06 మంది మాస్టర్ ట్రైనర్లు ను నియమించడమైనదని తెలిపారు.
తూర్పు పశ్చిమ గోదావరీ జిల్లా ఉపాధ్యాయ నియోజకవర్గ ఏపి శాసన మండలి ఉప ఎన్నికల నిర్వహణ షెడ్యూల్…
నోటిఫికేషన్ జారీ …11.11.2024 (సోమవారం)
నామినేషన్లు వేయడానికి చివరి తేదీ 18.11.2024 (సోమవారం)
నామినేషన్ల పరిశీలన .. 19.11.2024 (మంగళవారం)
అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ 21.11.2024 (గురువారం)
పోలింగ్ తేదీ: 05.12.2024 (గురువారం)
ఉదయం 8.00 నుండి సాయంత్రం 4.00 వరకు
ఓట్ల లెక్కింపు 09.12.2024 (సోమవారం)
ఎన్నికల కోడ్ ముగిసే తేదీ ..12.12.2024 (గురువారం)
ఈ సమావేశానికి రాజకీయ పార్టీల తరపున తెలుగుదేశం ప్రతినిధులు ఎమ్. శివ సత్య ప్రసాద్ , బి. రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.