విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
నగరంలో ది.11.10.2026వ తేదీ నుండి ది.22.10.2026వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరిగే దసరా శరన్నవరాత్రులు మరియు విజయవాడ ఉత్సవ్ 2.0, పున్నమి ఘాట్లో జరుగు జాతీయ సరస్ మేళా కార్యక్రమాలకు అన్ని ప్రాంతాల నుండి అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు. ఈ నేపథ్యంలో నగరానికి విచ్చేసే భక్తులు మరియు యాత్రికుల భద్రత దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్., ఆధ్వర్యంలో అత్యాధునిక టెక్నాలజీని ఆధారంగా చేసుకుని ప్రణాళికాబద్దంగా పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి భక్తులకు ఎక్కడా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం చేసుకునే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది.
ఈ క్రమంలో నగర పోలీస్ కమీషనర్ టెక్నాలజీకి అత్యంత ప్రాధాన్యమిస్తూ వినూత్న ప్రణాళికలతో బూమ్ బ్యారియర్లు, యాక్సెస్ కంట్రోలర్స్ ఏర్పాటు క్షేత్రస్థాయి పరిశీలన కోసం దాదాపు 30 డ్యాష్బోర్డులతో అధునాతన కంట్రోల్ రూమ్, క్యూలైన్లలో భక్తుల కదలికలు, పార్కింగ్ స్థలాలు, ఏపీఎస్ఆర్టీసీ మరియు రైల్వే ప్రయాణికుల రద్దీని ఏఐ (AI) కెమెరాలు, డ్రోన్లు, ఏఎన్పిఆర్ (ANPR) సిస్టమ్ మరియు డిజిటల్ ట్విన్స్ పరిజ్ఞానంతో నిరంతరం పర్యవేక్షించడం జరిగింది.
మొత్తం టెంపుల్ పరిసర ప్రాంతాలలో 40 పార్కింగ్ పాయింట్లను ఏర్పాట్లు చేయడం వలన ఎక్కడ రోడ్లపై అడ్డదిద్ధంగా పార్కింగ్ జరగలేదు. ఎక్కడా ట్రాఫిక్ అంతరాయం లేకుండా విధులు నిర్వహించడం జరిగింది. ఈ దసరా మహోత్సవాలలో సుమారు 19 లక్షల మంది భక్తులు ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం చేసుకున్నారు.
దసరా పర్వదినంతో పాటు, మూలా నక్షత్రం, విజయదశమి, రోజుల్లో భక్తుల రద్దీ దృష్ట్వా నగర ప్రజలకు ట్రాఫిక్ క్రమబద్దీకరిస్తూ, ఎక్కడా కూడా దొంగతనాలు జరుగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలకు అస్కారం లేకుండా అంకిత భావంతో, బాధ్యతగా విధులు నిర్వహించి, విజయ వంతంగా ఉత్సవాలు నిర్వహించుటలో తోడ్పాటునందించిన దేవాదాయశాఖ, రెవిన్యూ, వివిధ ప్రభుత్వ శాఖలవారికి మరియు ప్రజా ప్రతినిధులకు, స్వచ్ఛంద సంస్థల వారికి, భక్తులకు, భవానీలకు, మీడియా ప్రతినిధులకు మరియు అన్ని విభాగాల వారికి, వివిధ జిల్లాల నుండి వచ్చిన పోలీస్ అధికారులకు, లోకల్ పోలీసు అధికారులు మరియు సిబ్బందికి ఎన్.టి.ఆర్.జిల్లా నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు, ఐ.పి.ఎస్., ప్రత్యేకంగా హృదయ పూర్వక అభినందనలు తెలియజేశారు.
ఈ నేపధ్యంలో ఈ రోజు ది.23.10.2026వ తేదిన పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం నందు నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.బందోబస్త్ కు వచ్చిన ప్రోబెషనరీ డి.ఎస్.పి.లతో సమావేశం నిర్వహించి వారు ఈ బందోబస్త్ లో చేసిన విధుల గురించి మరియు గమనించిన విషయాల గురించి కూలంకుషంగా చర్చించి పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.తో పాటు , డి.సి.పి.లు కృష్ణ కాంత్ పటేల్ ఐ.పి.ఏస్., షిరిన్ బేగం ఐ.పి.ఎస్, తిరుమలేశ్వర రెడ్డి ఐ.పి.ఎస్, కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్, ఏ.బి.టి.ఎస్.ఉదయ రాణి ఐ.పి.ఎస్, కృష్ణ ప్రసన్న ఐ.పి.ఎస్, బి.లక్ష్మి నారాయణ ఐ.పి.ఎస్, బి.సత్యనారాయణ, ప్రోబేషనరి డి.ఏస్.పి. లు పాల్గొన్నారు.
