మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి మరింత ప్రాధాన్యత

-కూటమి నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలి
-ఐతవరంలో నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల ఆత్మీయ సమావేశంలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎన్టీఆర్ జిల్లా (ఐతవరం) ఐతవరం గ్రామంలో నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేసి, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.

ఈ సమావేశంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను, జంపాల సీతారామయ్య తదితర సీనియర్ నాయకులతో కలిసి ఎంపీ కేశినేని చిన్ని పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ జిల్లాలో నేను తక్కువగా పర్యటించిన నియోజకవర్గం మైలవరం అని, అందుకు ప్రధాన కారణం అక్కడ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ఉన్నారన్న సంపూర్ణ నమ్మకమేనని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమన్వయంతో పనిచేసిన నాయకుడు కృష్ణప్రసాద్ అని ప్రశంసించారు.పార్టీ కోసం కష్టకాలంలోనూ అంకితభావంతో పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత కల్పించడం ఎంతో ముఖ్యమని పేర్కొంటూ, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి అండగా నిలిచిన పాతతరం నాయకులు, కార్యకర్తలకు సముచిత గౌరవం కల్పిస్తూ ముందుకు సాగిన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌ను అభినందించారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారిని కలుపుకుంటూనే, మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వారి సేవలను గుర్తించడం ద్వారా పార్టీ శ్రేణుల మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేశారని పేర్కొన్నారు.అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలో కూటమి పార్టీల మధ్య సమన్వయం దెబ్బతినకుండా, నాయకులు, కార్యకర్తల మధ్య ఎలాంటి విభేదాలు తలెత్తకుండా జిల్లా స్థాయిలో సమర్థవంతంగా వ్యవహరించిన టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ, జనసేన జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్‌ల సేవలను ప్రత్యేకంగా అభినందించారు.ఎన్టీఆర్ జిల్లాలో కూటమి సాధించిన ఘనవిజయం వెనుక మూడు పార్టీల నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషి ఉందని ఎంపీ చిన్ని తెలిపారు. కూటమి పార్టీల మధ్య ఉన్న పరస్పర సమన్వయం, నాయకుల సమర్థవంతమైన నాయకత్వం, క్షేత్రస్థాయిలో కార్యకర్తల అంకితభావం వల్లే జిల్లాలో 95 శాతం స్ట్రైక్ రేట్ సాధించడం సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ విజయం ఏ ఒక్కరి వల్లనో సాధ్యమైనది కాదని, మూడు పార్టీల శ్రేణులు సమిష్టిగా పనిచేయడం వల్లే ప్రజల మద్దతు లభించిందని స్పష్టం చేశారు.

మైలవరం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతం కానున్నాయని ఎంపీ తెలిపారు. ముఖ్యంగా కొండపల్లి ప్రాంత అభివృద్ధికి రాబోయే రోజుల్లో ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా మైలవరం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.జిల్లాలోని కూటమి నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి సమస్య ఎదురైనా వాటి పరిష్కారం కోసం తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ఎంపీ కేశినేని చిన్ని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు వ్యక్తిగత విభేదాలకు తావివ్వకుండా ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు కూటమిపై ఉంచిన విశ్వాసానికి అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరువ చేయాలని సూచించారు.ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు కేవలం విజయం మాత్రమే కాదని, అది ప్రజాప్రతినిధులపై ఉంచిన బాధ్యత అని పేర్కొన్న ఎంపీ చిన్ని, ప్రజల సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ, ప్రతి గ్రామ అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని సమన్వయంతో పనిచేయాలని నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు సూచించారు.ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ, కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ఫలాలు ప్రతి కుటుంబానికి అందేలా ప్రజాప్రతినిధులందరూ కృషి చేయాలని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పిలుపునిచ్చారు.