విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు నియోజకవర్గ పరిధిలోని 18వ డివిజన్లో Farooqia మసీదును సందర్శించి ముస్లిం సోదరులను ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ ఆత్మీయంగా కలిశారు.ఈ సందర్భంగా 18వ డివిజన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి ఎం.డి. కలీమ్ ని, నగర మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి ని గెలిపించాలని కోరారు. రానున్న విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో కార్పొరేటర్ అభ్యర్థి ఎం.డి. కలీమ్ కి, మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి కి ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేశారు. ప్రజల సంక్షేమం, నగర అభివృద్ధి లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ప్రజలంతా తమ మద్దతు అందించాలని దేవినేని అవినాష్ కోరారు.
ముస్లిం సోదరులను కలిసిన దేవినేని అవినాష్.. ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి
