విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
నగరంలోని 86వ డివిజన్లో కూటమి కార్పొరేటర్ అభ్యర్థులతో పాటు మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రముఖ వ్యాపారవేత్త కోగంటి సత్యం పిలుపునిచ్చారు. నవంబర్ 1న జరిగే ఎన్నికల్లో వంగవీటి రాధాకృష్ణ రెండు లక్షల మెజారిటీతో విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కోగంటి సత్యం మాట్లాడుతూ, విజయవాడ నగరంలో రాధాకృష్ణ గెలుపు కోసం కోగంటి యువసేన నిరంతరం శ్రమిస్తుందని తెలిపారు. గతంలో వంగవీటి మోహనరంగా, వంగవీటి రత్నకుమారి, వంగవీటి రాధాకృష్ణ ప్రజలకు సేవలందించారని పేర్కొన్నారు. వంగవీటి రాధాకృష్ణ మేయర్‌గా ఎన్నికైన వెంటనే నగరంలో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు కోగంటి సత్యం తెలిపారు. నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పరిశపోగు రాజేష్, గ్రిటన్ తదితరులు పాల్గొన్నారు.
వంగవీటి రాధాకృష్ణ గెలుపు కోసం కోగంటి యువసేన కృషి : కోగంటి సత్యం
