Breaking News

Andhra Pradesh

జాతీయ ఓటర్ల దినోత్సవం ఏర్పాట్లలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలి

-విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ శుక్రవారం జనవరి 25 2024న తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రం లో జరిగే జాతీయ ఓటర్ల దినోత్సవం వేడుకల ఏర్పాట్లను, జనవరి 26, 2024న ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో జరిగే 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కమిషనర్ మాట్లాడుతూ జాతీయ ఓటర్ల దినోత్సవం లోనూ గణతంత్ర …

Read More »

జాతీయస్థాయి వ్యాసరచన విజేత సిద్ధార్థ విద్యార్థిని

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : కర్నూలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, క్లస్టర్ విశ్వవిద్యాలయం, గురజాడ ఫౌండేషన్ (అమెరికా), ప్రకాశిక అంతర్జాల పత్రిక సంయుక్తంగా మహాకవి గురజాడ అప్పారావు 109వ వర్ధంతి సందర్భంగా డిగ్రీ, పి.జి. విద్యార్థులకు “గురజాడ భావస్ఫూర్తి”అంశంపై నిర్వహించిన జాతీయస్థాయి వ్యాసరచన పోటీల్లో విజయవాడలోని పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల తృతీయ సంవత్సరం బి.సి.ఎ. విద్యార్థిని బాగ్ దుర్గాభవాని నగదు బహుమతి, ప్రశంసపత్రం గెలుపొందడం పట్ల కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మేకా రమేష్, డైరెక్టర్ వేమూరి బాబూరావు, డీన్ …

Read More »

ఎన్.ఐ.ఆర్.డి లో ఎస్.హెచ్.జి. మండ‌ల స‌మైక్య అధ్య‌క్షులకు అవ‌గాహ‌న స‌ద‌స్సు

-విక‌సిత్ పంచాయిత్ లో ఎంపి కేశినేని శివ‌నాథ్ ఆధ్వ‌ర్యంలో హాజ‌రు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎంపి కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణాభివృద్ది సంస్థ మ‌రియు పంచాయితీరాజ్ ల సహకారంతో విక‌సిత్ పంచాయిత్ లో భాగంగా గ్రామాభివృద్దితో పాటు ఆర్థికాభివృద్ది సాదించేందుకు ఎన్టీఆర్ జిల్లాలోని స్వ‌యం స‌హాయ‌క సంఘాల మండ‌ల అధ్య‌క్షుల‌కు స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన సదస్సు గురువారం హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని జాతీయ గ్రామీణాభివృద్ది, పంచాయతీ రాజ్ (ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్) సంస్థ లో ఏర్పాటు చేయటం జరిగిందని ఎంపి కేశినేని …

Read More »

ఎపిని అభివృద్ధి పథంలో నడిపించడానికి నిరంతరం శ్ర‌మిస్తున్న నాయ‌కుడు లోకేష్ : ఎంపి కేశినేని శివ‌నాథ్

-భ‌వానీపురంలో మంత్రి నారా లోకేష్ జ‌న్మ‌దిన వేడుక‌లు -విద్యార్ధుల‌కు ఎగ్జామ్ కిట్స్, పుస్త‌కాలు పంపిణీ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : యువ‌గ‌ళం స‌మ‌యంలో ఇచ్చిన హామీలు నేర‌వేర్చుతూ…రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి విద్య ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేష్ నిరంత‌రం శ్ర‌మిస్తున్నార‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం 40 వ డివిజ‌న్ లోని భ‌వానీ పురం బ్యాంక్ సెంట‌ర్ గాంధీ బొమ్మ రోడ్ వ‌ద్ద తెలుగు యువ‌త నాయ‌కులు సంతోష్ కుమార్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన‌ మంత్రి నారా …

Read More »

యువ‌త భ‌విష్య‌త్తును తీర్చిదిద్ద‌ట‌మే మంత్రి నారా లోకేష్ ల‌క్ష్యం : ఎంపి కేశినేని శివ‌నాథ్

-ఎంపి కార్యాల‌యంలో ఘ‌నంగా మంత్రి లోకేష్ జ‌న్మ‌దిన వేడుక‌లు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ‌త ప్ర‌భుత్వ ఆరాచ‌క విధానాల‌ను నిగ్గ‌దీసి, ఎండ‌గట్టి ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలిచి ప్ర‌జా ప్ర‌భుత్వ ఏర్పాటు లో విద్య, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేష్ కీల‌క‌పాత్ర పోషించారు. విద్యార్ధులకు నాణ్య‌మైన విద్య అందించేందుకు, నిరుద్యోగుల‌కి మంచి భ‌విష్య‌త్తు అందించేందుకు నిరంతరం మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నార‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. గురునాన‌క్ కాల‌నీలోని ఎన్టీఆర్ భ‌వన్ ఎంపి కేశినేని చిన్ని కార్యాల‌యంలో …

Read More »

కార్య‌ద‌క్ష‌త గల ప్ర‌జానాయ‌కుడు లోకేష్ : ఎంపి కేశినేని శివ‌నాథ్

-4వ డివిజ‌న్ లో లోకేష్ జ‌న్మ‌దిన వేడుక‌లు -కేక్ క‌ట్ చేసిన రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా , ఎంపి కేశినేని , ఎమ్మెల్యే గ‌ద్దె -సిసి రోడ్డు నిర్మాణ ప‌నుల‌కు శంకుస్థాప‌న విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్ర‌మ‌శిక్ష‌ణ‌, ప‌ట్టుద‌ల‌ కార్య‌ద‌క్ష‌త‌కు మారుపేరు మంత్రి నారా లోకేష్ అని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. విద్య‌,ఐటీ శాఖ‌ల మంత్రిగా ప్ర‌జాభివృద్ది ధ్యేయంగా సేవ‌లందిస్తూ ప్ర‌జా నాయ‌కుడిగా నారా లోకేష్ మ‌న్న‌న‌లు అందుకోవ‌టం ఎంతో ఆనందంగా వుంద‌న్నారు. తూర్పు నియోజ‌క‌వ‌ర్గం 4వ డివిజ‌న్ …

Read More »

వికలాంగులకు పెట్రోల్ మంజూరుకై కమిషనర్ తగు చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వికలాంగులకు పెట్రోల్ మంజూరుకై దృవీకరణ కోసం బాలకృష్ణ అందించిన అర్జీని పరిశీలించి, తగు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఉపా సెల్ పిఓని ఆదేశించారు. గురువారం నగరపాలక సంస్థ కమిషనర్ కార్యాలయంలో ఆర్.అగ్రహారం నివాసి వికలాంగులుడైన టి.బాలకృష్ణ కమిషనర్ ని కలిసి స్వయం ఉపాధి చేసుకుంటూ, వికలాంగ కోటాలో ప్రభుత్వం మంజూరు చేసిన 3 చక్రాల వాహనంకు పెట్రోల్ మంజూరు కోసం ద్రువీకరణ పత్రం కోసం అర్జీ అందించారు. స్పందించిన కమిషనర్ తక్షణం …

Read More »

త్రాగునీటి పైప్ లైన్ మరమత్తు పనులను యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలి

-నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని 3 వంతెనల వద్ద 700ఎంఎం డయా సిఐ పైప్ లైన్ మరమత్తు పనులను నిర్దేశిత గడువుకి ముందే పూర్తి చేయాడానికి ఇంజినీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  ఆదేశించారు. గురువారం కమిషనర్  3 వంతెనల వద్ద జరుగుతున్న పనులను పరిశీలించి, పనుల వేగవంతంపై ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పైప్ లైన్ మరమత్తు పనుల …

Read More »

గ్రీవెన్స్ కు అందే ఫిర్యాదులు, ఆర్జీలను అధిక ప్రాధాన్యత క్రమంలో పరిష్కారం చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థలో పని చేసే కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా నిర్వహించే గ్రీవెన్స్ కు అందే ఫిర్యాదులు, ఆర్జీలను అధిక ప్రాధాన్యత క్రమంలో పరిష్కారం చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ విభాగాదిపతులను ఆదేశించారు. గురువారం నగరపాలక సంస్థ కార్మికుల ప్రత్యేక గ్రీవెన్స్ ని కమిషనర్ ఛాంబర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విభాగాల వారీగా కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. గ్రీవెన్స్ లో అందే ఆర్జీలను, ఫిర్యాదుల …

Read More »

విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే వారి పై కఠిన చర్యలు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో ఇంటింటి చెత్త సేకరణ, ఖాళీ స్థల యజమానులకు నోటీసులు జారీ చేయడంలో శానిటేషన్ కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే వారి పై కఠిన చర్యలు తప్పవని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. గురువారం కమిషనర్  శ్రీరామ్ నగర్, ఎన్జీఓ కాలనీ, ఏటి అగ్రహారం, సాయి నగర్, దుర్గా నగర్, కెవిపి కాలనీ, కావేరి కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి, పారిశుధ్య పనులు, అభివృద్ధి పనులను …

Read More »