-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితి సందర్భంగా నగరంలోని ప్రతి వినాయక మండపం వద్ద భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఫైర్ సేఫ్టీ నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని తన ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో కమిషనర్ సమావేశం నిర్వహించి, నగరంలోని వినాయక మండపాల వద్ద భక్తుల భద్రత, అగ్ని ప్రమాదాల నివారణ, విద్యుత్ భద్రత, …
Read More »Andhra Pradesh
వినాయకుని నిమజ్జనానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితి సందర్భంగా నగరంలో నిర్వహించనున్న వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం కమిషనర్ నగరంలోని ఎంజీ రోడ్ పోలీస్ కంట్రోల్ రూమ్, తుమ్మలపల్లి కళాక్షేత్రం రోడ్, వినాయక టెంపుల్ రోడ్, సీతమ్మవారి పాదాలు, భవానీపురం హెడ్ వాటర్ వర్క్స్, ఆర్టీసీ వర్క్‌షాప్ రోడ్, హెచ్‌బీ …
Read More »HIV/ మాదకద్రవ్యాల నిరోధన ప్రతి ఒక్కరి బాధ్యత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వాసవ్య మహిళా మండలి ఆద్వర్యంలో స్థానిక శ్రీ పి.ఎస్.ఎన్.ఎమ్. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, వెంట్రప్రగడ మరియు ఎస్.ఆర్.ఆర్. మరియు వి. సి. ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, వానపాముల లోని విధ్యార్ధులకు హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వై అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్బంగా వి.రాజామోహన్, ప్రివెన్షన్ యూనిట్, మైగ్రెన్ట్స్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటి ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు 60 రోజులపాటు, వీధినాటికలు, యల్.ఇ.డి వ్యాన్, కరవత్రాలు/గోడపత్రికలు పంపిణి, …
Read More »అమూల్య బాల్యాన్ని మత్తులోకి జారనీయొద్దు
-విద్యార్థులతో స్నేహపూర్వక సంభాషణలు పెరగాలి -తల్లి ,తండ్రి, డాక్టర్, పోలీస్, స్నేహితుడి పాత్ర టీచర్లు పోషించాలి -సమాజం అంతా కలిసి పని చేస్తేనే డ్రగ్స్ రహిత ఆంధ్ర ప్రదేశ్ సాధ్యం -నశాముక్త్ విద్యాలయ రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమం లో ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు చల్ల మధుసూదన రావు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమూల్యమైన బాల్యాన్ని మత్తులోకి జారకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిదీ అని ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు చల్ల మధుసూదన రావు పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ …
Read More »మున్సిపల్ ఎన్నికల సన్నాహకాలపై సమావేశం
చిత్తూరు జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కుప్పం, చిత్తూరు, పలమనేరు ప్రాంతాల్లో నిర్వహించిన సన్నాహక కార్యక్రమాల్లో తిరుపతి–చిత్తూరు కోఆర్డినేటర్, ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మరాజు మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పార్టీ శ్రేణులు ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని సూచించారు. స్థానిక పరిస్థితులను పరిగణనలోకి …
Read More »మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరైన డా. పసుపులేటి హరిప్రసాద్
నగరి, నేటి పత్రిక ప్రజావార్త : మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక కార్యక్రమానికి తిరుపతి–చిత్తూరు కోఆర్డినేటర్, ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు. ధర్మరాజు మాట్లాడుతూ, రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ప్రతి వార్డు, ప్రతి బూత్ …
Read More »ప్రధాన రహదారులు, జంక్షన్ల అభివృద్ధి పనులకు చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలోని ప్రధాన రహదారులు, జంక్షన్ల అభివృద్ధి పనులకు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (ఏపియుఐఎయంయల్), నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో అభివృద్ది పనుల పై తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా …
Read More »గ్రీన్ గణేష్ మట్టి విగ్రహాల తయారీ కార్యక్రమాన్ని “వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్”కి కృషి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 11న చేపట్టనున్న గ్రీన్ గణేష్ మట్టి విగ్రహాల తయారీ కార్యక్రమాన్ని “వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్” నందు నమోదు చేయనున్నదని, రికార్డ్ నమోదు విజయవంతం అయ్యేలా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. గురువారం గ్రీన్ గణేష్ కార్యక్రమంలో భాగంగా ఏకకాలంలో 25 వేలమంది విద్యార్ధులతో మట్టి గణేష్ విగ్రహల తయారీ కార్యక్రమ ఏర్పాట్లను నగర పాలక సంస్థ యన్టిఆర్ …
Read More »ప్రభుత్వ కార్యాలయాల గోడలపై ఇష్టానుసారం పోస్టర్లు అంటించే వారిపై కఠిన చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో రహదారుల డివైడర్లు మరియు ప్రభుత్వ కార్యాలయాల గోడలపై ఇష్టానుసారం పోస్టర్లు అంటించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. గురువారం కమిషనర్ కొత్తపేట, బస్టాండ్ రోడ్, నందివెలుగు రోడ్, షాప్ ఎంప్లాయీస్ కాలనీ, జామియా నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఇప్పటికే ప్రింటర్స్, వివిధ మత …
Read More »త్రాగునీటి చెరువుల్లో నిమజ్జనం నిషేధం…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక విగ్రహాలను నగరంలోని త్రాగునీటి చెరువుల్లో నిమజ్జనం నిషేదమని, నిమజ్జన ప్రక్రియలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, వినాయక చవితి పండుగను నగర ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, పర్యావరణ పరిరక్షణ బాధ్యతతో జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. వినాయక మండపాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా రోడ్లను తవ్వడం, గుంతలు పెట్టడం వంటివి చేయకూడదన్నారు. …
Read More »
Prajavartha Online Telugu News