Breaking News

Andhra Pradesh

కలెక్టర్ జె. నివాస్ నేతృత్వంలో ముమ్మరంగా సాగుతున్న వరద ముంపు నివారణ చర్యలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం సాయంత్రానికి నాగార్జున సాగర్ డాం నుంచి మిగులు జలాలను విడుదల చేయనున్నారు. ఆదివారం అర్ధరాత్రి కి ఫుల్ రిజర్వాయర్ స్థాయికి చేరుకుంటుంది. ప్రారంభదశలో 2 లక్షల క్యూసెక్కుల వరకు వరద నీరు విడుదల ఉండవచ్చు. సోమవారం ఉదయం నుంచి 4.5 లక్షల క్యూసెక్కుల నుంచి 5 లక్షల వరకు పెరగనున్నట్లు జలవనరుల శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఈ నేపద్యంలో కృష్ణా జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఆదేశాలతో వరద ముంపు నివారణ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. …

Read More »

వరద ఉధృతి దృష్ట్యా అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి …

-సబ్ కలెక్టర్ జి ఎస్ ఎస్ ప్రవీణ్ చంద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ జి. ఎస్ ఎస్ ప్రవీణ్ చంద్ సూచించారు. సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం వరద ముంపు నివారణ చర్యల్లో భాగంగా నగరంలో ని భూపేష్ గుప్త నగర్, తారక రామనగర్, దోబీఘాట్, ఇంద్రకీలాద్రి రోడ్, పెనమలూరు , యన మలకుదురు ఇసుక …

Read More »

సోమవారం స్పందన కార్యక్రమం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ డివిజన్ లోని ప్రజల సమస్యల పరిష్కార సౌకర్యార్థం ప్రతి సోమవారం ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకూ స్పందన కార్యక్రమం నిర్వహించబడుతుందని విజయవాడ సబ్ కలెక్టర్ జి ఎస్ ఎస్ ప్రవీణ్ చంద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వారిచే స్వయంగా ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించ బడును. కృష్ణా జిల్లా కలెక్టర్ వారి సర్కులర్ ఆదేశాల మేరకు స్పందన కార్యక్రమం పునరుద్ధరణలో భాగంగా ప్రతి సోమవారం …

Read More »

సాకారమవుతున్న స్వంత ఇంటి కల…

-ఇళ్ల లబ్దిదారుల ముఖాల్లో వికసిస్తున్న ఆనందం… -కొండంత సంబరంతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన లబ్దిదారులు… – జిల్లాలో జగనన్న కాలనీలలో జోరందుకున్న స్వగృహ నిర్మాణాలు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదలకు స్వంత ఇల్లు సమకూర్చాలన్న ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి సంకల్పం కార్యరూపం దాలుస్తోంది. నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు క్రింద వై.యస్.ఆర్. జగనన్న కాలనీల్లో పేదల స్వంత ఇంటికల నెరవేర్చేందుకు జిల్లా యంత్రాంగం అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నది. జిల్లాలోని పక్కా గృహాలు లేనివారందరికీ జగనన్న కాలనీల్లో పట్టాలిచ్చి త్వరితగతిన గృహాలు నిర్మించి …

Read More »

రైతుల పాలిట వరం – రైతు భరోసా కేంద్రాలు…

-కొవ్వూరు వ్యవసాయ శాఖ సబ్ డివిజిన్ పరిధిలో 92 వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వ్యవసాయ ఆధారిత జిల్లాలో ధాన్యాగారంగా ప్రసిద్ధి చెందిన పశ్చిమగోదావరి జిల్లా లో 70 శాతం మంది వ్యవసాయ, అనుబంధ రంగాలపై ఆధారపడి ఉన్నారు. ప్రతి గ్రామంలో వ్యవసాయ అనుబంధ రంగముల సమస్యలు పరిష్కరించాలని గ్రామస్థాయి లో ఒక వ్యవసాయ అధికారిని నియమించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులకు భరోసా గా నిలిచేందుకు రైతు భరోసా …

Read More »

విజయవాడ కేంద్రంలో ఐఏఎస్ అకాడమీ ఏర్పాటు కావడం సంతోషదాయకం… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కోచింగ్ సెంటర్ విజ‌య‌వాడ న‌గ‌ర కేంద్రంలో యువ‌త‌కు అందుబాటులోకి రావ‌డం సంతోష‌దాయ‌క‌మ‌ని సెంట్రల్ నియోజ‌క‌వ‌ర్గ శాస‌న‌స‌భ్యులు  మ‌ల్లాది విష్ణు  అన్నారు. ఆంధ్రప్రభ కాలనీ తోట‌వారి వీధిలో విజయదర్శని ఐఏఎస్ అకాడమీని న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్యల‌క్ష్మి, డిప్యూటీ మేయ‌ర్ అవుతు శ్రీశైల‌జ రెడ్డి తో క‌లిసి ఆయ‌న ప్రారంభించారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ఒకప్పుడు ఐఏఎస్ కోచింగ్ అంటే హైద‌రాబాద్, బెంగుళూరు వెళ్లవ‌ల‌సి ఉండేద‌ని.. ఆ ప్రాంతాల‌కు ధీటుగా …

Read More »

గొలగాని రవి కృష్ణ ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గంలో ఆనందయ్య కరోనా మందు పంపిణీ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గొలగాని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, విజయవాడ చిరంజీవి యువత అధ్యక్షులు కటికి రాకేష్ నాథ్ ఆధ్వర్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, భానునాగర్, శ్రీనగర్ కాలనీ, గులాబితోట లో కృష్ణ పట్టణం బొనిగి ఆనందయ్య యాదవ్ కరోనా నివారణ మందు పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రవాసాంధ్రుడు గొలగాని రవికృష్ణ వారి గొలగాని చారిటబుల్ ట్రస్ట్  ద్వారా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో, 45 వయస్సు పైబడిన 2000 మందికి, కృష్ణ పట్టణం బొనిగి ఆనందయ్య యాదవ్  కరోనా నివారణ మందు …

Read More »

దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్న ప్రముఖులు… 

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఎం.శ్రీనివాసరావు, రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తి  జస్టిస్ ఎన్.జయసూర్య దంపతులు, పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు కిలారి రోశయ్యలు శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు స్వాగతం పలికారు. శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనం, పంచహారతుల సేవలో పాల్గొన్నారు. శ్రీ అమ్మవారి పంచహారతుల సేవానంతరము వేదపండితులు వేద ఆశీర్వచనము చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ, శ్రీ అమ్మవారి ప్రసాదములు, …

Read More »

పునరావాస ప‌నులు వేగ‌వంతం చేయండి : జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి

-భోగాపురం ఎయిర్ పోర్టు భూసేక‌ర‌ణ‌పై స‌మీక్ష‌ విజ‌య‌న‌గ‌రం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న భోగాపురం గ్రీన్‌ఫీల్డు అంత‌ర్జాతీయ విమానాశ్ర‌య నిర్మాణాన్ని త్వ‌ర‌గా పూర్తిచేసేందుకు వీలుగా నిర్వాసితుల పున‌రావాస ప‌నుల‌ను వేగ‌వంతం చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి జిల్లా అధికారుల‌ను ఆదేశించారు. నిర్వాసితుల కాలనీల నిర్మాణం, అక్క‌డ అవ‌స‌ర‌మైన సామాజిక వ‌స‌తుల క‌ల్ప‌న వంటి పనులు త్వ‌ర‌గా పూర్తిచేసిన‌ట్ల‌యితే నిర్వాసితులు త‌మ గ్రామాల‌ను ఖాళీ చేసే అవ‌కాశం ఉంటుంద‌ని, ఎయిర్ పోర్టు ప‌నులు చేప‌ట్టేందుకు అవ‌కాశం ఉంటుంద‌న్నారు. జిల్లా …

Read More »

అర్హులందరికీ “నేతన్న నేస్తం”…

-ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి మోహనరావు -ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక -చేనేత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ప్రదర్శనలు, ఉత్పత్తి ధరలకే విక్రయాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నేతన్న నేస్తం పథకం అర్హులైన ప్రతి నేత కార్మికుడికి చేరాలని ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి వెంకట నాగ మోహనరావు అన్నారు. విజయవాడ ఆప్కో కేంద్ర కార్యాలయంలో శనివారం చేనేత జౌళిశాఖ సంచాలకులు పడాల అర్జునరావుతో కలిసి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. నేతన్న నేస్తం లబ్ధిదారుల …

Read More »