విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆదివారం సాయంత్రానికి నాగార్జున సాగర్ డాం నుంచి మిగులు జలాలను విడుదల చేయనున్నారు. ఆదివారం అర్ధరాత్రి కి ఫుల్ రిజర్వాయర్ స్థాయికి చేరుకుంటుంది. ప్రారంభదశలో 2 లక్షల క్యూసెక్కుల వరకు వరద నీరు విడుదల ఉండవచ్చు. సోమవారం ఉదయం నుంచి 4.5 లక్షల క్యూసెక్కుల నుంచి 5 లక్షల వరకు పెరగనున్నట్లు జలవనరుల శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఈ నేపద్యంలో కృష్ణా జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఆదేశాలతో వరద ముంపు నివారణ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే కనకదుర్గమ్మ వారధి వద్ద, ప్రకాశం బ్యారేజ్ ఎగువన వైకుంఠపురం అవుట్ పాల్ sluice వద్ద ,పులిగడ్డ కం పౌండ్ వద్ద ఏ పీఎస్ ఆర్ యం సి హైస్కూల్, ఇసుక బస్తాలు సిద్ధం చేస్తున్నారు. గీత నగర్ కట్ట డి పి స్టేషన్ వద్ద వరద కట్ట గ్యాప్ లు పూడ్చే పనులు నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాలైన భూపేష్ గుప్తా నగర్ sluice గేట్, రణదీప్ నగర్, కృష్ణా నగర్ sluice గేట్ తదితర ప్రాంతాల్లో జలవనరుల శాఖ సీఐ తదితరులు పర్యటించి వరద ముంపు నివారణ చర్యలు పర్యవేక్షణ చేశారు. నగరంలో ని సాయిరాం కట్ పిస్సెస్ వద్ద ఆయిల్ ఇంజనన్లు, ఎలక్ట్రిక్ మోటార్లను తదితరలను సిద్ధంగా ఉంచి వరద ముంపు నివారణ చర్యలు చేపట్టారు.
Tags vijayawada
Check Also
4.06 లక్షల బాదితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు
-రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ …