Breaking News

2న నగర ప్రజల సమస్యల పరిష్కార వేదిక “స్పందన” : క‌మిష‌న‌ర్‌ ప్రసన్న వెంకటేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర ప్రజల సమస్యల పరిష్కార వేదికగా సోమవారం న‌గ‌ర పాల‌క సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యం మరియు సర్కిల్ కార్యాలయములలో “స్పందన” కార్యక్రమము జరుగుతుందని నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ ప్రకటన ద్వారా తెలియజేసారు. నగరపాలక సంస్థకు సంబంధించి ప్రజలకు మౌలిక స‌దుపాయ‌ల క‌ల్ప‌న‌లో ఇబ్బందులు, సమస్యలను పరిష్కరించుకొనుటకు ది.02.08.2021 సోమవారం ఉదయం 10.30 ని.ల నుంచి మద్యాహ్నం 1.00 గంట వరకు న‌గ‌ర పాల‌క సంస్థ‌ ప్ర‌ధాన కార్యాలయంలో మేయ‌ర్‌, క‌మిష‌న‌ర్ మరియు మూడు సర్కిల్ కార్యాలయములలో జోనల్ కమిషనర్ల అధ్యక్షతన “స్పందన ” కార్యక్రమం నిర్వ‌హించ‌బ‌డుతుంద‌న్నారు. నగర ప్రజలు వారు ఎదుర్కొంటున్న సమస్యల ఆర్జీలను తమ యొక్క అధార్ గుర్తింపు నకలు జతపరచి నేరుగా ప్ర‌ధాన కార్యాల‌యంలో మేయ‌ర్, క‌మిష‌న‌ర్ గార్లకు, లేదా సర్కిల్ కార్యాలయాల్లో జోనల్ కమీషనర్లకు ప్రజలు వారి సమస్యలను వివ‌రించ‌డం ద్వారా స‌మ‌స్య ప‌రిష్కారించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఈ అవకాశమును ప్రజలందరూ సద్వినియోగపరచుకొనవలసినదిగా కోరారు.

Check Also

ఆర్థిక సంక్షోభంలోనూ లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి అమలు చేసింది

-ప్రభుత్వ ఏర్పడిన మొదటి 100 రోజుల్లోనే లబ్ధిదారులకు హామీలను అమలు చేసింది -దేశంలోనే ఒక తిరుగులేని విధంగా ఎన్టీఆర్ భరోసా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *