Breaking News

Latest News

75 ల‌క్ష‌ల రూపాయ‌ల‌తో అత్యంత సుంద‌రంగా ఐలాండ్ పార్క్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : లెనిన్ సెంటర్ ఐలాండ్ పార్క్ ను మంత్రులు బోత్స‌స‌త్య‌నారాయ‌ణ‌ వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీకరీమున్నీసా, ఎమ్మెల్యే  మల్లాది విష్ణు, మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి, డిప్యూటి మేయ‌ర్లు బెలందుర్గ‌, ఆవుతు  శైల‌జారెడ్డి, న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్ ప్రారంభించారు. 23వ డివిజన్ లెనిన్ సెంటర్ లో ఐలాండ్ పార్క్ ను 75 ల‌క్ష‌ల రూపాయ‌ల వ్య‌యంతో చిన్నారుల‌కు న‌చ్చేవిధంగా అత్యంత సుంద‌రంగా నిర్మించ‌డం జ‌రిగింద‌ని న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్ తెలిపారు. …

Read More »

లోతట్టు ప్రాంత ప్రజలు సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిరావాలి… : క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్

-న‌గ‌రంలో మూడు చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణానది లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద ముంపు ప్రభావిత ప్ర‌జ‌లు పునరావాస కేంద్రములకు తరలిరావాల‌ని కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజి కి ఎగువ ప్రాంతాల నుండి వరద నీరు అధికంగా వ‌స్తున్న కార‌ణంగా కృష్ణానది లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాల‌ని క‌మిష‌న‌ర్ సూచించారు. గురువారం క‌మిష‌న‌ర్ అధికారుల‌తో క‌లిసి స్వ‌యంగా న‌గ‌ర పాల‌క సంస్థ అధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న ఏర్పాట్లు ను …

Read More »

విజయవాడను సుందర నగరంగా తీర్చిదిద్దుకుందాం : మంత్రి బొత్స సత్యనారాయణ 

-పచ్చదనం పెంపునకు ప్రతిన బూనుదాం : ఎమ్మెల్యే మల్లాది విష్ణు -వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా కండ్రికలో మొక్కలు నాటిన మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఒక మొక్కను నాటాలని ఏపీ పురపాలక శాఖామాత్యులు బొత్స సత్యనారాయణ  అన్నారు. జగనన్న పచ్చ తోరణం, వన మహోత్సవం కార్యక్రమాల్లో భాగంగా లెనిన్ సెంటర్ ఐలాండ్ పార్క్ ను మంత్రి  వెల్లంపల్లి శ్రీనివాసరావు , స్థానిక ఎమ్మెల్యే  …

Read More »

చిన్నారులకు తల్లిపాలు అందించటంలో అలక్ష్యం వద్దు…

-మహిళాభివృద్ది , శిశు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా -రూ.12.50 లక్షల వ్యయంతో నిర్మించిన వాష్ కాంప్లెక్స్ ప్రారంభం -సామాజిక బాధ్యతలో భాగంగా నిధులు సమకూర్చిన ఐటిసి -చిన్నారుల కోసం క్రీడా పరికరాల ఆవిష్కరణ, పుస్తకాల పంపిణీ -తల్లిపాల పట్ల అవగాహన ఉన్న బాలింతలకు ప్రత్యేక పురస్కారాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చిన్నారులకు తల్లి పాలను మించిన పోషకాహారం లేదని, పిల్లలకు తల్లిపాలు అందించటంలో ఎటువంటి అలక్ష్యం కూడదని రాష్ట్ర మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ …

Read More »

అనుభవజ్ఞులైన నలుగురు నెఫ్రాలజిస్టుల సారథ్యంలో ప్రీమియర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం…

-ప్రపంచస్థాయి ప్రమాణాలతో అత్యాధునిక కిడ్నీ వైద్యం -ఒకేచోట నెఫ్రాలజీ, యురాలజీ, పీడియాట్రిక్ నెఫ్రాలజీ తదితర సూపర్ స్పెషాలిటీ సేవలు -కిడ్నీ చికిత్సల కోసం అమెరికన్ కిడ్నీ ఇనిస్టిట్యూట్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా విశేషానుభవం కలిగిన నలుగురు నెఫ్రాలజిస్టుల సారథ్యంలో ప్రీమియర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రూపుదిద్దుకుంది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో, అత్యాధునిక వైద్య సేవలను ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ప్రీమియర్ హాస్పిటల్ ను స్థాపించినట్లు సంస్థ ఛైర్మన్, ప్రఖ్యాత నెఫ్రాలజిస్టు డాక్టర్ విఠల్ కుమార్ చుండ్రు తెలిపారు. నొవోటెల్ …

Read More »

జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ తో ప్రధాన కార్యదర్శులు సమావేశం…

-పార్టీ కార్యక్రమాల నిర్వహణ, ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతం, పర్యావరణ సమస్యలపై చర్చ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ చేపట్టే కార్యక్రమాలు, ఉత్తరాంధ్ర ప్రజల సమస్యలు, వాటి పరిష్కారం కోసం పార్టీపరంగా తీసుకోవాల్సిన చర్యలు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్  సూచించారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు టి.శివశంకర్, బొలిశెట్టి సత్య  బుధవారం  పవన్ కల్యాణ్ తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతంపై చర్చించారు. ఆ …

Read More »

ఒలింపిక్స్ పతకంతో హాకీ క్రీడకు పునర్ వైభవం

-చిరకాల స్వప్నం నెరవేర్చిన క్రీడాకారులకు శుభాకాంక్షలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాలుగు దశాబ్దాల తరవాత మన హాకీ క్రీడాకారుల బృందం ఒలింపిక్స్ లో దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. మన జాతీయ క్రీడ హాకీలో ఒలింపిక్స్ పతకం గెలుచుకోవాలని క్రీడాభిమానులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. 1980 మాస్కో ఒలింపిక్స్ తర్వాత ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్ లో మన హాకీ జట్టు కాంస్యం గెలుచుకొని క్రీడాభిమానుల కలను నెరవేర్చింది. మన్ ప్రీత్ సింగ్ నాయకత్వంలోని హాకీ బృందానికి నా తరఫున, …

Read More »

ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన భారత పురుషుల హాకీ జట్టును అభినందించిన గవర్నర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత పురుషుల హాకీ జట్టును ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ ప్రశంసించారు. మ్యాచ్‌లో జర్మనీని 5-4 తేడాతో ఓడించి భారతదేశాన్ని గెలిపించిన జట్టు సభ్యులు అంతా అభినందనీయులన్నారు. ఇది ఒక చారిత్రాత్మక సందర్భమని ప్రస్తుతించిన గౌరవ గవర్నర్ 41 సంవత్సరాల విరామం తర్వాత హాకీ క్రీడలో ఒలింపిక్స్ వేదికగా పతకం అందుకోవటం శుభ పరిణామమని పేర్కొన్నారు. భారత పురుషుల హాకీ జట్టు అత్యుత్తమ ప్రదర్శనతో దేశానికి గర్వకారణంగా …

Read More »

సచివాలయ ఉద్యోగులు సమయ పాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులోఉండాలి…

-నిర్ణీత సమయంలోనే ప్రజాసమస్యలు పరిష్కరించాలి… -ప్రభుత్వ పథకాల వివరాలను తెలియజేసే బోర్డులను ప్రదర్శించాలి… -గామల్లో ఫీవర్ సర్వే పక్కాగా నిర్వహించాలి… – కోవిడ్కట్టడికి “నోమాస్క్నోఎంట్రీ – “నోమాస్క్ – నోరైడ్”- “నోమాస్క్ – నోసేల్ “ -నినాదాలతో ప్రజలకు ప్రత్యేక అవగాహన కల్పించాలి… -ఆర్డీఓ శ్రీనుకుమార్ పెదపారుపూడి (భూషనగుళ్ల), నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయాలు ద్వారా ప్రజలకు అందిస్తున్నసేవలకు సంబందించి ఏఒక్ కఅంశం పెండింగ్ లో లేకుండా నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరిస్తూ బాధ్యతాయుతంగా విధులనునిర్వహించాలని ఆర్డీఓ జి. శ్రీనుకుమార్ సచివాలయ ఉద్యోగులను ఆదేశించారు. …

Read More »

గ్రామాల్లో ప్రజా ఆరోగ్యం కాపాడటం సర్పంచుల బాధ్యత : APSIRD జాయింట్ డైరెక్టర్ వరప్రసాద్

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు అల్లూరి బాపినీడు, పెండ్యాల రంగారావు డిగ్రీ కళాశాల లో కొవ్వూరు, చాగల్లు, దేవరపల్లి, తాళ్లపూడి మండలాలకు నిర్వహిస్తున్న సర్పంచుల శిక్షణా కార్యక్రమం కు AP SIRD జాయింట్ డైరెక్టర్ వరప్రసాద్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు ఈ సందర్భంగా సర్పంచుల నుద్దేశించి ప్రసంగిస్తూ శిక్షణ లో బోధించే అంశాలు మెలుకవలు శ్రద్ధ గా నేర్చుకుని గ్రామాల్లో సర్పంచులుగా విధి నిర్వ హణలో చిత్తశుద్ధి తో పనిచేసి పారిశుధ్యం, త్రాగునీటి సరఫరాలో శ్రద్ధ వహించి ప్రజల ఆరోగ్య భద్రతకు …

Read More »