-రైతుల సమస్యలన్నీ స్పందనలో పరిష్కరిస్తాం -రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : కాల్వ శివారు భూములకు కూడా సాగునీరు అందేలా రైతులతో చర్చించి గ్రామాలవారీగా రైతుల భూములకు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఆదేశించారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని వ్యవసాయశాఖ ఏడీ కార్యాలయంలో నిర్వహించిన రైతు స్పందన కార్యక్రమంలో భాగంగా పలువురు రైతులు వివిధ సమస్యల పరిష్కారంపై మంత్రి కొడాలి …
Read More »Latest News
గత రెండేళ్ళుగా పాలనలో అనేక సంస్కరణలను తీసుకువచ్చిన సీఎం జగన్మోహనరెడ్డి…
-పంటలను ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేస్తున్నాం… -24 గంటల్లో ఎరువులు, విత్తనాలను అందజేస్తున్నాం… : రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని -రైతు సమస్యల పరిష్కారం కొరకు ప్రతి నెల మొదటి, మూడవ, బుధవారాలలో రైతు స్పందన కార్యక్రమం -వ్యవసాయ అనుబంథ శాఖల అధికారులు రైతు స్పందన లో వచ్చే సమస్యలు సత్వర పరిష్కారం… : కలెక్టరు జె. నివాస్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహనరెడ్డి గత రెండేళ్ళుగా పాలనలో అనేక సంస్కరణలను తీసుకువచ్చారని …
Read More »శాఖల మధ్య సమన్వయం చేసుకుంటూ సమస్య పరిష్కారానికి కృషి చేయాలి…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : హౌసింగ్ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా పూర్తి చేసే విధానంలో శాఖల మధ్య సమన్వయం చేసుకుంటూ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని జాయింట్ కలెక్టర్(రెవెన్యూ), కొవ్వూరు డివిజిన్ హౌసింగ్ స్పెషల్ అధికారి డా.బి.ఆర్.అంబేద్కర్ ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాలను చేపట్టి పూర్తి చెయ్యడం లక్ష్యంగా అడుగులు వేసి, ప్రగతి చూపాలన్నారు. బుధవారం స్థానిక పురపాలక సంఘం కార్యాలయ సమావేశ మందిరంలో కొవ్వూరు డివిజిన్ లోని గృహ నిర్మాణాలు, వాటి అభివృద్ధిపై హౌసింగ్ సబ్ డివిజిన్ స్థాయి అధికారులతో హౌసింగ్, ఆర్ డబ్ల్యు …
Read More »అభివృద్ధి సంక్షేమ ఫలాలు అర్హులైన లబ్ధిదారులకు చేరే విధంగా చర్యలు తీసు కోవాలి… : జిల్లా జాయింట్ కలెక్టర్ డా.బి.ఆర్. అంబేద్కర్
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ సచివాలయాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు అర్హులైన లబ్ధిదారులకు చేరే విధంగా చర్యలు తీసు కోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా.బి.ఆర్. అంబేద్కర్ అన్నారు. బుధవారం కొవ్వూరు మండలంలో వేములూరు గ్రామ సచివాలయాన్ని, మొబైల్ డెలివరి యూనిట్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా, గ్రామ సచివాలయంలో పౌర సేవలను నిబద్ధతతో నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ సిబ్బంది తో పేర్కొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం …
Read More »చేతి వృత్తి దారుల జీవన ప్రమాణ స్దాయి పెంపుకు కృషి… : లేపాక్షి ఛైర్ పర్సన్ బడిగించల విజయలక్ష్మి
-ఎంఎల్ఎలు, ఎంఎల్ సిలు, ప్రజాప్రతినిధుల సమక్షంలో ప్రమాణ స్వీకారం -బడుగు బలహీన వర్గాల అభివృద్దికి కృషి చేయాలని వక్తల పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చేతి వృత్తిదారుల జీవన ప్రమాణ స్ధాయిని మరింత మెరుగు పరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని ఆంధ్రప్రదేశ్ చేతి వృత్తుల అభివృద్ది సంస్ధ (లేపాక్షి) ఛైర్ పర్సన్ బడిగించల విజయలక్ష్మి అన్నారు. విజయవాడ లేపాక్షి షోరూమ్ ఆవరణలో శాసన సభ్యులు, శాసన మండలి సభ్యుల సమక్షంలో బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సంస్ధ ఛైర్మన్ గా …
Read More »జనసేన ధార్మిక సేవ మండలి ఆధ్వర్యంలో అమ్మవారికి సారె సమర్పణ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆషాడ మాసం సందర్భంగా జనసేన ధార్మిక సేవ మండలి ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రిపై వేంచేసిన అమ్మవారికి సారె సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం కనకదుర్గ నగర్ వద్ద నుంచి మంగళవాయిద్యాల తో వందలాది మందితో అమ్మవారికి సారే సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విజయవాడ నగర అధ్యక్షుడు మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 25 మంది సభ్యులతో కనకదుర్గ …
Read More »ప్రక్క రాష్ట్రంలో ఉండి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న చంద్రబాబు… : మంత్రి వెలంపల్లి
-తాగునీరు, డ్రైనేజీ సమస్యను పరిష్కారించండి -నగర పర్యటనలో అధికారులకు మంత్రి వెలంపల్లి అదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రబాబు నాయుడు ప్రక్క రాష్ట్రంలో ఉండి, ప్రజలను తప్పదోవ పట్టించే విధంగా నిరసనలు చేయడం వారికే చెల్లిందని దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం పర్యటనలో 41వ డివిజన్ మసీదు రోడ్డు , హరిజనవాడ, దర్గా, ఆశ్రమం రోడ్డు పి.ఆర్.కె.బిల్డింగు రోడ్డు, సభాపతి రోడ్డు మీదుగా స్వాతి సెంటరు తదితర ప్రాంతాలను మంత్రి అధికారులతో కలిసి పర్యటించారు. స్థానికులను సమస్యలు …
Read More »అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం లో కులమతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. బుధవారం కృష్ణలంక ApSrm స్కూల్ ఆవరణలో స్థానిక 21 వ డివిజన్ కార్పొరేటర్ పుప్పాల కుమారి ఆధ్వర్యంలో జరిగిన జగనన్న బాటలో పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న అవినాష్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా …
Read More »దుర్గమ్మను దర్శించుకున్న శాసనసభ్యులు రవీంద్ర రెడ్డి…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మను కమలాపురం నియోజకవర్గ శాసనసభ్యులు రవీంద్ర రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు స్వాగతం పలికారు. శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనం అనంతరము వేదపండితులు వేద ఆశీర్వచనము చేసి శ్రీ అమ్మవారి ప్రసాదములు, చిత్రపటoను అందజేశారు.
Read More »లవ్లీనా పోరాటం స్ఫూర్తిదాయకం… : పవన్ కల్యాణ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : టోక్యో ఒలింపిక్స్ లో మన దేశానికి మూడో పతకాన్ని అందించిన యువ బాక్సర్ లవ్లీనా బొర్గోహెయిన్ కు నా తరఫున, జనసేన పక్షాన హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నానని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ జనసేన కార్యాలయం నుండి బుధవారం ఓ ప్రకటన విడుదల చేసారు. అంతర్జాతీయ క్రీడా వేదికలపై తొలి అడుగులు వేస్తున్న దశలోనే లవ్లీనా కాంస్య పతకం దక్కించుకోవడం యువ క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది. క్రీడల్లో గెలుపోటములు సహజం. అయితే ఎంత చిత్తశుద్ధితో పోరాడాం అనేది ముఖ్యం. …
Read More »