-పాల్గొన్న ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కబేళా ప్రాంతంలో బుధవారం గ్యార్మీ షరీఫ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మటన్ మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ముఖ్యఅతిథిగా హాజరై ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి గ్యార్మీ జెండాతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ పెద్దలు సయ్యద్ సలీం, తాజుద్దీన్, షేక్ బాషి, …
Read More »Latest News
తెలుగు ప్రజలందరి జీవితాల్లో ఆనందాల వెలుగులు నింపాలి… : ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చెడుపై మంచి సాధించిన విజయంగా, చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ ప్రతి ఇంటా ఆనందాల సిరులు కురిపించాలని విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) అభిలషించారు. తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా ఆనంద దీపాలు వెలగాలని ఆకాంక్షించారు.
Read More »రూ.2లక్షల యాభై వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ ఎల్.వో.సి అందజేత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గం 45వ డివిజన్ సితార సెంటర్ రామరాజు నగర్ కి చెందిన చుక్కా నాగరాజు తన బైపాస్ సర్జరీ కోసం తక్షణ ఆర్ధిక సాయంకై సీఎంఆర్ఎఫ్ కింద లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్.వో.సి) కి ఎంపి కేశినేని శివనాథ్ సాయంతో ఆర్జీ పెట్టుకున్నారు…మంజూరైన రూ.2 లక్షల యాభై వేల రూపాయల ఎల్.వో.సి ని బుధవారం చుక్కా నాగరాజు కుమారుడు చుక్కా రాజ్ కుమార్ కి ఎంపి కార్యాలయ సిబ్బంది అందజేశారు. బాధిత కుటుంబ సభ్యులు ఎంపి …
Read More »శానిటరీ సూపర్వైజర్ పదవీ విరమణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థలు సానిటరీ సూపర్వైజర్ గా విధులు నిర్వహిస్తున్న కే. రాఘవ నవ కిషోర్ కి విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని సమావేశపు హాల్లో పదవి విరమణ వేడుకలను ప్రజారోగ్య విభాగం నిర్వహించారు. అక్టోబర్ 31, 2024 సెలవు దినము కావున అక్టోబర్ 30, 2024 న సీఎంహెచ్ డాక్టర్ సురేష్ బాబు గారి అధ్యక్షతన అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్) డాక్టర్ డి చంద్రశేఖర్ అతిధిగా సభను నిర్వహించి వారికి …
Read More »నగర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర ప్రజలకు దీపావళి సందర్భంగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి కమిషనర్ ధ్యానచంద్ర. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకొని దీపావళి పండుగను సురక్షితంగా, హరిత బాణసంచా కాల్చుకోవాలని, వాతావరణ కాలుష్యాన్ని కాపాడాలని సూచించారు. టపాసులు కాల్చుకునే సమయంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలందరూ సంతోషకరంగా దీపావళి పండుగను జరుపుకోవాలని బుధవారం నాడు విడుదల చేసిన ప్రకటనలో కోరారు.
Read More »పారిశుధ్య నిర్వహణలో అలసత్వం వహించరాదు
-శానిటరీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పారిశుధ్య నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా 43వ డివిజన్లో ఊర్మిళ నగర్ మరియు కబేళ పరిసర ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడం గమనించి పారిశుద్ధ్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుధ్య నిర్వహణలో అలసత్వం వహించరాదాని, పారిశుధ్య కార్మికులు నిత్యం …
Read More »ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడం పట్టభధ్రులు బాధ్యతగా భావించాలి
-యువతకు ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ ప్రధాన ఏజెండా -ఎన్టీఆర్ సర్కిల్‌లో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గద్దె రామమోహన్, గద్దె అనురాధ, వారి తనయుడు గద్దె క్రాంతికుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : త్వరలో జరగనున్న పట్టభద్రుల శాసనమండలి సభ్యుల ఎన్నికల్లో పట్టభద్రులు వారి ఓటు హక్కు వినియోగించుకోవడాన్ని బాధ్యతగా భావించాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని ఆయన అన్నారు. మంగళవారం ఉదయం …
Read More »క్లైమేట్ యాక్షన్ ప్లాన్ క్యాంపెయిన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : Maris Stella kalasala మరియు రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్ర ప్రదేశ్ సంయుక్తం గా క్లైమేట్ యాక్షన్ ప్లాన్ క్యాంపెయిన్ ను నిర్వహించారు. ఈ కార్య క్రమానికి Rtd ఐఏఎస్ అధికారి ఎ కె పరీద, మరియు ఆర్బ్స్ కుమార్ రెడ్ క్రాస్ ఏపీ కోఆర్డినేటర్ అతిథులు గా విచ్చేసి క్లైమేట్ చేంజ్ వల్ల సంభవించే పరిణామాలు చర్చించారు. యువత పపర్యవరణ పరిరక్షణ లో భాగస్వాములు కావాలని ఈ వాలంటీర్ నమోదు ప్రక్రియ ను మొదలు పెట్టారని …
Read More »గవర్నర్ అబ్దుల్ నజీర్ ని కలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజ్ భవన్ కు వెళ్లి కలిశారు. తన సతీమణి భువనేశ్వరితో కలిసి రాజ్ భవన్ కు వెళ్లిన చంద్రబాబు..గవర్నర్ దంపతులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల అస్వస్థకు గురైన గవర్నర్ సతీమణి సమీరా నజీర్ గారి ఆరోగ్య పరిస్థితిని గురించి సీఎం చంద్రబాబు, భువనేశ్వరి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Read More »ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసిన హోంమంత్రి అనిత
-రాష్ట్రంలో శాంతిభద్రతలు, దీపావళి ముందస్తు భద్రతా ఏర్పాట్లపై చర్చ -పాయకరావుపేట నియోజకవర్గ అభివృద్ధి పనులపై చొరవ చూపాలని హోంమంత్రి వినతి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో హోంమంత్రి వంగలపూడి అనిత మంగళవారం సమావేశమయ్యారు. మంగళగిరిలోని ఉపముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని శాంతిభద్రతలు, దీపావళి ముందస్తు భద్రతా ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ .. ఎక్కడ ప్రమాదం జరిగినా అప్రమత్తంగా ఉండేలా 185 అగ్నిమాపక స్టేషన్లను ఏర్పాటు చేయడమే …
Read More »