విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థలు సానిటరీ సూపర్వైజర్ గా విధులు నిర్వహిస్తున్న కే. రాఘవ నవ కిషోర్ కి విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని సమావేశపు హాల్లో పదవి విరమణ వేడుకలను ప్రజారోగ్య విభాగం నిర్వహించారు. అక్టోబర్ 31, 2024 సెలవు దినము కావున అక్టోబర్ 30, 2024 న సీఎంహెచ్ డాక్టర్ సురేష్ బాబు గారి అధ్యక్షతన అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్) డాక్టర్ డి చంద్రశేఖర్ అతిధిగా సభను నిర్వహించి వారికి వీడ్కోలు పలికారు. ఈ సభలో అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు డాక్టర్ రామకోటేశ్వరరావు, డాక్టర్ బాబు శ్రీనివాస్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి ఎస్ సోమశేఖర్ రెడ్డి, బయాలజిస్ట్ సూర్య నాయక్, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, హెల్త్ అసిస్టెంట్లు వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు APMESA సెక్రటరీ మరియు హెల్త్ సెక్షన్స్ సంబంధించిన మినిస్ట్రీస్ స్టాప్ సూపరింటెండెంట్, మేస్త్రీలు సెక్రటరీలు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు పాల్గొని వీడ్కోలు పలికారు.
Prajavartha Online Telugu News