Breaking News

ఘనంగా గ్యార్మీ వేడుకలు

-పాల్గొన్న ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కబేళా ప్రాంతంలో బుధవారం గ్యార్మీ షరీఫ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మటన్ మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ముఖ్యఅతిథిగా హాజరై ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి గ్యార్మీ జెండాతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ పెద్దలు సయ్యద్ సలీం, తాజుద్దీన్, షేక్ బాషి, ఉస్మాన్, బాజీ, సయ్యద్ సలీం, అబ్దుల్ వాహాబ్, స్థానిక ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *