-దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు ప్రజలందరికీ దీపావళి పండుగ సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు బుధవారం ఎంపి కేశినేని శివనాథ్ ఒక ప్రకటన విడుదల చేశారు. “తెలుగునేలపై నరకాసురుని ఏలుబడిలో ఇక్కట్ల పాలైనసమస్త ప్రజలు చీకటి పాలనకు స్వస్తి వాచకం పలికారు. అంధకారం తొలిగిపోయి..ఎన్డీయే కూటమి అధికారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో వెన్నెల వెలుగు తెలుగు లోగిళ్లలో ప్రసరిస్తుంది. రాష్ట్రం అభివృద్ధి దిశలో పయనిస్తోంది. ఈ శుభ సమయంలో విచ్చేసిన..తొలి దివ్య దీపావళికి స్వాగతం..సుస్వాగతం..వెలుగుల పండుగ దీపావళి – ప్రజల జీవితాల్లో సరికొత్త కాంతులు నింపాలి ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల మధ్య, సురక్షితంగా… ఈ వెలుగుల పండుగను జరుపుకోవాలి . ఈ దీపాల పండుగ ప్రజల జీవితాల్లో సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు, తీసుకురావాలి. వాతావరణ కాలుష్యం పట్ల అప్రమత్తంగా ఉండి పర్యావరణాన్ని రక్షించు కుందాం” అని ఎంపి కేశినేని శివనాథ్ ఆకాంక్షించారు.
Prajavartha Online Telugu News