Breaking News

రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్

-చీకటిపై “వెలుగు”, చెడుపై “మంచి”..విజయానికి ప్రతీక దీపావళి అని పేర్కొన్న మంత్రి
-ప్రజలందరి జీవితాల్లో కష్టాల చీకట్లు తొలగిపోయి సంతోషాల వెలుగులు ప్రసరించాలని దేవున్ని ప్రార్థించిన మంత్రి దుర్గేష్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. టపాసుల వెలుగులతో, దీప కాంతుల జ్యోతులతో, సిరసంపద రాసులతో ఈ దీపావళి ప్రతి ఇంట సిరుల పంట కురిపించాలని కోరుకుంటున్నానన్నారు.. కారు చీకట్లను దీపాల కాంతులు తరిమేసినట్లుగా ప్రజల కష్టాలను తరిమేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. చీకట్లను చెరిపేసే దీపావళి పండుగ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు తేవాలని, ఒక్కొక్క దీపం వెలిగిస్తూ చీకట్లని పారద్రోలినట్లుగా.. ఒక్కొక్క మార్పు సాధించుకుంటూ బంగారు భవిష్యత్ ను నిర్మించుకుందామని సూచించారు. అష్టలక్ష్ములు ప్రతి ఇంట్లో నెలవై సకల శుభాలను, ధైర్యాన్ని, స్థైర్యాన్ని, విజయాలను, సిరి సంపదలను, సుఖ సంతోషాలను ప్రసాదించాలని, తెలుగింటి లోగిళ్లన్నీ దీప కాంతులతో వెలుగులీనాలని, ఈ దీపావళి మీ జీవితంలో వెలుగులు నింపాలని, సరికొత్త వెలుగులతో ప్రజల జీవితాలు మరింత ప్రకాశించాలని ఆకాంక్షిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ పండగను ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలని, టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్త వహించాలని మంత్రి దుర్గేష్ సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజక వర్గాల పునర్విభజన అధ్యయనానికి జనసేన కమిటీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజన (డీ లిమిటేషన్) జరిగే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *