Breaking News

Telangana

మత్య్సకారుల ఆర్థిక మూలాలను దెబ్బ తీసే ప్రయత్నాలను సర్కార్ మానుకోవాలి…

-జనసేన మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర కమిటీ సమావేశంలో పవన్ కల్యాణ్  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సంప్రదాయంగా, వారసత్వంగా వస్తున్న చేపల వేట, అమ్మకాలపై ఆధారపడ్డ మత్స్యకారుల జీవనోపాధికి గండికొట్టి, వారి ఆర్థిక మూలాలను దెబ్బ తీసే ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం విడనాడాలని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్  స్పష్టం చేశారు. చెరువులు, రిజర్వాయర్లు లాంటి చోట్ల మత్స్యకార సొసైటీ సభ్యులకు చేపలు వేటాడుకొనే అవకాశం లేకుండా చేస్తున్న జీవో 217 విషయంలో జనసేన పార్టీ ఎలా పోరాడాలనే విషయంలో ఒక …

Read More »

హోమం లో “కాలభైరవ” దర్శనం…

-భక్తి పారవశ్యానికి లోనైన భక్తులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భక్తులను అనుగ్రహించేందుకు భగవంతుడు అనేక రూపాలలో దర్శన భాగ్యం కలుగ చేస్తూ ఉంటారు. విజయవాడ రూరల్ మురళి నగర్ గ్రామంలో గురువారం ఉదయం హవనం నిర్వహించగా అద్భుత రూపం భక్తులకు దర్శనమిచ్చింది.బ్రహ్మశ్రీ మావుడురు సతీష్ కుమార్ శర్మ,రవీంద్ర కుమార్ శర్మ ల ఆధ్వర్యం లో ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన హోమంలో ప్రతి ఒక్కరూ ఆశ్చర్య పరిచే విధంగా ఒక క్షణం పాటు కాలభైరవ దర్శనం భక్తులందరికీ కలిగింది. హోమం నిర్వహిస్తున్న …

Read More »

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన డా.సమీర్ శర్మ

-సియం ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తాను… -నవరత్నాలు విజయవంతంగా అమలయ్యేందుకు కృషి చేస్తాను… అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి సిఎస్ గా అన్ని విధాలా తనవంతు కృషి చేస్తానని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన డా.సమీర్ శర్మ పేర్కొన్నారు. గురువారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యానాధ్ దాస్ నుండి సిఎస్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డా.సమీర్ శర్మ మాట్లాడుతూ తనకు సిఎస్ గా పనిచేసేందుకు …

Read More »

‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్‌ మిషన్‌’లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలి… : ఉపరాష్ట్రపతి

-భారతదేశ ప్రజారోగ్య సంబంధిత విషయంలో ఇదో విప్లవాత్మకమైన ముందడుగు -కేన్సర్ చికిత్సలో కౌన్సిలింగ్‌ పాత్ర కీలకమన్న ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు -కేన్సర్ వ్యాధి చికిత్స ఖర్చును చాలా తగ్గించాల్సిన అవసరం ఉంది -రొమ్ము కేన్సర్ బాధితుల కోసం జాతీయ హెల్ప్‌ లైన్ ‘యూబీఎఫ్ హెల్ప్’ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశంలో ప్రజారోగ్య సంబంధిత విషయంలో విప్లవాత్మక మార్పు అయిన ‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్‌ మిషన్‌’లో ప్రతి భారతీయుడు స్వచ్ఛందంగా భాగస్వామి కావాల్సిన అవసరం ఉందని గౌరవ ఉపరాష్ట్రపతి ముప్పవరపు …

Read More »

విజయవాడలో పార్లమెంట్‌ సభ్యులతో సమావేశం నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దక్షిణ మధ్య రైల్వే విజయవాడ, గుంటూరు మరియు గుంతకల్‌ డివిజన్ల పరిధిలోకి వచ్చే ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహిస్తున్న పార్లమెంట్‌ సభ్యులతో సమావేశం నిర్వహించింది. విజయవాడ సత్యనారాయణపురంలోని ఎలక్ట్రికల్‌ ట్రాక్షన్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ (ఈటీటీసీ)లో నేడు అనగా 30 సెప్టెంబర్‌ 2021 తేదీన నిర్వహించిన ఈ సమావేశానికి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన 15 మంది  పార్లమెంట్‌ సభ్యులు హాజరయ్యారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌  గజానన్‌ మాల్య, వివిధ విభాగాల ఉన్నతాధికారులు మరియు …

Read More »

ఆంధ్రప్రదేశ్ ను దేశంలో ఉత్తమ రాష్ట్రంగా చేయాలన్నదే నాలక్ష్యం… : ఆదిత్యానాధ్ దాస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా నిలపాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసి త్వరలో ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా బాధ్యతలు చేపట్టనున్న ఆదిత్యానాధ్ దాస్ పేర్కొన్నారు. గురువారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకు సియం సమావేశ మందిరంలో సాధారణ పరిపాలన శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేస్తున్న ఆదిత్యానాధా దాస్ కు వీడ్కోలు, నూతన సిఎస్ గా బాధ్యతలు చేపడుతున్న డా.సమీర్ శర్మ కు స్వాగత సభ …

Read More »

సుబాబుల్ రైతులకు న్యాయం జరిగేలా త్వరలో విధి, విధానాలు…

-అక్టోబరు 10 కల్లా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసేందుకు నిర్ణయం -పేపర్ మిల్స్,వ్యాపారులు,రైతు సంఘాల ప్రతినిధులతో మంత్రుల బృందం చర్చలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సుబాబుల్ రైతుల సమస్యలను పరిష్కరించి, వారి ఉత్పత్తులకు పేపర్ మిల్స్ నుండి తగిన మద్దతు ధర అందే విధంగా తగు విధి, విధానాలను రూపొందించి అక్టోబరు 10 లోపు ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేయాలని మంత్రి వర్గ సబ్ కమిటీ నిర్ణయించింది. ప్రభుత్వం నియమించిన మంత్రి వర్గ సబ్ కమిటీ సభ్యులు కురసాల కన్నబాబు, పెద్దిరెడ్డి …

Read More »

అక్టోబర్ 2న నగరంలో మాంసపు మరియు చేపల విక్రయాలు నిషేధం…

-నిబందనల అతిక్రమించిన యెడల చర్యలు తప్పవు -నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గాంధీ జయంతి సందర్బంగా అక్టోబర్ 2 తేదిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ దినముగా ప్రకటించి సెలవు మంజూరు చేయడం జరిగింది. గాంధీ జయంతి రోజు నగరపాలక సంస్థ కబేళా సెలవు ప్రకటించుట జరిగిందని నగర కమీషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ తెలియజేసినారు. విజయవాడ నగర పరిధిలో గల అన్ని చికెన్, మటన్ మరియు చేపల మార్కెట్లకు కూడా సెలవు ప్రకటించడమైనది. నగరపాలక సంస్థ నిబందనల …

Read More »

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా-ఆజాది కా అమ్రిత్ మహోత్సవ్  పోస్టర్ ఆవిష్కరణ… 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గవర్నమెంట్ ఆఫ్ ఇండియా-ఆజాది కా అమ్రిత్ మహోత్సవ్ (Govt of India – Azadi Ka Amrit Mahotsav) లో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ అద్వర్యంలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమములకు సంబంధించిన పోస్టర్ ను నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం అనంతరం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ డిప్యూటీ మేయర్లు మరియు అధికారులతో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్బంలో కమిషనర్ మాట్లాడుతూ 29వ తేది  సెప్టెంబర్ నుండి 3వ తేది …

Read More »

రెండోవ బ్యాచ్ ఉప సర్పంచ్ లకు, వార్డు సభ్యులకు అక్టోబర్ 5, 6 తారీఖుల్లో శిక్షణా తరగతులు… : పి.జగదాంబ

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజలచే ఎన్నుకోబడి ప్రజా ప్రతినిధులకి వారి అధికారాలపై స్పష్టమైన వైఖరి , అవగాహన ఉండాలని ఎంపీడీఓ పి. జగదాంబ పేర్కొన్నారు. గురువారం స్థానిక ప్రభుత్వ బాలుర పాఠశాల లో కొవ్వూరు మండలం పరిధిలోని ఉపసర్పంచ్‌లు, వార్డుసభ్యులకుమాస్టర్ ట్రైనర్స్ తో రెండవ రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జగదాంబ మాట్లాడుతూ, రెండు రోజుల శిక్షణా కార్యక్రమంలో భాగంగా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల అధికారాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. కేంద్ర, …

Read More »