Breaking News

Telangana

జిల్లాలో ప్ర‌శాంతంగా ముగిసిన గ్రూప్‌-2 స్క్రీనింగ్ ప‌రీక్ష‌

– ప‌రీక్ష‌కు 83.31 శాతం హాజ‌రు: జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లాలో ఆదివారం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ)- గ్రూప్‌-2 స్క్రీనింగ్ ప‌రీక్ష ప్ర‌శాంతంగా ముగిసిన‌ట్లు క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. జిల్లాలో 54 కేంద్రాల్లో 24,373 మంది అభ్య‌ర్థుల‌కు ప‌రీక్ష రాసేందుకు ఏర్పాట్లు చేయ‌గా.. 20,304 (83.31 శాతం) మంది ప‌రీక్ష‌కు హాజ‌రైన‌ట్లు వెల్ల‌డించారు. ప‌రీక్ష‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌డంలో భాగ‌స్వాములైన కోఆర్డినేటింగ్‌, క‌స్టోడియ‌న్‌, రూట్‌, లైజ‌నింగ్ అధికారులు, సూప‌ర్‌వైజ‌ర్లు త‌దిత‌రుల‌కు అభినంద‌న‌లు …

Read More »

నిరుపేదలకు వరం ముఖ్యమంత్రి సహాయ నిధి:దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా ఆర్థిక పరిస్థితులు కారణముగా వైద్యానికి దూరం కాకూడదు అనేదే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు.ఆదివారం నాడు అనారోగ్యంతో బాధపడుతూ ఆరోగ్య శ్రీ పరిధిలోకి రాని వైద్య సేవలు పొందిన వారు తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి కొరకు అర్జీలు పెట్టుకోగా నియోజకవర్గ పరిధిలోని 5వ డివిజన్ కి చెందిన తోట లక్ష్మి …

Read More »

దేవినేని నెహ్రు చారిటబుల్ ట్రస్టు ద్వారా తోపుడు బండ్ల పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ గుణదల పోస్టు ఆఫీసు రోడ్డు నందు ఉపాధి నిమిత్తంగా దేవినేని నెహ్రు చారిటబుల్ ట్రస్టు ద్వారా సాయం చేసిన తోపుడు బండ్లను తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ ప్రారంభించారు. ఐదు నిరుపేద కుటుంబాలకు జీవనోపాధి నిమిత్తం దాదాపు రూ.2,00,000/- విలువ చేసే 3ఇస్త్రీ బండ్లు,1టిఫిన్ బండి,1తోపుడు బండ్లును అందజేసినట్లు దేవినేని అవినాష్ చెప్పారు .. తన పుత్రరత్నం నారా లోకేశ్ అభివృద్ధి కోసమే రాష్ట్రంలోని టీడీపీ జనసేన కూటమీ …

Read More »

“మీ అవినాష్ అన్న హామీ”…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ పరిధిలోని Esi హాస్పిటల్ రోడ్,హరిజనవాడ రోడ్,ఓల్డ్ పంచాయతీ రోడ్ ప్రాంతాలలో వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలిసి దేవినేని అవినాష్ సోదరి క్రాంతి గడప గడపకి వెళ్లి ఈ నాలుగున్నర ఏళ్ల జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురుంచి వివరించి,అభివృద్ధి కార్యక్రమాలను “మీ అవినాష్ అన్న హామీ” పేరుతో ముద్రించిన మ్యానిఫెస్టో కరపత్రాలు అందించి,ఇచ్చిన మాట ప్రకారం 2024 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆధికారం లోకి వచ్చిన వెంటనే ఈ హామీలు ఆన్ని నెరవేరుస్తామని …

Read More »

తుది జాబితా విడుదలైతే మాత్రం వైసీపీ మైండ్ బ్లాంక్ అవడం ఖాయం… : బోండా ఉమామహేశ్వరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రబాబు, పవన్ కల్యాణ్ విడుదల చేసిన మొదటి జాబితాకే తాడేపల్లి ప్యాలెస్ కంపించిపోయిందని, ఇక తుది జాబితా విడుదలైతే మాత్రం వైసీపీ మైండ్ బ్లాంక్ అవడం ఖాయం అని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. శనివారం  మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ-జనసేన 118 స్థానాలు ఒకేసారి ప్రకటించిందన్నారు. అంతా సాఫీగా జరిగిందని, వైసీపీలా కుదుపులేమీ లేవన్నారు. 80 సీట్లు ప్రకటించడానికే వైసీపీ అల్లకల్లోలమైందని విమర్శించారు. ఆ పార్టీకి చెందిన ఎంతో మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇప్పటికే …

Read More »

రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మా మద్ధతు టిడిపి కే : మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి

-రాష్ట్ర ప్రజలను చేసిన మోసాలను ఎండగడుతూ జగ్గూ భాయ్ తిరస్కార పత్రం పేరున శీర్షిక ఆవిష్కరణ -రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ప్రకటన -రానున్న 5సం||లకు MHPS రాష్ట్ర అధ్యక్షులుగా మరల ఫారూఖ్ షిబ్లీ ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు -రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో యం.హెచ్.పి.యస్. ఏకగ్రీవ తీర్మానం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గద్దెనెక్కడం కోసం రాష్ట్రంలోని యస్సీ, యస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు ప్రతి వర్గాన్ని తప్పుడు హామీలు, వైసిపి ప్రభుత్వ అన్యాయాలను, దౌర్జన్యాలను ప్రశ్నించినవారిపై భౌతిక …

Read More »

చంద్రబాబును కలిసిన మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నేతలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకే తమ సంపూర్ణ మద్ధతని మైనారిటీ హక్కుకల పరిరక్షణ సమితి నేతలు స్పష్టం చేశారు. ముస్లింలపై దమనకాండను సాగించిన వైసీపీ ప్రభుత్వానికి ఎన్నికల్లో బుద్ధి చెప్తామన్నారు. ఉండవల్లిలో శనివారం చంద్రబాబును కలిసి ‘తిరస్కార పత్రం జగ్గూభాయ్ రిపోర్ట్ కార్డ్ 2019-2024’ కరపత్రాన్ని ఆవిష్కరింపజేశారు. మైనారిటీ హక్కుకల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన ఫారూఖ్ షిబ్లీకి చంద్రబాబు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. 49 నియోజకవర్గాల్లోని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి సభ్యుల …

Read More »

టీడీపీ, జనసేన తొలి జాబితా

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశామని, విద్యావంతులకు, యువతకు ప్రాధాన్యం ఇచ్చామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మహిళలకు అవకాశం కల్పించడంతో పాటు ప్రజల మధ్యే ఉండి ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కునే వారిని అభ్యర్థులుగా ప్రకటించామని వివరించారు. టీడీపీ-జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి శనివారం ప్రకటించారు. టీడీపీ, జనసేన పార్టీలు నేడు తొలి జాబితా ప్రకటించాయి. 94 …

Read More »

554 అమృత్ స్టేషన్లు మరియు 1,500 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు / వంతెనల కింద రోడ్డు లకు శంకుస్థాపన / ప్రారంభోత్సవం చేసి జాతికి అంకితం చేయడానికి ప్రధాన మంత్రి

-దక్షిణ మధ్య రైల్వేలో రూ. 1,800 కోట్లు కంటే ఎక్కువ విలువైన ప్రాజెక్ట్‌లు ఇందులో భాగం -తెలంగాణలో 15 స్టేషన్లు, ఆంధ్రప్రదేశ్‌లో 34 స్టేషన్లు, మహారాష్ట్రలో 6 స్టేషన్లు మరియు కర్ణాటకలో 2 స్టేషన్లు కలిపి దాదాపు రూ. 925 కోట్లు -ఇందులో జోన్ అంతటా 156 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు / రోడ్ అండర్ బ్రిడ్జిలు కలిపి దాదాపు రూ. 927.31 కోట్లు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతీయ రైల్వేలలో పరివర్తనాత్మక వృద్ధి లో మరొక ప్రధాన మైలురాయిని అధిగమిస్తూ …

Read More »

విద్యార్థులు పుస్తక పఠనం అలవర్చుకోవాలి

-సీమ్యాట్ డైరెక్టర్ వి.ఎన్.మస్తానయ్య, ఎన్టీఆర్ డీఈవో యు.వి.సుబ్బారావు -విజయవాడలో జీడీఈటీ మున్సిపల్ హైస్కూలుకు పుస్తకాలు బహూకరించి ఎన్ఆర్ఐ వాసవీ అసోషియేషన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులు పాఠ్య పుస్తకాలతో పాటు విజ్నాన సంబంధిత పుస్తకాలు కూడా చదవడం వల్ల మేథో సంపత్తి పెరుగుతుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవర్చుకోవాలని సీమ్యాట్ డైరెక్టర్ వి.ఎన్.మస్తానయ్య అన్నారు. శనివారం విజయవాడ పట్టణంలోని ఎన్ఆర్ఐ వాసవీ అసోషియేషన్ జీడీఈటీ మున్సిపల్ హైస్కూలుకు పుస్తకాలు బహూకరించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘ఎన్ఆర్ఐ వాసవీ …

Read More »