Breaking News

Daily Archives: July 19, 2024

జూలై 21న పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌

తిరుమ‌ల, నేటి పత్రిక ప్రజావార్త : గురు పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 21న ఆదివారం గరుడసేవ జరుగనుంది. ప్రతినెల పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ చేస్తారు విషయం విదితమే.ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షిస్తారు.

Read More »

ఎన్‌డిఎ ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలుతోంది… : కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో ఎన్‌డిఎ ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలుతోందని కాంగ్రెస్‌ పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌ విమర్శించారు. శుక్రవారం గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం వచ్చాక సామాన్యులు జీవించలేని పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ధరలను స్థిరీకరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయన్నారు. బిజెపి పాలిత రాష్ట్రమైన మహారాష్ట్రలో ఐఎఎస్‌ అధికారుల పోస్టింగుల కోసం మంత్రులు రూ.ఐదు కోట్లతో వేలం నిర్వహించడం సిగ్గుచేటని, ఇది ఎన్‌డిఎ అవినీతికి పరాకాష్ట అని …

Read More »

విద్యార్థుల‌కు నాణ్య‌మైన విద్య‌ను అందించేందుకు కృషి

– మౌలిక స‌దుపాయాలు, మ‌ధ్యాహ్న భోజ‌న నాణ్య‌త‌పైనా ప్ర‌త్యేక దృష్టి – సీజ‌న‌ల్ వ్యాధులకు అడ్డుక‌ట్ట వేసేందుకు ప్ర‌జా భాగ‌స్వామ్యం అవ‌స‌రం – ఈ దిశ‌గా జ‌న జాగృతి కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌ – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాఠ‌శాల‌ల్లో విద్యార్థుల‌కు నాణ్య‌మైన విద్య‌ను అందించేందుకు ప్ర‌త్యేకంగా కృషి చేయ‌డం జ‌రుగుతుంద‌ని.. ఉపాధ్యాయులు త‌ప్ప‌నిస‌రిగా టీచింగ్ ప్లాన్ ప్ర‌కారం బోధ‌న జ‌రిపేలా, మంచి బోధ‌న ఫ‌లితాలు ల‌భించేలా మార్గ‌నిర్దేశ‌నం చేస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న …

Read More »

స్కిల్ హబ్ లో శిక్షణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు మరియు విద్యార్థులకు ఇప్పటికే వివిధ రకాల ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ కోర్సుల ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్. పి. నరేష్ కుమార్ మాట్లాడుతూ, ఈ శిక్షణలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మన విజయవాడలోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలో ఉన్నటువంటి స్కిల్ హబ్ లో ఫోర్ వీలర్ సర్వీస్ టెక్నీషియన్ కోర్స్ నాల్గవ …

Read More »

పొందూరు ఖాదీపై వీడియో పోటీలు

-ఏపీ చేనేత మరియు జౌళి శాఖ ఆధ్వర్యంలో పోటీల నిర్వహణ -వీడియోల సమర్పణకు ఆగష్టు 1వ తేదీ ఆఖరు – కె. శ్రీకాంత్ ప్రభాకర్, ఏపీ చేనేత మరియు జౌళి శాఖ కమిషనర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగష్టు 7న పొందూరు ఖాదీపై వీడియో పోటీలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర చేనేత మరియు జౌళి శాఖ కమిషనర్ కె. శ్రీకాంత్ ప్రభాకర్ శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో ప్రజల్లో చైతన్యం …

Read More »

26 జిల్లాల వ్యవసాయాధికారులతో వీడియో కాన్ఫరెన్సు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖకునూతన సంచాలకులు (డైరెక్టర్)గా బాధ్యతలు చేపట్టిన ఎస్. డిల్లిరావు IAS ఈరోజు అనగా 19-7-24 శుక్రవారం మొదట సారిగా రాష్ట్రంలోని 26 జిల్లాల వ్యవసాయాధికారులు, సహాయ వ్యవసాయ అధికారులు మరియు మండల వ్యవసాయాధికారులతో మంగళగిరి కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కువ ప్రాంతాలలో వర్షాలుకురుస్తున్నప్రస్తుత పరిస్థితులలో రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులు, వ్యవసాయసాగు పంటలు, సాధారణ వర్షపాతము, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, పంట కాల్వలలో నీటి లభ్యత తదితర విషయాలపై ఆరా తీసారు. …

Read More »

ఈనెల 22 నుండి అసెంబ్లీ సమావేశాలు-పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయండి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 22వ తేదీ నుండి జరగనున్నఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ సమావేశాలు సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కె.మోషేన్ రాజు, శాసన సభాపతి సిహెచ్.అయ్యన్నపాత్రుడు పోలీస్ శాఖ అధికారులను ఆదేశించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా చేపట్టాల్సిన బందోబస్ధు ఏర్పాట్లపై వారు శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీ భవనంలో పోలీస్ శాఖ అధికారులతో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర శాసన మండలి …

Read More »

జస్టిస్ ఎవి రవీంద్రబాబు సేవలు ప్రసంశనీయం

-హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా జస్టిస్ ఎవి రవీంద్రబాబు అందించిన సేవలు ప్రసంశ నీయమైనవని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలు అందజేస్తున్న జస్టిస్ ఎవి రవీంద్రబాబు పదవీ విరమణ చేయనున్న నేపధ్యంలో శుక్రవారం హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఈ వీడ్కోలు కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ …

Read More »

అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరిగేలా చూడాలి

-రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు,శాసన సభాపతి సూచన. -ప్రభుత్వానికి,ఉభయ సభలకు మధ్య పూర్తి సమన్వయ ఉండేలా అధికారులు చూడాలి,సభల్లో ప్రతి ఒక్క సభ్యునికి గౌరవం దక్కాలి -శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు -అధికారులు సంపూర్ణమైన సమాచారం నిర్ధిష్ట సమయంలోపు మంత్రులకు అందజేయాలి. శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు -ప్రజలకు జవాబుదారీగా వ్యవహరిస్తూ,సభా సాంప్రదాయాలు పాటిస్తూ, సభా గౌరవం నిలబెట్టేలా సమావేశాలు నిర్వహించాలి -రాష్ట్ర ఆర్ధిక,శాసన సభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల …

Read More »

ఓమర్‌ జాతి పావురాలను కాపాడుకుందాం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పావురాలు పెంచే ప్రియులలో ఓమర్‌ జాతి గురించి తెలియని వారు లేరనడంలో సందేహం లేదు. ఎందుకంటే అలనాటి రాజులకాలంలో ఏదైనా సమాచారం తెలియజేయాలంటే ఈ జాతి పావురాల ద్వారానే చేరవేయడం సాధ్యమయ్యేది. అంత ప్రత్యేకత వున్న జాతి ఓమర్‌ జాతిని కాపాడుకుందాం…అభివృద్ధి చేద్దామంటూ పిలుపునిస్తూ తమ ఎపి హోమింగ్‌ ఫీజియన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ద్వారా కృషి చేస్తున్నట్లు అసోసియేషన్‌ నాయకులు యలమంచిలి వెంకటరమణ తెలిపారు. ఈనెల 21వ (ఆదివారం) తేదీన కె.ఎల్‌.యూనివర్శిటీ ఆడిటోరియంలో ఎపి హోమింగ్‌ ఫీజియన్స్‌ …

Read More »