-రాష్ట్ర బీసీ సంక్షేమ, టెక్ట్ టైల్స్ శాఖ మంత్రి సవిత -ప్రతి చేనేత కార్మికుడికి పని కల్పిస్తాం -చేనేత కార్మికుల సంస్యల పరిష్కారానిక కృషి -చేనేతను నిర్వీర్యం చేసిన జగన్ -ప్రతి జిల్లాలోనూ చేనేత ఎగ్జిబిషన్లు : మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటుతో చేనేత రంగానికి మరోసారి పూర్వ వైభవం వచ్చిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, టెక్ట్ టైల్స్ శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. ప్రతి …
Read More »Daily Archives: July 24, 2024
నేటి పత్రిక ప్రజావార్త :
Read More »మర్యాదపూర్వక కలయిక అమిత్ షాను కలిసిన సుజనా చౌదరి
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సుజనా చౌదరి బుధవారం ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించడం రాజధాని అమరావతికి తక్షణమే 15000 వేల కోట్లు విడుదల చేయడం శుభ పరిణామం అని అమిత్ షా కు కృతజ్ఞతలు తెలియజేశారు.
Read More »ఢిల్లీలో వైఎస్ జగన్ ధర్నా
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఏపీలో జరిగిన విధ్వంసం, హత్యలు, అరాచకల ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. అనంతరం ఈ ఘటనలను నిరసిస్తూ, దీక్ష చేపట్టిన జగన్ మీడియాతో మాట్లాడుతూ…. ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని పేర్కొన్నారు. 45 రోజుల్లోనే 30కిపైగా హత్యలు జరిగాయని ఆరోపించారు. దాడుల భయంతో దాదాపు 300మంది వలస వెళ్లిపోయారని తెలిపారు. ప్రైవేటు ఆస్తులను యథేచ్ఛగా …
Read More »చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ బూరుగుపల్లి వేణు గోపాల కృష్ణ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి రూ.1 కోటి విరాళం ఇచ్చారు. బుధవారం సచివాలయంలో మంత్రి కందుల దుర్గేష్ తో కలిసి సిఎంకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ వేణు గోపాల కృష్ణ ను, సంస్థ ప్రతినిధులను సిఎం అభినందించారు.
Read More »టీడీఆర్ బాండ్ల జారీలో ఎప్పుడూ లేనివిధంగా భారీ స్కాం
-నాలుగు పట్టణాల్లో వందల కోట్ల అక్రమాలు -దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోగా భవన నిర్మాణాలకు అనుమతులివ్వండి -ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురాకుండా అధికారులు పనిచేయాలి -రాజధాని రైతులకు త్వరలోనే కౌలు చెల్లిస్తాం -మీడియా సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ… అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా టీడీఆర్ బాండ్ల జారీలో పెద్ద స్కాం జరిగిందన్నారు పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ..బాండ్ల లో అక్రమాలు చూస్తే.ఇలాంటి స్కాం లు కూడా చేస్తారా అనిపించిందని అన్నారు…రాజకీయ ఒత్తిళ్లకు …
Read More »ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో ఆస్ట్రేలియా హై కమిషనర్ భేటీ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ బుధవారం మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఫిలిప్ గ్రీన్ ని సత్కరించి, కూరగాయలతో కూడిన బొకే అందచేశారు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. రాష్ట్రం నుంచి ఉన్నత విద్యకు ఆస్ట్రేలియా వెళ్ళే విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని, ఆ దేశంలో ఉన్న విద్యావకాశాలు, విద్యా సంస్థల వివరాలను తెలియచేసేందుకు …
Read More »165వ ఆదాయపు పన్ను దినోత్సవం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆదాయపు పన్ను కార్యాలయం, SVR ప్లాజా, విజయవాడలో ఆదాయపు పన్ను శాఖ విజయవాడ 165వ ఆదాయపు పన్ను దినోత్సవాన్ని 24 జూలై, 2024న జరుపుకుంది. అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో ప్రసారమైన “ది ఛైర్మన్ స్పీక్స్” ప్రీ-రికార్డ్ సంవాద్ సెషన్‌లో ఛైర్మన్, CBDT రవి అగర్వాల్ అభినందన సందేశం ప్రసారం చేయడంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. తర్వాత పన్ను చెల్లింపుదారులు మరియు వాటాదారులను అభినందిస్తూ ఒక షార్ట్ మూవీని ప్రదర్శించారు. ఈ సందర్భంగా విజయవాడలోని ఆదాయపు పన్ను శాఖ పిఆర్.కమీషనర్ …
Read More »ఆంధ్ర ప్రదేశ్లో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధి కోసం రూ. 9, 151 కోట్ల బడ్జెట్ కేటాయింపు
-రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బడ్జెట్ ముఖ్యాంశాలు పై మీడియా సమావేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైల్వేలకు సంబందించిన కేటాయింపులతో కూడిన కేంద్ర బడ్జెట్‌ను 23 జూలై 2024న పార్లమెంట్‌లో సమర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర రైల్వేలు, సమాచార- ప్రసార , ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీ నుండి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపుల ముఖ్యాంశాలపై ఈరోజు అనగా జులై 24 , 2024న వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్ను నిర్వహించారు. సికింద్రాబాద్‌లోని …
Read More »ఎక్సైజ్ పై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం
-వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం దోపిడీపై సీఐడీ విచారణ -మద్యం పాలసీని మార్చడం వల్ల ప్రభుత్వానికి రూ.18,860.51 కోట్లు నష్టం -మద్య నిషేధం చేస్తామని అధికారంలోకి వచ్చి మాఫియాను పెంచి పోషించారు -మద్యం తయారీ కంపెనీలను భయపెట్టి లాక్కున్నారు…మద్యం ఆదాయం వైసీపీ ఖాతాలోకి వెళ్లింది -అక్రమాల కోసమే రైల్వే శాఖలో ఉన్న వాసుదేవరెడ్డిని ఏపీకి తీసుకొచ్చి ఎక్సైజ్ శాఖలో పెట్టారు -నాణ్యతలేని మద్యంతో ప్రజల ప్రాణాలు తీశారు…ఎక్సైజ్ శాఖను త్వరలోనే ప్రక్షాళన చేస్తాం -పాలన ఎలా ఉండకూడదో, పాలకుడు ఎలా ఉండకూడదో చెప్పడానికి జగన్ …
Read More »