Breaking News

Daily Archives: July 30, 2024

సీబీఐకి అప్పగించమని జీవో ఇచ్చారుగానీ… ముందుకు తీసుకువెళ్లలేదు

-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలసి వినతి పత్రం అందించిన సుగాలీ ప్రీతి తల్లి పార్వతి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘మా అమ్మాయి సుగాలీ ప్రీతిపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కేసును సీబీఐకి అప్పగిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చింది. అయితే సీబీఐ వరకూ కేసు వెళ్లలేదు’ అని సుగాలీ ప్రీతి పార్వతి కన్నీటి పర్యంతమవుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి వినతి పత్రం అందించారు. మంగళవారం  మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ని తన కుటుంబంతో …

Read More »

ఒలింపిక్స్ లో మరో పతకం దక్కడం సంతోషదాయకం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పారిస్ ఒలింపిక్స్ లో మన దేశానికి మరో పతకం అందించిన షూటర్లు సరబ్ జోత్ సింగ్, మను బాకర్ లకు అభినందనలు. 10 మీ. ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో కాంస్యం సాధించడం సంతోషదాయకం. మన దేశం నుంచి ఒకే ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన అథ్లెట్ గా మను బాకర్ రికార్డు సాధించి క్రీడాభిమానులకు ఉత్తేజాన్నిచ్చారని ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

Read More »

వన్యప్రాణులను అక్రమ రవాణా చేసినా… అటవీ శాఖ ఉద్యోగులపై దాడి చేసినా కఠిన చర్యలు

-అటవీ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  -విజయపురి సౌత్ రేంజ్ అటవీ శాఖ ఉద్యోగులపై దాడి ఘటనపై పల్నాడు కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వన్య ప్రాణులను, జంతువులను వేటాడి, అక్రమ రవాణా చేసేవారిపై ఉపేక్షించవద్దని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ, అటవీ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర అటవీ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లాలోని విజయపురి సౌత్ రేంజ్ అటవీ పరిధిలో వన్య ప్రాణి అలుగు …

Read More »

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో యూ.ఎస్. కాన్సల్ జనరల్ భేటీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ తో యూ.ఎస్. కాన్సల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్  మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందున అభినందనలు తెలియచేసి జ్ఞాపిక అందచేశారు. మంగళవారం  మంగళగిరిలోని పవన్ కళ్యాణ్  నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జెన్నిఫర్ లార్సన్ గారినీ, ఆమె బృందాన్ని పవన్ కళ్యాణ్  సత్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలు చర్చకు వచ్చాయి. రాష్ట్రంలో రాజకీయ …

Read More »

తల్లికి వందనం పథకాన్ని ఈ ఏడాది నుండే అమలు చెయ్యాలి… :  ఆర్ ఆర్ గాంధీ నాగరాజన్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ప్రకారం ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ఈ ఏడాది నుండే అమలు చేయాలని నేటి గాంధీ ఆర్ ఆర్ గాంధీ నాగరాజన్ డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ ని అతిదారుణంగా హత్య చేసిన రోజు జనవరి 30-1948వ తారీఖుని గుర్తు చేస్తూ….ప్రతి నెల అదే 30వ తారీఖుని దేశంలో ప్రజలు మర్చిపోకుండా నేటి గాంధీ ఆర్ ఆర్ గాంధీ నాగరాజన్ ప్రతినెలా 30 తేదేన కళ్ళకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్న …

Read More »

మర్యాదపూర్వక కలయిక

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎన్టీఆర్ జిల్లా మున్సిపల్ కమిషనర్ ధ్యాన చంద్రను పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజి చైర్మన్ నాగుల్ మీరా,పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, వారి కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలియజేసి పుష్పగుచ్ఛం అందజేశారు.

Read More »

ఎమ్మెల్యే సుజనా చౌదరి ఔదార్యం

-కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో కేఎల్ రావు నగర్ లో సోమవారం గుండెపోటుతో మరణించిన గుడిమెట్ల ఆశమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది 47 వ డివిజన్ టిడిపి డివిజన్ అధ్యక్షులు నాగోతి రామారావు తో కలిసి పరామర్శించారు. నిరుపేద అయినటువంటి గుడిమెట్ల ఆశమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయాలని నాగోతి రామారావు సుజనా దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే తమ కార్యాలయ సిబ్బందికి మట్టి ఖర్చుల …

Read More »

గోదావరి ముంపు బాధితులకు పాపులర్‌ షూ మార్ట్‌ వారి సహాయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జులై 18,19,20వ తేదీలలో కురిసిన భారీ వర్షాల వలన గోదావరి నదికి ఉధృతంగా వచ్చిన వరద కారణంగా పెదవాగు ప్రాజెక్టుకు గండి పడి ఏలూరు జిల్లా వేలేరుపాడు, కుకునూరు మండలాలలో 15 గ్రామాలు పూర్తిగా నీట మునిగి ఆ గ్రామాలలోని వందలాది కుటుంబాలు సర్వం కోల్పోయి నిరాశ్రయులైన గోదావరి ప్రాంతంలో ముంపు బాధితులకు అందించేందుకు పాపులర్‌ షూ మార్ట్‌ వారు 500 దుప్పట్లు, 500 టవల్స్‌, 500 లుంగీలు సిపిఐ రాష్ట్ర కార్యాలయానికి అందజేసారు. వీటితోపాటు ఎఫ్ట్రానిక్స్ …

Read More »

రాష్ట్రంలో భూములన్ని కబ్జా చేశారు

-ప్రభుత్వం మారగానే ఫైల్ అన్ని మాయం చేయడానికి చూస్తున్నారు -పేదలకు అండగా ఎర్రజెండా నిలుస్తుందని హామీ ఇచ్చిన రామకృష్ణ -బత్తలపల్లిలో భూ పోరాటానికి సంఘీభావం తెలిపిన రాష్ట్ర కార్యదర్శి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వంలో అధికార పార్టీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా భూ కబ్జాలకు పాల్పడి, కొందరి అధికారుల సహకారంతో రెవెన్యూ రికార్డులనే మార్చేసారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండల కేంద్రంలో స్థానిక సిపిఐ నాయకులు భూ పోరాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు …

Read More »

ఉచిత న్యాయ సేవల గురించి అందరికీ తెలియజేయాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె . ప్రకాష్ బాబు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాన్ని సందర్శించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నియమించిన పారా లీగల్ వాలంటీర్లతో మాట్లాడారు. ఖైదీలకు అందుబాటులో ఉన్న ఉచిత న్యాయ సేవల గురించి అందరికీ తెలియజేయాలని, వారి సమస్యలను ఎప్పటికప్పుడు సంస్థ దృష్టికి తీసుకురావాలని అన్నారు. కారాగారంలోని వసతులను, సదుపాయాలను పరిశీలించిన అనంతరం ఖైదీలతో మాట్లాడారు. ఉచిత న్యాయ సేవలు పొందడం ఖైదీల హక్కు అన్నారు. ఖైదీల తరపున …

Read More »