Daily Archives: August 31, 2024

తూర్పు గోదావరి జిల్లాలో స్కూల్స్ కి సెలవు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం .. వర్షా ప్రభావం నేపథ్యంలో శనివారం తూర్పు గోదావరి జిల్లాలో స్కూల్స్ కి సెలవు ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. నేటి అర్ధరాత్రి విశాఖపట్నం మరియు గోపాల్‌పూరం మధ్య కళింగపట్నంకు దగ్గరలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొనడం జరిగిందన్నారు. దీని ప్రభావంతో జిల్లాలో విస్తారంగా వర్షాలు …

Read More »

జోరు వానలో జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన…

-నిర్విరామంగా 10 గంటల పాటు పర్యటించి ముంపు ప్రాంతాల పరిశీలన… -తక్షణ సహాయ చర్యలకు కాల్ సెంటర్ ఏర్పాటు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అకస్మాత్తుగా సంభవించిన భారీ వర్షాల ప్రకృతి విపత్తు నుంచి ప్రజలను కాపాడేందుకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. శుక్రవారం రాత్రి నుంచి కుండపోతగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న అతి భారీ వర్షంతో జలమయమైన ప్రాంతాలలో శనివారం జిల్లా కలెక్టర్ డా. జి. సృజన విశ్రాంతి లేకుండా పర్యటిస్తున్నారు. జిల్లాలో ఉన్న వాగులు, వంకలు, కాలువలు వర్షపు …

Read More »

తుఫాన్ భారీ వర్షాలలో సహాయక చర్యలు చేపట్టేలా అధికారులను అప్రమత్తం చేశాం…

-భాదితులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం… -ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి. సిసోడియా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలను తక్షణ సహాయక చర్యలు అందించేలా అధికారులను అప్రమత్తం చేయడం జరిగిందని కొండచరియలు విరిగిపడిన సంఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని నష్టపోయిన కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవడం జరుగుతుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి. సిసోడియా తెలిపారు. నగరంలోని మొగల్రాజపురం సమీపంలోని సున్నపు …

Read More »

ఒకటవ తేదీ నుండి నిత్యావసర సరుకుల పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సెప్టెంబర్ నెల నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ఒకటవ తేదీ ఆదివారం ఉదయం నుండి ప్రారంభించాలని జాయింట్ కలెక్టర్ నిధి మీనా అధికారులను ఆదేశించారు. చౌక ధరల దుకాణ డీలర్లు, ఎండియు ఆపరేటర్లుద్వారా సరుకుల పంపిణీని ప్రతిరోజు ఉదయం 7.గం.లకు నిర్దేసించిన ఎడ్యూల్ ప్రకారం బియ్యం, పంచదార మొదలైన నిత్యావసర సరుకుల పంపిణీకి సిద్ధంగా ఉండాలన్నారు. సెప్టెంబర్ ఒకటో తేదీ ఆదివారం నుండి 17వ తేదీ వరకు కార్డుదారులకు ఇంటివద్దనే పంపిణీ చేయాలన్నారు. …

Read More »

వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై పలు సూచనలు…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా అధికారులు అందరూ వారి ప్రధాన కార్య స్థానాల్లో అందుబాటులో అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయం నుండి జిల్లా అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై పలు …

Read More »

రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల పట్ల ఎంతో బాధ్యతగా చిత్తశుద్ధితో పనిచేస్తుంది…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల పట్ల ఎంతో బాధ్యతగా చిత్తశుద్ధితో పనిచేస్తుందని, అర్హులైన పేదలందరికీ పింఛను అందించి ఆదుకోవడమే లక్ష్యమని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఆబ్కారి శాఖ మంత్రివర్యులు కొలు రవీంద్ర అన్నారు. శనివారం ఉదయం మచిలీపట్నం నగరంలోని 20 వ వార్డు గిలకలదిండిలో రాష్ట్ర మంత్రివర్యులు ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఒకవైపున జోరుగా వర్షం కురుస్తున్నప్పటికీ మంత్రివర్యులు పింఛన్లు పంపిణీ చేయడం చెప్పుకోదగ్గ విశేషం. తొలుత మంత్రి గిలకలదిండిలో మంచానికి …

Read More »

ప్రధాన ఔట్ఫాల్ డ్రైనలలో పూడికలు తీయండి

-రహదారుల పైన వర్షపు నీరు లేకుండా చర్యలు తీసుకోవాలి -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులకు ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం ఉదయం స్పెషల్ చీఫ్ సెక్రటరీ (రెవెన్యూ) సిసోడియా, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన తో కలిసి సున్నప్పటి సెంటర్ నందు కొండ చర్యలు విరిగిన ప్రదేశానికి వెళ్లి పరిశీలించారు. ప్రమాదాలకు గురయ్యే అటువంటి ప్రదేశాలను వెంటనే గుర్తించి అధికారులు అకడున్న ప్రజలను అప్రమత్తం చేసి …

Read More »

లోతట్టు మరియు కొండ ప్రాంతాలలో నివసించు ప్రజలందరూ సురక్షిత ప్రదేశములకు తరలి రావాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిన్న సాయంత్రం నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయమై వున్నందున మరియు రాగల 2 రోజులు భారీ వర్షాలు పడే సూచన ఉన్నందున లోతట్టు మరియు కొండ ప్రాంతాలలో నివసించు ప్రజలందరూ సురక్షిత ప్రదేశములకు తరలి వెళ్ళవలసినదిగా విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ప్రజలను కోరారు. ప్రమాదాలు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని .ప్రజలు …

Read More »

లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్న అధికారులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు లోతట్టు ప్రాంతాల్లో, ప్రమాదం పొంచి ఉన్న ప్రదేశాలలో నివసిస్తున్న ప్రజలను వెంటనే సురక్షిత ప్రదేశాలకు తరలించారు విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు. 15, 16, 17, 18, డివిజన్ మరియు కొండ ప్రాంత ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు వాళ్ళని వెంటనే పునరావస కేంద్రాలకు అధికారులు తరలించి వారికి కావాల్సిన త్రాగునీటి భోజన సదుపాయాలు కల్పించారు. వర్షం నీటిలో చిక్కుకుపోయిన ప్రజలందరూ పునరావస కేంద్రాల్లో …

Read More »

తిరుమల శ్రీవారి లడ్డూపై ఆంక్షలు సరికాదు

-వైసీపీ నగర అధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలపై టీటీడీ ఆంక్షలు విధించడం ఎంతమాత్రం సరికాదని విజయవాడ వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఒక భక్తుడికి రెండు మాత్రమే లడ్డూలు ఇచ్చేలా రూల్స్ మార్చడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ నూతన విధానాలపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎప్పటికప్పుడు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం సామర్థ్యం పెంచుకుంటూ పోవాల్సిందిపోయి.. …

Read More »