తూర్పు గోదావరి జిల్లాలో స్కూల్స్ కి సెలవు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం .. వర్షా ప్రభావం నేపథ్యంలో శనివారం తూర్పు గోదావరి జిల్లాలో స్కూల్స్ కి సెలవు ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. నేటి అర్ధరాత్రి విశాఖపట్నం మరియు గోపాల్‌పూరం మధ్య కళింగపట్నంకు దగ్గరలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొనడం జరిగిందన్నారు. దీని ప్రభావంతో జిల్లాలో విస్తారంగా వర్షాలు , కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీవర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కాలువలు, కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు, పడిపోయిన విద్యుత్ లైన్లకు, స్తంభాలకు దూరంగా ఉండాలని కలెక్టరు ఆ ప్రకటనలో పేర్కొనడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *