విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సెప్టెంబర్ నెల నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ఒకటవ తేదీ ఆదివారం ఉదయం నుండి ప్రారంభించాలని జాయింట్ కలెక్టర్ నిధి మీనా అధికారులను ఆదేశించారు. చౌక ధరల దుకాణ డీలర్లు, ఎండియు ఆపరేటర్లుద్వారా సరుకుల పంపిణీని ప్రతిరోజు ఉదయం 7.గం.లకు నిర్దేసించిన ఎడ్యూల్ ప్రకారం బియ్యం, పంచదార మొదలైన నిత్యావసర సరుకుల పంపిణీకి సిద్ధంగా ఉండాలన్నారు. సెప్టెంబర్ ఒకటో తేదీ ఆదివారం నుండి 17వ తేదీ వరకు కార్డుదారులకు ఇంటివద్దనే పంపిణీ చేయాలన్నారు. జిల్లాలోని రైస్ కార్డుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ కోరారు. సరుకుల పంపిణీలో ఏమైనా పిర్యాదులు ఉంటే టోల్ ఫ్రీ నెంబరు 1967 కు ఫోన్ చేయవచ్చునని జాయింట్ కలెక్టర్ తెలిపారు.
Prajavartha Online Telugu News