Breaking News

Daily Archives: September 11, 2024

ఉపాధి హామీ పనుల విషయంలో సమగ్ర నివేదిక రూపొందించాలి

-కలెక్టర్ పి.ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనుల్లో సిమెంట్ రహదారులు, డ్రెయిన్స్ పనులకి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయ ఛాంబర్ డ్వామా పనులు పురోగతి పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతిపాదించే పనుల విషయంలో సమగ్ర నివేదిక సిద్ధం చేసుకుని మార్గదర్శకాలను …

Read More »

జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు   బ్యాంకులు లింకేజ్ గా   4899 గ్రూపులకు 439.50 కోట్లు మంజూరు చేసాం.

-మహిళలు పారిశ్రామికవేత్తలుగా  యూనిట్లు ఏర్పాటు దిశగా రుణాల మంజూరుకు చర్యలు -జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో స్వయం సహాయక సంఘాలోని 4899 గ్రూపులకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు  439.50 కోట్లు బ్యాంకు లింకేజ్ మంజూరు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి . ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం స్థానిక జిల్లా కలెక్టర్ వారి సమావేశ మందిరంలో డి ఆర్ డి ఏ, మత్స్యశాఖ, ఉద్యానవన,.పారిశ్రామిక శాఖలఅధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా …

Read More »

పుష్కరాల రేవులో భక్తుల వస్తువులు భద్రత సౌకర్యార్థం రూడా ఆధ్వర్యంలో 30 లాకర్స్ ఏర్పాటు చేసాం.

-గోదావరి వరద ఉధృతి దృష్ట్యా వినాయక  నిమజ్జనం  మరో రెండు రోజులపాటు  పొడిగించి నిమజ్జనం చేయాలి -కాలుష్య రహిత పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణపై మరింత దృష్టి -సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పుష్కరాల రేవులో భక్తులు స్నానాలు, వివిధ కార్యక్రమాల నిర్వహణ కొరకు వస్తుంటారని వారి వస్తువుల భద్రత సౌకర్యార్థం లాకర్స్ ఏర్పాటు చేసి ఈరోజు నుంచి అందుబాటులోకి రావడం జరిగిందని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. బుధవారం స్థానిక పుష్కరాల రేవులో రుడా ఆధ్వర్యంలో …

Read More »

సీఎం చంద్ర‌బాబు కార్య‌ద‌క్ష‌త వ‌ల్లే వ‌ర‌ద బాధితులు విపత్తు నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు : ఎంపి కేశినేని శివ‌నాథ్

-సత్యసాయి సేవా సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను పంపిణీ -ఎమ్మెల్యే బొండా తో క‌లిసి స‌రుక‌ల ట్రాక్ట‌ర్స్ కి జెండా ఊపిన ఎంపి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడ్ని ప్ర‌జ‌లు దేవుడిలా కొలుస్తున్నార‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. సెంట్రల్ నియోజకవర్గం సీతారాంపురం కాలనీ నందు శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో వరద ముంపు బాధితులకు ఏర్పాటు చేసినటువంటి నిత్యవసర సరుకుల పంపిణీ ట్రాక్టర్లను ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు , శ్రీ సత్యసాయి …

Read More »

జ‌గ‌న్ ఇక నీ రాజ‌కీయ జీవితానికి పుల్ స్టాప్ ప‌డింది : ఎంపి కేశినేని శివ‌నాథ్

-విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యంలో మీడియా స‌మావేశం -స‌మావేశంలో పాల్గొన్న మంత్రులు నిమ్మ‌ల రామానాయుడు, మంత్రి నారాయ‌ణ‌ -జ‌గ‌న్ తీరును ఎండ‌గ‌ట్టిన మంత్రులు, ఎంపి -అమ‌రావ‌తి అంటే జ‌గ‌న్ కి ద్వేషం…అందుకే కుట్ర‌లు -ప్ర‌జ‌లు గ్ర‌హించిన జ‌గ‌న్ వికృత మ‌న‌స్త‌త్వం -బుడ‌మేర‌కు నిధులు మంజూరుతో పాటు 70 శాతం ప‌నులు పూర్తి చేసిన టిడిపి -2019 త‌ర్వాత త‌ట్ట మ‌ట్టి కూడా వేయ‌ని జ‌గ‌న్ -బాధ్య‌త లేని వ్య‌క్తి ఎమ్మెల్యే జ‌గ‌న్ రెడ్డి -ప్రకాశం బ్యారేజీనే కూల్చాలని చూసిన దుర్మార్గుడు జ‌గ‌న్ -బోట్ల బ్యారేజీని ఢీ …

Read More »

డూండీ గణేషుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డూండీ గణేష్ సేవాసమితి ఆధ్వర్యంలో భవానిపురంలో ఏర్పాటుచేసిన 72 అడుగుల భారీ వినాయకుడిని పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) బుధవారం దర్శించుకున్నారు. డూండీ గణేష్ సేవా సమితి నిర్వాహకులు డూండీ రాకేష్ సుజనా కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో నిర్వాహకులు గడ్డం రవి, దర్శి వెంకట సుబ్బారావు, దుర్గా శ్రీనివాస్ పాల్గొన్నారు.

Read More »

వరద బాధితులకు నిత్యవసర సరుకులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గల్లా మాధవి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ లోని ముంపు బాధితులకు గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరితో కలిసి బుధవారం కామకోటి నగర్ లో నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గల్లా మాధవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందన్నారు. ఎన్నడూ లేని విధంగా విజయవాడను వరద ప్రభావితం చేయడం దురదృష్టకరమన్నారు. ఆరోగ్యపరంగా, ఆహారపరంగా, బాధితులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారన్నారు. బాధితులకు …

Read More »

వరద బాధితులకు అండగా ఉంటాం… : ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) తెలిపారు. ఏకలవ్య నగర్, జొజీ నగర్, ఊర్మిళ నగర్, పున్నమి ఘాట్, పడవలరేవు, తదితర ప్రాంతాలను బుధవారం పర్యటించి బాధితులను పరామర్శించారు. ప్రకృతి విపత్తు వలన వరదలు సంభవించడం దురదృష్టకరమన్నారు. బాధితులతో ముఖాముఖి చర్చించి సలహాలు, సూచనలు తీసుకున్నారు. వరద విపత్తు ప్రారంభమైన నాటి నుంచి నిరంతరం సహాయక చర్యలను పర్యవేక్షించిన సుజనా బాధితులకు సక్రమంగా …

Read More »

హెచ్.సి.యల్ పౌండేషన్ సౌజన్యంతో సరుకుల పంపిణి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హెచ్.సి.యల్ పౌండేషన్ సహకారంతో వాసవ్య మహిళా మండలి వారు బుధవారం స్థానిక కొత్త రాజ రాజేశ్వరి పేట లో వరద బాదితులకు నిత్యవసర సరకులను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా హెచ్.సి.యల్ సంస్థ సభులు బి.శ్రీనివాసులు మాట్లాడుతూ వరద ప్రభావంతో ఎందరో నిరాశ్రయులయ్యారని వారికి చేయూతగా హెచ్.సి.యస్ పౌండేషన్ వారు ముంపు ప్రాంతాలలోని ఐదు వేల మందికి నిత్యవసర సరకులను పంపిణి చేయాలని తలంచారని అందులో భాగంగా ఈ రోజు న్యూ రాజ రాజేశ్వరి పేటలో 500 …

Read More »

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గౌ. కర్ణాటక రాష్ట్ర గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నేటి ఉదయం విఐపి విరామ సమయంలో తిరుమల శ్రీవారిని కర్ణాటక రాష్ట్ర గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం గవర్నర్ రోడ్డు మార్గాన బెంగళూరు రాజ్ భవన్ కు బయలుదేరి వెళ్లారు.

Read More »