విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డూండీ గణేష్ సేవాసమితి ఆధ్వర్యంలో భవానిపురంలో ఏర్పాటుచేసిన 72 అడుగుల భారీ వినాయకుడిని పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) బుధవారం దర్శించుకున్నారు. డూండీ గణేష్ సేవా సమితి నిర్వాహకులు డూండీ రాకేష్ సుజనా కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో నిర్వాహకులు గడ్డం రవి, దర్శి వెంకట సుబ్బారావు, దుర్గా శ్రీనివాస్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News