Breaking News

Daily Archives: September 17, 2024

భారీ వర్షాలు, వరదల్లో దెబ్బతిన్న పర్యాటక ప్రాంతాల్లో పునరుద్దరణ చర్యలు

-నష్టంపై అంచనా వేస్తున్న అధికారులు .. పూర్తి స్థాయి నివేదిక అనంతరం చర్యలు -విజయవాడలో దెబ్బతిన్న పర్యాటక ప్రాంతాలకు పూర్వ వైభవం తీసుకొస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి -విజయవాడ లో దెబ్బతిన్న భవానీ ఐల్యాండ్, బెరంపార్క్ తదితర పర్యాటక ప్రాంతాలను పరిశీలించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో విజయవాడ లో దెబ్బతిన్న భవానీ ఐల్యాండ్, బెరంపార్క్ …

Read More »

బాధితులకు బాసటగా…మేముంటాం అండగా

-వరద బాధితుల కోసం పలువురు దాతల విరాళాలు -సీఎం చంద్రబాబును కలిసి పలువురు చెక్కులు అందజేత అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : వరద బాధితులకు చేయూతనిచ్చేందుకు దాతలు ముందుకొస్తున్నారు. రైతులు, సినీ, వ్యాపార రంగాల‌కు చెందిన ప్రముఖులు విరాళాలు అందించి దాతృత్వం చాటుకుంటున్నారు. సీఎం చంద్రబాబును మంగ‌ళ‌వారం వెలగపూడి సచివాలయంలో కలిసి పలువురు విరాళాలు అందించారు. వీరికి సీఎం కృతజ్ఞతలు తెలిపి అభినందించారు. విరాళాలు అందించిన వారిలో….. 1.హిందూజా గ్రూపు సంస్థ ప్రతినిధులు ఆర్వీఆర్ చౌద‌రి, కె. వేణుగోపాల్‌ …. రూ.5 కోట్లు …

Read More »

నగరంలో ఈ నెల 30 తేదీన ‘మినీ బ్యూటీ ఎక్స్ పో’

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక ఎస్ఎస్ కన్వెన్షన్ లో ఈనెల 30వ తేదీన మినీ బ్యూటీ ఎక్స్ ఫో నిర్వహించనున్నట్లు ఎస్బిఎంఎస్ అకాడమీ, సైమా ప్రతినిధి రాఘవీ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నగరంలోని పటమట ఫన్ టైమ్స్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ బ్యూటీ ఎక్స్ పోనీ ఎస్బిఎంఎస్ అకాడమీ, సైమా బ్యూటీ ఎక్స్ పో సంస్థలు సంయుక్తంగా నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ ఎక్స్పోలో బాలీవుడ్ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్టులు జావిద్ …

Read More »

రహదార్లు అన్నిటినీ 100 రోజుల్లోగా గుంతలు లేని రహదార్లుగా తీర్చిదిద్దండి : సిఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని రహదార్లను గుంతలు లేని(Pothole Free) రహదార్లుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆర్అండ్బి శాఖ అధికారులను ఆదేశించారు.విద్య,ఉన్నత విద్య,మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి, పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, అటవీ,పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, టిఆర్ అండ్బి, పౌర సరఫరాలు, గృహ నిర్మాణం,మహిళా శిశు, గిరిజన, యువజన సంక్షేమ శాఖల్లో 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన ఆశాఖల కార్యదర్శులతో సమీక్షించారు. ఆర్అండ్బి శాఖపై జరిగిన సమీక్షలో 100 రోజుల …

Read More »

రుణాల చెల్లింపుల‌కు సంబంధించి ఏడాది పాటు మార‌టోరియం సౌక‌ర్యం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంత ప్ర‌జ‌ల‌కు లబ్ధి చేకూర్చేందుకు బ్యాంకులు ముందుకొచ్చాయని రుణాల రీషెడ్యూలింగ్ అవ‌కాశం క‌ల్పించాయని దీనిపై సంబంధిత బ్యాంకు బ్రాంచీలను సంప్రదించి లబ్ది పొందాలని అడిషనల్ సెక్రటరీ (ఫైనాన్స్) జె. నివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. రుణాల చెల్లింపుల‌కు సంబంధించి ఏడాది పాటు మార‌టోరియం సౌక‌ర్యం క‌ల్పించాయని. పంట రుణాలు, ఆటో రిక్షా, ద్విచ‌క్ర‌వాహ‌నాల రుణాలు; చిన్న వ్యాపార‌, వాణిజ్య సంస్థ‌లు, కిరాణా షాపులు, హోట‌ళ్లు, ఇత‌ర చిన్న ప‌రిశ్ర‌మ‌లకు ఈ మార‌టోరియం వ‌ర్తిస్తుందన్నారు. వ‌ర‌ద …

Read More »

పర్యాటక ఎక్సలెన్స్ అవార్డులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ టూరిజం అధారిటి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రపంచ పర్యాటక దినోత్సవమ్-2024 ను పురస్కరించుకొని రాష్ట్రస్థాయి పర్యాటక ఎక్సలెన్స్ అవార్డులకు దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని జిల్లా పర్యాటక శాఖ అధికారి ఒక ప్రకటన కోరారు. 2023-24 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ వారు 38 విభాగములకు సంభంధించి 41 అవార్డులకు ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నారన్నారు. ఉత్తమ కార్యనిర్వహణ పద్ధతులు అవలంబించిన టూర్ ఆపరేటర్లూ, ట్రావెల్స్, హోటల్ తదితర ఆసక్తికల్గిన సంబంధిత సంస్థలు www.tourism.ap.gov.in website నుండి దరఖాస్తులను డౌన్లోడ్ …

Read More »

బీసీల అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం లక్ష్యం

-రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత -ఘనంగా విరాట్ విశ్వకర్మ జయంత్యోత్సవం -ఈ ప్రభుత్వంలో బీసీలకు పూర్వ వైభవం వచ్చిందన్న మంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఎన్టీయే ప్రభుత్వ లక్ష్యమని, టిడిపి ప్రభుత్వానికి బీసీలు బ్యాక్ బోన్ అని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత అని తెలిపారు. విజయవాడ నగరం గొల్లపూడిలోని బీసీ భవన్ లో మంగళవారం నిర్వహించిన …

Read More »

జీరో శాతం హెచ్ఐవి/ ఎయిడ్స్ కేసులు నమోదే లక్ష్యం

-ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ఏ. సిరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యువతలో హెచ్ఐవి/ ఎయిడ్స్ పై పూర్తి అవగాహన పెంచే విధంగా జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సహకారంతో ఆంధ్ర ప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మారథాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ఏ. సిరి అన్నారు. హెచ్ఐవీ/ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో విజయవాడ పట్టణంలోని బీఆర్టీఎస్ …

Read More »

స్వచ్ఛతా హీ సేవా 2024 కార్యక్రమము

రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛతా హీ సేవా 2024 కార్యక్రమమునకు సంబంధించి మంగళవారం రూరల్ ధవళేశ్వరం గ్రామము పరిథిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పరిసరాల పరిశుభ్రత మానవహారం చేసి సదరు కార్యక్రమముకు సంబంధించి ప్రజలకు అవగాహన చేసి అందరితో ప్రతిజ్ఞ చేయించి ర్యాలీని నిర్వహించియున్నారు. పరిశుభ్రతే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ …

Read More »

సమగ్ర సంక్షేమం, అభివృద్ది లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది…

రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో అర్హులైన, అట్టడుగు వర్గాల వారికీ కుల మత ప్రాంతాలనే వివక్ష లేకుండా అందరీ సమగ్ర సంక్షేమం, అభివృద్ది లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురందరేశ్వరి పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం రాజనగరం మండలం కానవరం లేఔట్ లో మంతిన విజయలక్ష్మి వైఫ్ ఆఫ్ శ్రీనివాసరావు ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మేల్యే బత్తుల బలరామ కృష్ణ లతో కలిసి ఎంపి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపి …

Read More »