రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజంలో అర్హులైన, అట్టడుగు వర్గాల వారికీ కుల మత ప్రాంతాలనే వివక్ష లేకుండా అందరీ సమగ్ర సంక్షేమం, అభివృద్ది లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురందరేశ్వరి పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం రాజనగరం మండలం కానవరం లేఔట్ లో మంతిన విజయలక్ష్మి వైఫ్ ఆఫ్ శ్రీనివాసరావు ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మేల్యే బత్తుల బలరామ కృష్ణ లతో కలిసి ఎంపి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపి దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ, విశ్వ కర్మ జయంతిని పురస్కరించుకొని చేతివృత్తుల వారికి మెరుగైన జీవనాధారం అందించే దిశలో నరేంద్ర మోడీ దేశ సేవకు అంకితమై ప్రజాదరణ కలిగిన పథకాలను అమలు చేస్తున్నారన్నారు. అందరితో అందరి వికాసం కోసం అనే నినాదంతో ప్రధాన నరేంద్ర మోడీ దేశంలోని అన్ని వర్గాలకు సమన్యాయం చేసే దిశలో సంక్షేమ పాలన అందిస్తున్నారు. 2047 నాటికి భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని అదే క్రమంలో వికసిత్ ఆంధ్ర ప్రదేశ్ కల సాకారం దిశగా టిడిపి బిజెపి జనసేన తో కూడిన కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఆమె వెల్లడించారు. విశ్వ కర్మ జయంతి, నరేంద్ర మోడీ జయంతి రోజున పిఎం అవాస్ యోజన కార్యక్రమాలతో ప్రజల వద్దకు వెళుతున్నామన్నారు.
పీఎం ఆవాస్ యోజన పథకం కింద పట్టణ గ్రామీణ ప్రాంతంలోని అర్హులైన పేదలకు సొంత ఇంటి కల సహకారం చేసే దిశగా పెద్ద ఎత్తున ఇళ్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో 22 లక్షల మంది పేదలకు కేంద్ర ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేసిందని, అధికారంలో ఉన్న గత ప్రభుత్వం అర్హులకు గృహాలను నిర్మించి ఇవ్వడంలో విఫలం చెందిందని ఆమె పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం న్యాయం చేసే దిశగా దృష్టి సారించి పఇళ్ల నిర్మాణాలను రానున్న నరేంద్ర మరింత వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో స్థలం పొందిన లబ్ధిదారులు ఇల్లు కట్టుకోవడానికి అప్పు చేసామని, ఇళ్లు పూర్తి కాకపోవడం తో సొంత ఇంటికి వెళ్ళలేని పరిస్థితి, అద్దె భారం ఋణం భారం గా ఉందన్న ఆవేదన వ్యక్తం చేశారన్నారు. పీఎం ఆవాస్ యోజన 2.0 కింద రానున్న రోజుల్లో మరింత మంది అర్హులకు సొంత ఇంటి కల సాకారం కాబోతున్నట్లు తెలిపారు.
ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణ మాట్లాడుతూ, కానవరం లేఔట్ లో 808 స్థలాలు కేటాయించడం జరిగిందని పార్టీలో ఇప్పటివరకు 45 మంది పిల్లనిర్మానాలు చేపట్టగా, 21 మంది లబ్ధిదారులు గృహప్రవేశాలు చేశారన్నారు. 24 గృహాలు వివిధ దశల్లో ఉండగా, 735 గృహాలు శంకుస్థాపన చేయడం జరిగింది అన్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో త్వరలో మరిన్ని గృహాల నిర్మాణం పూర్తి చేసేలా ప్రోత్సహం అందించనున్నట్లు పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో పట్టణ ప్రాంతాల్లో 36,958 ఇళ్లు , గ్రామీణ ప్రాంతాల్లో 6, 349 ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. ఇప్పటి వరకు 26,202 పూర్తి చెయ్యగా, సుమారు 41 వేల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ పిడి హౌసింగ్ ఆర్ కృష్ణ నాయక్, గృహ లబ్ధిదారులు మంతెన విజయలక్ష్మి దంపతులు , అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News