Breaking News

Daily Archives: September 21, 2024

వరద బాధితులకు ఈ నెల 25వ తేదీన పరిహారం అందజేత

-ఎన్యుమరేషన్ ప్రక్రియ, పరిహారం చెల్లింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలకు పరిహారం అందజేతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. ఆయా శాఖల అధికారులతో ఎన్యుమరేషన్ ప్రక్రియ, పరిహారం చెల్లింపుపై రివ్యూ చేశారు. ఇప్పటికే ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తి అయ్యిందని అధికారులు తెలిపారు. దీంతో ఈనెల 25వ తేదీన బాధితులకు పరిహారం అందించాలని సిఎం నిర్ణయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వరద బాధితులకు అత్యుత్తమ పరిహారాన్ని ప్రకటించారు. విజయవాడలో వరదకు మునిగిన ఇళ్లలో …

Read More »

సంక్షోభంలోనూ సంక్షేమాన్ని అందిస్తున్న ప్రభుత్వం

-మెగా డిఎస్పి ద్వారా ఉద్యోగ అవకాశాలు -ప్రజల మధ్య ప్రభుత్వం 100 రోజుల పండుగ -వందరోజుల పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తున్నారు -రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంబేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఆర్థిక సంక్షోభంలోనూ ప్రజలందరికీ సంక్షేమాన్ని అందిస్తున్నామని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం సంబేపల్లి మండలంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన ఇది …

Read More »

పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు వినతుల స్వీకరణ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు శనివారం వినతులు స్వీకరించారు. దివ్యాంగులు, వృద్ధులు, వివిధ సమస్యలతో వచ్చిన బాధితుల నుండి అర్జీలు తీసుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతన్న వారికి సాయం అందించారు. భూముల రీ సర్వేలో భూమి కోల్పోయిన వారు, ఆన్ లైన్ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు సీఎంకు ఫిర్యాదు చేశారు. అన్నక్యాంటీన్, వరద బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధికి కొంతమంది దాతలు విరాళాలు అందించారు. కాకాని …

Read More »

ప్రజల మనోభావాలు అంటే లెక్కలేకుండా గత ప్రభుత్వం వ్యవహరించింది

-శ్రీవారి లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో రివర్స్ టెండర్లు ఏంటి? -తప్పులు, పాపాలు చేసి మళ్లీ సిగ్గులేకుండా బుకాయిస్తున్నారు. -ప్రతి మతానికి కొన్ని సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఉంటాయి..వాటిని కాపాడాలి -దేవాలయాల పవిత్రతకు, భక్తుల సెంటిమెంట్ కు అంత్యంత ప్రాధాన్యం ఇస్తాం:- టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో సిఎం చంద్రబాబు చిట్ చాట్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేవాలయాల పవిత్ర, భక్తుల సెంటిమెంట్ ను కాపాడేందుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రతి మతానికి కొన్ని సాంప్రదాయాలు, …

Read More »

కాకినాడ బీచ్ ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు సంసిద్ధులుగా ఉన్నాం

-జనవరిలో బీచ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు సన్నాహాలు -అక్టోబర్ నాటికి పర్యాటకులకు వినియోగంలోకి కాకినాడ బీచ్ ఫ్రంట్ పార్క్ -ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రోద్బలంతో రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి చర్యలు -పిఠాపురంలోని యూ.కొత్తపల్లిలో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ సందర్శించన.. అడ్డంకులు అధిగమించి త్వరలోనే అదుబాటులోకి తెస్తామని హామీ -రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : కాకినాడ బీచ్ ఫ్రంట్ పార్క్ ని అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు సంసిద్ధులుగా ఉన్నామని …

Read More »

మూడు రోజుల్లో రూ. 157.85 కోట్ల విలువైన బ్యాంకింగ్ సేవ‌లు క‌ల్పించాం

-2,740 ఖాతాల‌కు సంబంధించిన ద‌ర‌ఖాస్తులు ప‌రిష్కరించాం. -రూ. 148.22 కోట్ల రీషెడ్యూలింగ్‌తో పాటు కొత్త‌గా రూ. 9.62 కోట్ల రుణాలు మంజూరు చేశాం. -జిల్లా కలెక్ట‌ర్ డా. జి.సృజ‌న విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముంపు ప్ర‌భావిత ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకొని యుద్ధ‌ప్రాతిప‌దిక‌న బ్యాంకింగ్ సేవ‌లు అందించ‌డం జ‌రుగుతోంద‌ని.. మూడు రోజుల్లో 2,740 ఖాతాల‌కు సంబంధించి రూ. 157.85 కోట్ల విలువైన బ్యాంకింగ్ సేవ‌లు అందించిన‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న శ‌నివారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. 1,900 రుణ ఖాతాలకు …

Read More »

లయన్స్ క్లబ్‌ జూబ్లీ హరిత, మరియు వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తం ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం

–సమాజానికి ఉపయోగపడాలనే ఆలోచన ఉత్తమమైంది విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజానికి ఉపయోగపడాలనే ఆలోచనతో లయన్స్‌ క్లబ్స్‌ వారితో వరుణ్ వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఉత్తమమైనవని లయన్స్‌ జిల్లా 316డి ఫస్ట్ వైస్ గవర్నర్ వి.వి.పి.ఎస్. ఆంజనేయులు చెప్పారు. ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ మిరియాల వెంకటేశ్వరరావు ఎన్నో సంవత్సరం నుండి ఈ విధంగా వరుణ్ మోటార్స్ లైన్స్ బ్లడ్ బ్యాంకు తో కలిపి ఈ విధంగా రక్తదానం శిబిరం నిర్వహించటం చాలా ఆనందదాయకం అంతేకాక ప్రభు కిషోర్ బర్త్డే సందర్భంగా వేరే …

Read More »

సమస్యల పరిష్కార లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పధకాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు మౌళిక వసతుల కల్పన, సమస్యల పరిష్కార లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పధకాలను అమలు చేస్తుందని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. శనివారం స్థానిక రైల్ పేటలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పి.సమత, అధికారులతో కలిసి కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత వార్డ్ సచివాలయ ఉద్యోగులతో కలిసి ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల పాలనలో అమలు చేసిన కార్యక్రమాలను తెలియచేస్తూ, …

Read More »

గృహాల లబ్ధిదారులతో అవగాహన సదస్సులు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మండలాల్లో విస్తృతంగా గృహాల లబ్ధిదారులతో అవగాహన సదస్సులు నిర్వహించి గృహ నిర్మాణం పనులు ఊపందుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులు క్షేత్రాధికారులతో గృహ నిర్మాణం, ఇది మంచి ప్రభుత్వం, స్వర్ణాంధ్ర @2047 అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గృహ నిర్మాణం,స్వర్ణాంధ్ర@ 2047, ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాలను సజావుగా నిర్వహించేందుకోసం …

Read More »

విజయవాడ ధర్నా చౌక్ లో ఎస్సీ మోర్చా ధర్నా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకి బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో నిరసనలు తెలియచేసారు. రాహుల్ గాంధీ పై ధ్వజమెత్తిన కర్నాటక బిజెపి ఎం పి ముని స్వామి మాట్లాడుతూ  ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ రద్దు చేస్తానన్న రాహుల్ గాంధీ పై కేసులు నమోదు చేయాలన్నారు. ఇతర దేశాల్లో భారత్ ను తక్కువ చేసి మాట్లాడటం. ఉన్న రిజర్వేషన్ లను రద్దు చేయాలని దుర్మార్గానికి రాహుల్ ప్రయత్నం చేస్తున్నాడన్నారు. చైనా, పాకిస్థాన్ …

Read More »