-గుంటూరు జిల్లా కలెక్టర్ కు ఏపీడబ్ల్యూజేఎఫ్ వినతి గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ గుర్తింపు పొందిన జర్నలిస్టు పిల్లలకు ప్రైవేట్ స్కూల్స్ లో 50% ఫీజు రాయితీ కల్పించాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ గుంటూరు జిల్లా కమిటీ సభ్యులు మంగళవారం గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఐఏఎస్ నీ కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజలకు ప్రభుత్వ సమాచారాన్ని అందిస్తూ సమాజ అభివృద్ధి ని కాంక్షిస్తూ గౌరవప్రదమైన పాత్రికేయ వృత్తిలో కొనసాగుతూ …
Read More »Daily Archives: October 15, 2024
ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని 2024లో స్వచ్ఛ భారత్- స్వచ్ఛతా హి సేవా ప్రచారంలో భాగంగా, ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు, విజయవాడ విభాగంలోని ఆదాయపు పన్ను శాఖ ఆధ్వర్యంలో డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం చుట్టూ మానవహారం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం విజయవాడలో 15.10.2024న జరిగింది. ఈ మానవహార కార్యక్రమానికి IRS ప్రధాన కమీషనర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ శ్రీమతి సునీతా బిల్లా కూడా పాలుపంచుకున్నారు. అంతర్జాతీయ టైక్వాండో క్రీడాకారిణి సింధు తపస్వి …
Read More »విశాఖపట్నంలోని ఏఎంటీజెడ్ ప్రాంగణంలో ‘నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్’ ఎక్స్‌టెన్షన్ సెంటర్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి జయంత్ చౌధరి
-మంత్రి సమక్షంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 93వ జయంతి వేడుకలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో నైపుణ్యాభివృద్ధి లోటును తక్షణం భర్తీ చేయడానికి, కేంద్ర నైపుణ్యాభివృద్ధి & వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌధరి విశాఖపట్నంలోని ‘ఆంధ్ర మెడికల్ టెక్ జోన్’ (ఏఎంటీజెడ్) ప్రాంగణంలో కొత్త ‘నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్’ (ఎన్‌ఎస్‌టీఐ) ఎక్స్‌టెన్షన్ సెంటర్‌ను ఈ రోజు ప్రారంభించారు. అభ్యర్థులతోనూ మంత్రి ముఖాముఖి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ యువతకు …
Read More »తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సూచించారు. తుఫాన్ హెచ్చరికల దృష్ట్యా ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విపత్తు నిర్వహణా దళాలు, ఐఎండీ బృందాలు, రెస్క్యూ సహాయక సిబ్బందితో పాటు స్థానిక రెవెన్యూ, మున్సిపల్, పోలీసు శాఖలను అప్రమత్తంగా ఉంచాలన్నారు. ముంపు ప్రాంతాలను ముందుగానే గుర్తించి.. పునరావాస కేంద్రాలు, షెల్టర్లను …
Read More »భారతజాతి గర్వించదగ్గ గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం
-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ రాష్ట్రపతి, భారతరత్న అవార్డు గ్రహీత ఏపీజే అబ్దుల్‌కలాం స్ఫూర్తి దేశానికే ఆదర్శమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆ మహనీయుని జయంతి వేడుకలు ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. రాష్ట్రపతిగా దేశానికి కలాం అందించిన సేవలను స్మరించుకున్నారు. …
Read More »తుపాను ప్రభావిత జిల్లాల్లో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం
-జిల్లాల్లో 24 గంటలూ ఎపిడెమిక్ సెల్ లు పనిచేస్తాయి -రాష్ట్ర ఎపిడెమిక్ సెల్ నంబరు 9032384168తో సమన్వయం చేసుకోవాలి -జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులకు ఆదేశాలు -ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ పద్మావతి వెల్లడి అమరాతి, నేటి పత్రిక ప్రజావార్త : బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలపడి వాయుగుండంగా బలపడే అవకాశమున్నందున వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమయ్యిందని ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కె.పద్మావతి నేడొక ప్రకటనలో తెలిపారు. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి …
Read More »విజయవాడలో పైలెట్ ప్రాజెక్టుగా 6 కేటగిరీలకు ఋణ సదుపాయం
-బ్యాంకర్లు, యు సి డి సిబ్బంది సమన్వయంతో ప్రజలకు ఋణ సదుపాయం సులభతరం చేయండి -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేషనల్ అర్బన్ లవ్లీ హుడ్ మిషన్ 2.0 ద్వారా కేంద్ర ప్రభుత్వం 6 క్యాటగిరి లో ఉన్న కామన్ ఇంట్రెస్ట్ గ్రూపులకు ఋణ సదుపాయం కల్పించేందుకు పైలట్ ప్రాజెక్ట్ గా విజయవాడ, విశాఖపట్నం ను ఎంపిక చేసింది. అందులో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఉదయం విఎంసి …
Read More »