-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మాజీ రాష్ట్రపతి, భారతరత్న అవార్డు గ్రహీత ఏపీజే అబ్దుల్‌కలాం స్ఫూర్తి దేశానికే ఆదర్శమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆ మహనీయుని జయంతి వేడుకలు ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. రాష్ట్రపతిగా దేశానికి కలాం అందించిన సేవలను స్మరించుకున్నారు. ఆయన భారతజాతి గర్వించదగ్గ గొప్ప మేధావి అని.. సాధారణ స్థాయి నుండి దేశ మొదటి పౌరుని వరకు ఉన్నత శిఖరాలను అధిరోహించారన్నారు. తమిళనాడు రాష్ట్రంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన కలాం.. భారత అణురంగంలో అత్యున్నతస్థాయికి చేరుకుని క్షిపణి పితామహుడిగా కీర్తిగడించారన్నారు. పట్టుదల, కృషి ఉంటే విజయాలు సాధించడం కష్టం కాదని నిరూపించిన వ్యక్తి అని కొనియాడారు. ఏపీజే అబ్దుల్ కలాంను యువత ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు మేడా రమేష్, కాళ్ల ఆదినారాయణ, మీసాల సత్యనారాయణ, వి.బి.ఆచారి, రేపాల కిరణ్, ఖలీల్, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News