తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల అక్టోబర్ 18 నుండి 20 వరకు తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాలలో పాల్గొనుటకు నేటి మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం కు విచ్చేసిన జాతీయ సఫాయి కరంచారి కమిషన్ చైర్మన్ ఎం. వెంకటేశన్ కి జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి చెన్నయ్య మరియు ఆర్డీవో శ్రీకాళహస్తి భాను ప్రకాష్ రెడ్డి తదితరులు సాదర స్వాగతం పలికారు. జాతీయ సఫాయి కరంచారి కమిషన్, న్యూ ఢిల్లీ చైర్మన్ ఎం.వెంకటేశన్ ఈ నెల …
Read More »Daily Archives: October 18, 2024
రుయా ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటుకు అన్ని విధాల చర్యలు
-పేదలకు మెరుగైన నాణ్యమైన వైద్యం కోసం కట్టుబడి వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంజినీరింగ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలి :జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రుయా ఆసుపత్రిలో మెరుగైన పలు సౌకర్యాల ఏర్పాటుకు కమిటీ ఆమోదిస్తూ పేదలకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు బాధ్యతగా అందించాలని వైద్య సిబ్బందికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ మరియు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు సంయుక్తంగా తెలిపారు. శుక్రవారం స్థానిక ఎస్వీ వైద్య కళాశాల పాలన భవనం కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా …
Read More »మనబడి-మన భవిష్యత్తు కింద చేపట్టిన పనులను వేగవంతం చేసి పురోగతి సాధించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో మనబడి-మన భవిష్యత్తు కింద చేపట్టిన పనులను వేగవంతం చేసి పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో విద్యాశాఖ అధికారులతో మనబడి మన భవిష్యత్తు పురోగతిపై సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మనబడి మన భవిష్యత్తు కింద రెండవ దశలో 488 పాఠశాలల్లో 180 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పలు …
Read More »మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు వేగవంతం చేయాలి… : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నిర్ణీత సమయానికి మచిలీపట్నం పోర్టు సిద్ధం చేసేందుకు అందుకు సంబంధించిన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి మచిలీపట్నం పోర్టు, గన్నవరం విమానాశ్రయం అభివృద్ధి పనులకు సంబంధించిన భూసేకరణ, ఇతర అంశాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మచిలీపట్నం పోర్టు నిర్మాణం రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత …
Read More »బ్యాంకులు ఇతోదికంగా రుణాలు మంజూరు చేయాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధి అవకాశాలు ఎక్కువగా కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామిక (ఎమ్మెస్ ఎం ఈ) రంగంతో పాటు విద్య, గృహ నిర్మాణ రంగాలకు బ్యాంకులు ఇతోదికంగా రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బ్యాంకర్లకు సూచించారు. బ్యాంకర్లతో జిల్లాస్థాయి సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం కలెక్టరేట్లో మీకోసం మీటింగ్ హాల్లో జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వరద ప్రభావిత జిల్లాగా గత డిసిసి సమావేశంలో ప్రకటించిన విషయం …
Read More »చట్టరీత్యా స్కానింగ్ కేంద్రాల ను తప్పనిసరిగా నమోదు చేయాలి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో లింగ నిర్ధారణ ఎంపిక నిషేధ చట్టం ను పటిష్టంగా అమలు చేయుట జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని శ్రీమతి జి గీతాబాయి గారు తెలిపినారు. మచిలీపట్నం లోని సాయి జస్విక మెటర్నటీ హాస్పిటల్ లో స్కాన్ సెంటర్ కేంద్రమును పర్మిషన్ నిమిత్తము సందర్శించినారు. అలాగే రెన్యువల్ నిమిత్తం ఆంధ్ర హాస్పటల్ లోని స్కాన్ సెంటర్ ను సందర్శించినారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాలను తప్పనిసరిగా పిసిపిఎన్డిటి చట్టం పరిధిలో …
Read More »పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన జిల్లా… : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పారిశ్రామికవేత్తలకు కృష్ణాజిల్లా అనుకూలమైన ప్రాంతమని, పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం జరిగింది. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు, ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పియంఈపిజిపి), పీఎం విశ్వకర్మ యోజన పథకం తదితర అంశాలపై ఆయన సంబంధిత …
Read More »రహదారి ప్రమాదాలు నివారించడానికి అన్ని భద్రత చర్యలు పకడ్బందీగా చేపట్టాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో రహదారి ప్రమాదాలు నివారించడానికి అన్ని భద్రత చర్యలు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చ్చాంబర్లో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించి ప్రమాదాలు, నివారణ తదితర అంశాలపై సమీక్షించారు. తొలుత జిల్లా రవాణా అధికారి జి మనీషా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గత మూడు సంవత్సరాల్లో జరిగిన రహదారి ప్రమాదాలను కలెక్టర్ కు వివరించారు. ఈ సంవత్సరం 569 …
Read More »పోతేపల్లిలో ఇమిటేషన్ జ్యువెలరీ పార్క్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే విద్య, ఎంటర్ ప్రెన్యూర్స్ చాలా ముఖ్యమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI) జిల్లా పరిశ్రమల శాఖ సహకారంతో ఎం ఎస్ ఎం ఈ క్లస్టర్ ఔట్రీచ్ ప్రోగ్రాం శుక్రవారం బందరు మండలం పోతేపల్లిలో ఇమిటేషన్ జ్యువెలరీ పార్క్ లో నిర్వహించారు. ఇమిటేషన్ జ్యువెలరీ క్లస్టర్ ఎంటర్ప్రైన్యూర్స్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఎంటర్ప్రెన్యూర్స్ తలుచుకుంటే …
Read More »సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గా ఆర్. కృష్ణ నాయిక్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం రాజమండ్రి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ మరియు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆర్. కృష్ణ నాయిక్ ను స్థానిక ఆర్డీవో కార్యాలయంలో రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేసారు. ఈ సందర్భంగా రాజమండ్రీ డివిజన్ పరిధిలో పలు అంశాలపై చర్చించడం జరిగింది.
Read More »