Breaking News

Daily Archives: October 30, 2024

రూ.2ల‌క్ష‌ల యాభై వేల రూపాయ‌ల సీఎంఆర్ఎఫ్ ఎల్.వో.సి అంద‌జేత‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప‌శ్చిమ‌ నియోజ‌క‌వ‌ర్గం 45వ డివిజ‌న్ సితార‌ సెంట‌ర్ రామ‌రాజు న‌గ‌ర్ కి చెందిన చుక్కా నాగ‌రాజు త‌న‌ బైపాస్ స‌ర్జ‌రీ కోసం త‌క్ష‌ణ ఆర్ధిక సాయంకై సీఎంఆర్ఎఫ్ కింద లెట‌ర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్.వో.సి) కి ఎంపి కేశినేని శివ‌నాథ్ సాయంతో ఆర్జీ పెట్టుకున్నారు…మంజూరైన‌ రూ.2 ల‌క్ష‌ల యాభై వేల రూపాయ‌ల ఎల్.వో.సి ని బుధ‌వారం చుక్కా నాగరాజు కుమారుడు చుక్కా రాజ్ కుమార్ కి ఎంపి కార్యాల‌య సిబ్బంది అంద‌జేశారు. బాధిత కుటుంబ స‌భ్యులు ఎంపి …

Read More »

శానిటరీ సూపర్వైజర్ పదవీ విరమణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థలు సానిటరీ సూపర్వైజర్ గా విధులు నిర్వహిస్తున్న కే. రాఘవ నవ కిషోర్ కి విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని సమావేశపు హాల్లో పదవి విరమణ వేడుకలను ప్రజారోగ్య విభాగం నిర్వహించారు. అక్టోబర్ 31, 2024 సెలవు దినము కావున అక్టోబర్ 30, 2024 న సీఎంహెచ్ డాక్టర్ సురేష్ బాబు గారి అధ్యక్షతన అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్) డాక్టర్ డి చంద్రశేఖర్ అతిధిగా సభను నిర్వహించి వారికి …

Read More »

నగర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర ప్రజలకు దీపావళి సందర్భంగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి కమిషనర్ ధ్యానచంద్ర. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకొని దీపావళి పండుగను సురక్షితంగా, హరిత బాణసంచా కాల్చుకోవాలని, వాతావరణ కాలుష్యాన్ని కాపాడాలని సూచించారు. టపాసులు కాల్చుకునే సమయంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలందరూ సంతోషకరంగా దీపావళి పండుగను జరుపుకోవాలని బుధవారం నాడు విడుదల చేసిన ప్రకటనలో కోరారు.

Read More »

పారిశుధ్య నిర్వహణలో అలసత్వం వహించరాదు

-శానిటరీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పారిశుధ్య నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా 43వ డివిజన్లో ఊర్మిళ నగర్ మరియు కబేళ పరిసర ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడం గమనించి పారిశుద్ధ్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుధ్య నిర్వహణలో అలసత్వం వహించరాదాని, పారిశుధ్య కార్మికులు నిత్యం …

Read More »