అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త లా అండ్ ఆర్డర్ ని నీచ స్థితిని దిగజార్చింది వైసీపీ ప్రభుత్వమే అని సమాచారశాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం గురించి మట్లాడుతుంటే ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. జీవితకాలం వైసీపీకి జగన్ అధ్యక్షుడిగా ఉండాలని తీర్మానం చేయించుకున్నారు. కాని ప్రజాస్వామ్యంలో అది సాధ్యం కాదని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. రాష్ట్రంలో వైసీపీ కొంత మంది పోలీసులను …
Read More »Daily Archives: November 8, 2024
వేద విద్యనభ్యసించిన వారికి భృతిని కనీసం రూ. 10వేలు చేయాలి
-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వేదాధ్యయనం పూర్తి చేసి నిరుద్యోగులుగా ఉన్న పండితులకు భృతిని కనీసం రూ. 10వేలు అందించాలని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వీరికి నిరుద్యోగ భృతి 3 వేల రూపాయలు ప్రకటించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. భారతదేశం వేద భూమి అని.. అటువంటి చోట వేద విద్యను అభ్యసించిన పండితులను గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కనుక …
Read More »ప్రజల సమగ్ర డాటా అనుసంధానం ద్వారా మెరుగైన పౌర సేవలు
-అర్హులకే పథకాలు అందేలా ఆర్టీజిఎస్ ఉపయోగపడాలి -పుట్టిన ప్రతి బిడ్డకు ఆధార్ ఇచ్చే ప్రక్రియ మొదలవ్వాలి :- ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు -త్వరలో వాట్సాప్ ద్వారా వంద పౌర సేవలు :- రివ్యూలో వివరించిన మంత్రి నారా లోకేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వానికి రియల్ టైమ్ గవర్నెన్స్ అనేది ఒక ప్రధాన డాటా వనరుగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సచివాలయంలో శుక్రవారం రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీ)పై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ …
Read More »ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా అధికారులు మరమ్మత్తుల పనులను వేగవంతం చేయాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సంక్రాంతి నాటికి గుంతల రహిత రహదారులుగా రాష్ట్రాన్ని మార్చాలన్న ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా అధికారులు మరమ్మత్తుల పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆదేశించారు. నేడు విజయవాడలోని ఆర్ & బీ శాఖ ఈ ఎన్ సీ కార్యాలయంలో మంత్రి ఆధ్వర్యంలో ఆ శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రోడ్ల మరమ్మత్తులకు సంబంధించి …
Read More »ఐ.ఎస్.జగన్నాథపురంలో అనుమతి లేని ప్రదేశంలో తవ్వకాలు
-అనుమతులకు విరుద్ధంగా 20.95 ఎకరాల్లో 6 లక్షల క్యూబిక్ మీటర్లకుపైగా రెడ్ గ్రావెల్ తవ్వకం -ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం -రెవెన్యూ, గనుల శాఖల విచారణలో బయటపడిన విషయాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏలూరు జిల్లా ఐ.ఎస్.జగన్నాథపురం గ్రామంలో అనుమతులకు విరుద్ధంగా సాగిన రెడ్ గ్రావెల్ తవ్వకాలపై విచారణ చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇవ్వడంతో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. బెకెమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ 20.95 ఎకరాల్లో ఏ విధమైన …
Read More »చేనేత కార్మికులకు ప్రభుత్వం నిరంతర ప్రోత్సాహం
-ప్రతి ఒక్కరూ చేనేతను ఆదరించాలి.. -రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : చేనేతకు చేయూత ఇవ్వాల్సిన అవసరం ఉందని, చేనేత కార్మికులను ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమo, చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. శుక్రవారం పుట్టపర్తి జిల్లా కేంద్రంలోని చక్రవర్తి రోడ్డు వైపు లో చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో ఆప్కో షో రూమ్ ను పుట్టపర్తి శాసనసభ్యురాలు పల్లె సింధూర రెడ్డి తో కలిసి …
Read More »సింబల్ లేకుండా పోటీ చేద్దాం.. సిద్ధమా… : మాజీ మంత్రి జోగి రమేష్
ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మైలవరం నియోజకవర్గంలో సహజ వనరులను నాడు వైసీపీలో నేడు టీడీపీలో ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్ లూఠీ చేస్తున్నారని మాజీ మంత్రి జోగి రమేష్ ధ్వజమెత్తారు. ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే వసంత చేసిన ఆరోపణలకు జోగి కౌంటర్ ఇచ్చారు. అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ చేసింది. బూడిద దోచుకుంటుంది మైలవరం వీరప్పన్ కృష్ణప్రసాద్ కాదా? అని ప్రశ్నించారు. సహజ వనరులను దోచుకుంటున్న కృష్ణప్రసాద్‌ను నియోజకవర్గ ప్రజలు క్షమించొద్దని, ఆయనను …
Read More »సత్యసాయి జిల్లాలో పర్యాటకానికి పెద్దపీట
-బుక్కపట్నం చెరువులో బోటింగ్ ప్రారంభించిన మంత్రి -త్వరలో గొల్లపల్లి రిజర్వాయర్ లోనూ బోటింగ్ సౌకర్యం -రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు హ్యాండ్లూమ్స్ మరియు టెక్స్టైల్ శాఖామాత్యులు సవితమ్మ బుక్కపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సత్యసాయి జిల్లాలో టూరిజానికి పెద్ద పీట వేస్తున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత తెలిపారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం డవలప్ మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన బుక్కపట్నం మండల కేంద్రంలో ఉన్న బుక్కపట్నం చెరువులో బోటింగ్ ను మంత్రి సవిత శుక్రవారం ప్రారంభించారు. …
Read More »లెమన్ ట్రీ ఎలైట్ బ్రోచర్ ఆవిష్కరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రియల్ ఎస్టేట్ రంగంలో నూతన శకానికి నాంది పలికిన గాయత్రి 99 డెవలపర్స్ సంస్థ నుండి లెమన్ ట్రీ ఎలైట్ బ్రోచర్‌ను సంస్థ ఛైర్మన్ ఎం.అశోక్‌కుమార్, ఎం.డి జి.వెంకటేశ్వరరెడ్డి, మార్కెటింగ్ సీఈఓ.శివరామకృష్ణ చేతులు మీదగా బ్రోచర్ ఆవిష్కరణ జరిగింది. శుక్రవారం, ఆటోనగర్, ది ఆటోమోబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి మార్కెటింగ్ సభ్యులు భారీగా తరలివచ్చారు. ఆవిష్కరణ అనంతరం చైర్మన్ యం.అశోక్‌కుమార్ మాట్లాడుతూ పల్నాడు జిల్లా ఐనవోలు, వినుకొండ వై జంక్షన్ దగ్గర ఈ …
Read More »ఆటో మొబైల్ రంగం అభివృద్ధికి సహకారం అందిస్తాను : ఎంపి కేశినేని శివనాథ్
-ఎఫ్.ఐ.పి.సి.ఎ, రీ బోరింగ్ వర్క్ అసోసియేషన్స్ తో భేటీ -సి.ఎస్.ఆర్. నిధులతో సిల్క్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆటోమొబైల్ రంగంలో వస్తున్న సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకునే విధంగా ఆటోనగర్ లో మెకానిక్స్, వర్కర్స్ అప్ గ్రేడ్ అయ్యేందుకు సిల్క్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేసి ఆటోనగర్ లో వున్న అసోసియేషన్స్ అభివృద్దికి కృషి చేస్తానని ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. ఆటో ఎలక్ట్రికల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కొడూరు ఆంజనేయ వాసు ఆధ్వర్యంలో ది ప్యూయల్ ఇంజక్షన్ …
Read More »