-రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యాలయం ప్రారంభం -వాణిజ్య రంగానికి విజయవాడ ప్రధాన కేంద్రం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వం కారణంగా వాణిజ్య రంగానికి ప్రధాన కేంద్రమైన విజయవాడలో చాలా మంది వ్యాపారస్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారికి అండగా నిలబడి,నిరంతరం వ్యాపారస్తుల సమస్యలను పరిష్కరిచేందుకు ముందుండే టిడిపి రాష్ట్ర వాణిజ్య విభాగ అధ్యక్షుడు డూండీ రాకేష్ ప్రజాసేవ చేయటానికి ముందుకి రావాలని విజయవాడ ఎంపి కేశినేని ఆకాంక్షించారు. పశ్చిమ నియోజకవర్గం విద్యాధరపురం ఆర్టీసీ డిపో ఎదురుగా డూండీ రాకేష్ ఏర్పాటు చేసిన …
Read More »Daily Archives: November 8, 2024
అమరావతి ఊపిరి పీల్చుకుంది..ఉపాధి కల్పించే విధంగా సంస్థలు వస్తున్నాయి : ఎంపి కేశినేని శివనాథ్
-ఆర్.ఆర్.ఆర్. అసోసియేట్స్ కార్యాలయం ప్రారంభం -హాజరైన ఎమ్మెల్యే బొండా ఉమా, ఎంపి కేశినేని శివనాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వం కారణంగా రాష్ట్రంలో నిర్మాణ రంగం కుదైలైంది. ముఖ్యమంత్రి గా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి ఊపిరి పీల్చుకునే విధంగా రాష్ట్రంలో కుదేలైన నిర్మాణరంగానికి పూర్వ వైభవం వచ్చిందని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. టి.ఎన్.టి.యు. సి రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి ఆర్.ఆర్.ఆర్. అసోసియేట్స్ పేరుతో ఏర్పాటు చేసిన నూతన కార్యాలయ …
Read More »హాండ్రెడ్ పర్సెంట్ గుణదల ఫ్లై ఓవర్ ఏర్పాటు కి కృషి చేస్తాము : ఎంపి కేశినేని శివనాథ్
-1వ డివిజన్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కి శంకుస్థాపన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యల పరిష్కరించటంతో పాటు, మౌళిక సదుపాయాల కల్పన, అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఇందులో భాగంగా రైల్వే అధికారులతో మాట్లాడి హాండ్రెడ్ పర్సెంట్ గుణదల ఫ్లై ఓవర్ నిర్మాణం జరిగే విధంగా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తో కలిసి కృషి చేస్తానని ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. సెంట్రల్ నియోజకవర్గం 1వ డివిజన్ గుణదల ప్రాంతంలోని ఎస్.ఎల్.వి అమరావతి …
Read More »ఎమ్మెల్యే సుజనా చౌదరికి ధన్యవాదములు తెలియజేసిన గెస్ట్ లెక్చరర్లు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాతబస్తీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని గెస్ట్ లెక్చలర్లు ఎమ్మెల్యే సుజనా చౌదరికి ధన్యవాదములు తెలియజేశారు. 2023-24 సంవత్సరం నుండి పనిచేస్తున్న అధ్యాపకులను 2025 వరకు రెన్యువల్ చేయవలసిందిగా ఎమ్మెల్యే సుజనా చౌదరిని వారు అభ్యర్థించారు. ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో సంబంధిత అధికారులతో మాట్లాడి 2025 విద్యా సంవత్సరం వరకు పొడిగించారు. రెన్యువల్ చేసినందుకు కృతజ్ఞతగా గెస్ట్ ఫ్యాకల్టీ అధ్యాపకుల బృందం ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ను …
Read More »ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో రిటైనింగ్ వాల్ నిర్మాణ పనుల ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) ఆదేశాలతో 49వ డివిజన్ వీరయ్య వీధి కొండ ప్రాంతంలో మొదటి విడతగా రూ 34 లక్షల వ్యయంతో రిటైనింగ్ వాల్ ,(రక్షణ గోడ) నిర్మిస్తున్నామని బిజెపి కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ తెలిపారు. వీరయ్య వీధిలో రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను కూటమి నేతలతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరయ్య వీధి కొండ ప్రాంతవాసులు ఇకపై ఆందోళన చెందనవసరంలేదన్నారు. వర్షానికి మట్టి నాని …
Read More »ఈనెల 11 వ తేదీన జాతీయ విద్యా దినోత్సవం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవం ఈనెల 11 వ తేదీన జాతీయ విద్యా దినోత్సవం రోజున A- Convention Center Vijayawada లో జరుగుతుంది . దీనిలో పాఠశాల విద్య , ఇంటర్మీడియట్ విద్య, పాలిటెక్నిక్ కాలేజీ యూనివర్సిటీ డిగ్రీ కాలేజీ విద్య , ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ కాలేజీ లలో ఉత్తమ ప్రతిభా కనపరచిన ఉత్తమ ఉపాధ్యాయులకు విద్యాశాఖామంత్రి నారా లోకేష్ మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అవార్డ్స్ అందజేయడం జరుగుతుందని …
Read More »బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు
– బాల్య వివాహం నుంచి 15 ఏళ్ల అమ్మాయిని కాపాడిన ఐసీడీఎస్ సిబ్బంది – జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి జి.ఉమాదేవి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎవరైనా బాల్య వివాహాలు చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఎన్‌టీఆర్ జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి జి.ఉమాదేవి.హెచ్చరించారు. బాల్య వివాహాల నిరోధానికి క్షేత్రస్థాయిలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని.. విజయవాడ రూరల్, అంబాపురానికి చెందిన 15 ఏళ్ల ఓ అమ్మాయిని కడప జిల్లాకు చెందిన 34 …
Read More »భవానీ ద్వీపాన్ని సందర్శించిన భవాని ద్వీప పర్యాటకాభివృద్ధి సంస్థ (BITC) ఇంచార్జి ముఖ్య కార్యనిర్వహణాధికారి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన భవాని ద్వీపాన్ని ఈరోజు ఇటీవల కొత్తగా BITC ఇంచార్జి సీఈఓ గా బాధ్యతలు చేపట్టిన వి. స్వామి నాయుడు సందర్శించారు. ఇటీవలి వరదల వల్ల సంభవించిన నష్టాన్ని సమీక్షించి , పునరుద్ధరణ కార్యక్రమాల పురోగతిని గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో సోమవారం నుండి అడ్వెంచరస్ గేమ్స్ (సాహస క్రీడలు) ని పర్యాటకులకు అందుబాటులో ఉంచాలని, పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను …
Read More »గ్యాస్ డెలివరీ బాయ్స్ చే ఈ కేవైసీ నమోదు చేసుకునే సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అర్హులైన ఉచిత గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు వారి ఇంటి వద్దే గ్యాస్ డెలివరీ బాయ్స్ చే ఈ కేవైసీ నమోదు చేసుకునే సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం సంవత్సరానికి [3] గ్యాస్ సిలిండర్లు ఉచితముగా పంపిణీ చేసే పథకాన్ని అక్టోబర్ 31నుండి ప్రారంభించడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా జిల్లాలోని 55 గ్యాస్ ఏజెన్సీ లలో ఉచిత సిలిండర్ల బుకింగ్ …
Read More »బీసీ స్టడీ సర్కిల్‌లో డీఎస్‌సీ ఎస్‌జీటీ ఉచిత శిక్షణ
– ఈ నెల 12లోగా దరఖాస్తు చేసుకోవాలి. – బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె.శ్రీనివాసరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డీఎస్‌సీ-ఎస్‌జీటీ పరీక్షకు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా అందించే ఉచిత శిక్షణకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 12వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఎన్‌టీఆర్ జిల్లా ఏపీ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె.శ్రీనివాసరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్‌టీఆర్ జిల్లాకు చెందిన బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీ అభ్యర్థులు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా పొందిన దరఖాస్తుకు …
Read More »
Prajavartha Online Telugu News