విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) ఆదేశాలతో 49వ డివిజన్ వీరయ్య వీధి కొండ ప్రాంతంలో మొదటి విడతగా రూ 34 లక్షల వ్యయంతో రిటైనింగ్ వాల్ ,(రక్షణ గోడ) నిర్మిస్తున్నామని బిజెపి కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ తెలిపారు. వీరయ్య వీధిలో రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను కూటమి నేతలతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరయ్య వీధి కొండ ప్రాంతవాసులు ఇకపై ఆందోళన చెందనవసరంలేదన్నారు. వర్షానికి మట్టి నాని కొండ రాళ్లు దొరలకుండా ఈ రిటైనింగ్ వాల్ రక్షణగా ఉంటుందన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఎన్డీఏ కూటమిపాలనలో పశ్చిమంలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. పశ్చిమం లోని రోడ్లు, డ్రైనేజీలు, సైడ్ కాలువలను నిర్మించి, తాగునీటి సౌకర్యాలను మెరుగుపరుస్తూ మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ఎమ్మెల్యే సుజనా కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టిడిపి అధ్యక్షులు బడుగు వెంకన్న, కొమరకిరణ్, బడుగు అప్పారావు, పారా రాజు, దాసరి నరసింహారావు, ఎయి ప్రసాద్, శానిటరీ ఇన్స్పెక్టర్ కృష్ణ, సచివాలయ ఇన్చార్జి విగ్నేష్, కాంట్రాక్టర్ విజయ్ ,జ్యోతిర్మయి స్థానిక పెద్దలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News