విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన భవాని ద్వీపాన్ని ఈరోజు ఇటీవల కొత్తగా BITC ఇంచార్జి సీఈఓ గా బాధ్యతలు చేపట్టిన వి. స్వామి నాయుడు సందర్శించారు. ఇటీవలి వరదల వల్ల సంభవించిన నష్టాన్ని సమీక్షించి , పునరుద్ధరణ కార్యక్రమాల పురోగతిని గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో సోమవారం నుండి అడ్వెంచరస్ గేమ్స్ (సాహస క్రీడలు) ని పర్యాటకులకు అందుబాటులో ఉంచాలని, పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సాధ్యమైనంత త్వరితగతిన వరదలకు పూర్వంలా పచ్చదనం పరిశుభ్రత వెల్లివిరిసెల ద్వీపాన్ని పునరుద్ధరించాలని సూచించారు. విద్యుత్ సరఫరా పునారిద్దరించాలని, RO water,మేజ్ గార్డెన్, మిర్రర్ మాజ్ పునరుద్దరించాలని ఆదేశించారు. సౌండ్ సిస్టం పని చేయాలనీ, దారి మార్గాలలో పేరుకు పోయిన ఇసుక వారంలో తొలగించాలని ఆదేశించారు. ఈ పర్యవేక్షణలో BiTC జనరల్ మేనేజర్ రమణి, మేనేజర్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News