Breaking News

ఆటో మొబైల్ రంగం అభివృద్ధికి స‌హ‌కారం అందిస్తాను : ఎంపి కేశినేని శివ‌నాథ్

-ఎఫ్.ఐ.పి.సి.ఎ, రీ బోరింగ్ వ‌ర్క్ అసోసియేష‌న్స్ తో భేటీ
-సి.ఎస్.ఆర్. నిధులతో సిల్క్ డెవ‌ల‌ప్మెంట్ సెంట‌ర్స్ ఏర్పాటు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆటోమొబైల్ రంగంలో వ‌స్తున్న స‌రికొత్త సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకునే విధంగా ఆటోన‌గ‌ర్ లో మెకానిక్స్, వ‌ర్క‌ర్స్ అప్ గ్రేడ్ అయ్యేందుకు సిల్క్ డెవ‌ల‌ప్మెంట్ సెంట‌ర్స్ ఏర్పాటు చేసి ఆటోన‌గ‌ర్ లో వున్న అసోసియేష‌న్స్ అభివృద్దికి కృషి చేస్తాన‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు.

ఆటో ఎలక్ట్రికల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కొడూరు ఆంజనేయ వాసు ఆధ్వ‌ర్యంలో ది ప్యూయ‌ల్ ఇంజ‌క్ష‌న్ పంపు క్యాలిబ్రైట‌ర్స్ అసోసియేష‌న్ (ఎఫ్.ఐ.పి.సి.ఎ), ది రీబోరింగ్ వ‌ర్క్ షాప్స్ అసోసియేష‌న్ నాయ‌కులు ఎంపి కేశినేని శివ‌నాథ్ ను శుక్ర‌వారం గురునాన‌క్ కాల‌నీ లోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో క‌లిశారు. అలాగే వారి స‌మ‌స్య‌ల‌పై విన‌తి ప‌త్రం అంద‌జేశారు.

రెండు అసోసియేష‌న్స్ నాయ‌కుల‌తో ఎంపి కేశినేని శివ‌నాథ్ మాట్లాడి వారి స‌మ‌స్య‌లు తెలుసుకుని సానుకూలంగా స్పందించారు. ఏ మోటారు వాహ‌నానికైనా ఇంజ‌న్ చాలా ప్ర‌ధానమ‌ని…మీరంతా మారిన సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకునేందుకు త‌న వంతు స‌హ‌కారం అందిస్తాన‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ తెలిపారు. అలాగే ఆటో మొబైల్ రంగంలో యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించేందుకు, ప్ర‌స్తుతం ప‌ని చేస్తున్న వ‌ర్క‌ర్స్ అప్ గ్రేడ్ అయ్యేందుకు సిల్క్ డెవ‌ల‌ప్ మెంట్ సెంట‌ర్స్ ఏర్పాటు చేయించి శిక్ష‌ణ ఇప్పించ‌టంతో పాటు స‌ర్టిఫికేష‌న్ కూడా ఇచ్చే విధంగా చూస్తామ‌న్నారు.

గ‌త ఐదేళ్లుగా ప‌నులు లేవ‌ని అసోసియేష‌న్స్ నాయ‌కులు చెప్ప‌గా,…బంద‌ర్ పోర్ట్…ప‌రిటాల లో గూడ్స్ హ‌బ్ రావ‌టంతో పాటు విజ‌య‌వాడ‌కి ఇన్న‌ర్ రింగ్ రోడ్డు, అమ‌రావ‌తి నిర్మాణ ప‌నుల‌తో వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి నుంచి ఆటోన‌గ‌ర్ కి వర్క్ పెరుగుతుంద‌న్నారు. ఆ వ‌ర్క్ చేసేందుకు వ‌ర్క‌ర్స్ అంద‌రూ సిద్దంగా వుండాల‌ని సూచించారు. ఆటోన‌గ‌ర్ కి, ఆటో మొబైల్ రంగానికి అండ‌గా వుండి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌ట‌మే కాకుండా అభివృద్దికి స‌హ‌కారం అందిస్తానని భ‌రోసా క‌ల్పించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎఫ్.ఐ.పి.సి. ప్రెసిడెంట్ ఎన్.వెంక‌టేశ్వ‌ర‌రావు, సెక్ర‌ట‌రీ బి.నాగేశ్వ‌రరావు, కోశాధికారి ఎస్.సుధాక‌ర్, వైస్ ప్రెసిడెంట్ ఫ‌ణీంద్ర‌, జాయింట్ సెక్ర‌ట‌రీ ఎమ్.కోటేశ్వ‌ర‌రావు, క‌మ్మ‌లి ప్ర‌సాద్, ది రీబోరింగ్ వ‌ర్క్ షాప్స్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ పి.అర్జున‌రావు, సెక్ర‌ట‌రీ నాగేశ్వ‌ర‌రావు, ఎ.గోపిచంద్, మైత్రి మోహ‌న‌రావు, ఆటో మొబైల్ టెక్నిషియన్ అసోసియేషన్ (ఎ.టి.ఎ) మాజీ అధ్యక్షులు గొల్లపూడి నాగేశ్వరరావు , ఆటో ఎలక్ట్రికల్ అసోసియేషన్ సెక్రటరీ జాస్తి సురేష్, ఐలా మాజీ మెంబ‌ర్ సీనియ‌ర్ మెకానిక్ షేక్ నాయ‌బ్ ర‌సూల్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *