Breaking News

Daily Archives: November 28, 2024

మహాత్మా జ్యోతిబాపూలే సేవలు చిరస్మరణీయం ఆదర్శనీయం

-2024-25 ఆర్థిక సంవత్సరానికి బీసీల సంక్షేమానికి 39 వేల కోట్లను కేటాయించిన ఘనత కూటమి ప్రభుత్వానిదని -ఇది మంచి ప్రభుత్వం – బిసిల ప్రభుత్వం ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం -:ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్. సవిత తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే అని, కూటమి ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలన జ్యోతిబా ఫూలే అడుగు జాడల్లో నడుస్తున్నదని ఇది …

Read More »

కలెక్టరేట్ ఆవరణలో ఈవీఎం గోడౌన్ తనిఖీ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గురువారం కలెక్టరేట్ ఆవరణలో ఈవీఎం గోడౌన్ తనిఖీ చేశారు. ఈవీఎం గోడౌన్లకు వేసిన తాళాలు, సీళ్ళు పరిశీలించారు. ఈవీఎం గోడౌన్ వద్ద సెక్యూరిటీ, సీసీ కెమెరాలు పర్యవేక్షణ పటిష్టంగా ఉండాలన్నారు. తనిఖీ రిజిస్టరులో సంతకం చేసారు. భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు నెలవారి తనిఖీల్లో భాగంగా ఈవీఎం గోడౌన్ తనిఖీ చేసి నివేదిక పంపవలసి ఉంటుంది. ఈ మేరకు కలెక్టర్ ఈవీఎం గోడౌన్ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ …

Read More »

కలెక్టరేట్లో మహాత్మ జ్యోతిరావు ఫూలే వర్ధంతి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మహాత్మ జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా గురువారం కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సముద్దరణకు ఆయన చూపిన మార్గం అనుసరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కె. చంద్రశేఖర రావు, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ సాధికారత అధికారి జి రమేష్ సూపర్నెంట్ అనంతలక్ష్మి, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.

Read More »

ఎన్నికల ప్రక్రియ నిబంధనలకు అనుగుణంగా పటిష్టవంతంగా నిర్వహించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో సాగునీటి సంఘాలకు ఎన్నికల ప్రక్రియ నిబంధనలకు అనుగుణంగా పటిష్టవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ గురువారం కలెక్టరేట్ నుంచి జిల్లాలోని ఆర్డీవోలు, తాసిల్దార్లు, ఇరిగేషన్ ఏఈ లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 204 సాగునీటి సంఘాలు, 27 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, 2318 టెరిటోరియల్ కాన్స్టిట్యూఎన్సీస్, ఒక ప్రాజెక్టు కమిటీ ఉన్నాయని, వీటికి ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు ఓటర్ల జాబితా ఫైనలైజ్ చేసి ఒకటి …

Read More »

అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా మట్టా ప్రసాద్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) చైర్మన్ గా మట్టా ప్రసాద్ గురువారం స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో జరిగిన కార్యక్రమంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ముడ వైస్ చైర్మన్, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ సమక్షంలో ముడా చైర్మన్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మాత్యులు సత్య కుమార్ యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొని ముడా చైర్మన్ ను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంతో చరిత్ర …

Read More »

పంటను ప్రభుత్వానికి అమ్మి మద్దతు ధరను పొందండి..

-రైతుకు నచ్చిన మిల్లుకు ధాన్యం అమ్ముకోవచ్చు.. -దళారులకు పంటను అమ్మి నష్టపోవద్దని రైతులకు మంత్రి సూచన -రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త : రైతు కష్టపడి పండించిన పంటను ప్రభుత్వానికి విక్రయించి మద్దతు ధర పొందాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులను కోరారు. గురువారం మంత్రి కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా పామర్రు నియోజకవర్గంలోని స్థానిక శాసనసభ్యులు వర్ల కుమార్ రాజాతో కలసి కనుమూరు, కొండాయపాలెం, అడ్డాడ గ్రామాలలో పర్యటించి రైతులతో …

Read More »

జిల్లాలో గృహ నిర్మాణ ప్రగతి పై సమీక్ష

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గురువారం కలెక్టరేట్ నుంచి జిల్లాలోని హౌసింగ్ అధికారులు సిబ్బందితో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాలో గృహ నిర్మాణ ప్రగతి పై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గృహ నిర్మాణం వేగం పెంచాలన్నారు. వివిధ నిర్మాణాల దశల్లో స్టేజ్ కన్వర్షన్ పురోగతి సాధించాలన్నారు. వారం వారం సమీక్షిస్తున్నప్పటికీ ఉయ్యూరు, ఘంటసాల, పెడన వంటి మండలాల్లో పెద్దగా పురోగతి లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు గృహాలు నిర్మించుకున్న లబ్ధిదారులకు చెల్లింపులు …

Read More »

అణగారిన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే అని.. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆయన నిరంతరం పోరాటం చేశారని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. పూలే వర్థంతిని పురస్కరించుకుని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఆ మహనీయుని విగ్రహానికి మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతుశ్రీశైలజారెడ్డితో కలిసి పూలమాలలు వేసి గురువారం ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి మహాత్మ …

Read More »

నవయుగ వైతాళికుడు జ్యోతిరావు పూలే

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో అక్షర జ్యోతిని వెలిగించిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే అని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. పూలే వర్థంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనము నందు డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైసీపీ కార్పొరేటర్ యరగొర్ల తిరుపతమ్మతో కలిసి ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి గురువారం ఘన నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి …

Read More »