మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మహాత్మ జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా గురువారం కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సముద్దరణకు ఆయన చూపిన మార్గం అనుసరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కె. చంద్రశేఖర రావు, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ సాధికారత అధికారి జి రమేష్ సూపర్నెంట్ అనంతలక్ష్మి, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News