Breaking News

Monthly Archives: December 2024

రాష్ట్రంలోని పోర్టుల నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం

-రేషన్ బియ్యం అక్రమ రవాణాను వ్యవస్థీకృత నేరంగా పరిగణించాలని నిర్ణయం -కాకినాడ పోర్టులో అయిదు వేర్ హౌసుల్లో సార్టెక్స్ మిషన్లు ఏర్పాటుపై విచారణకు ఆదేశం -రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ ఉప సంఘం సమావేశం -పోలీస్, రవాణా, సివిల్ సప్లైస్, మారిటైమ్ బోర్డు అధికారులతో సమీక్ష విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదల కోసం ఉద్దేశించిన బియ్యాన్ని అక్రమంగా రవాణా చేయడాన్ని వ్యవస్థీకృత నేరంగా పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వ్యవసాయ శాఖ …

Read More »

లోక్ నాయక్ పౌండేషన్ ద్వారా నార్ల ఉత్తమ పాత్రికేయ పురస్కారాలు

-విశ్వహిందీ పరిషత్ జాతీయ అధ్యక్షులు, పద్మ భూషణ్, అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దివంగత నార్ల వెంకటేశ్వరరావు పేరిట ఇకపై ప్రతి సంవత్సరం ఉత్తమ పాత్రికేయ అవార్డులను అందించనున్నట్లు పద్మ భూషణ్, విశ్వహిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడు, అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ తెలిపారు. లోక్ నాయక్ ఫౌండేషన్ నేతృత్వంలో ప్రతి సంవత్సరం ముగ్గురు జర్నలిస్టులకు ఒక్కొక్కరికీ రూ.50వేల నగదు పురస్కారంతో విజయవాడ వేదికగా నార్ల ఉత్తమ పాత్రికేయ అవార్డులను అందిస్తామన్నారు. గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాల …

Read More »

నీట మునిగిన పంట పొలాలను, చెరువులను, స్వర్ణముఖి ఆనకట్టను పరిశీలించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సూళ్లూరుపేట లో పిజిఆర్ఎస్ గ్రీవెన్స్ ముగించుకున్న అనంతరం జిల్లా కలెక్టర్ పెంగల్ తుఫాన్ నేపథ్యంలో కురిసిన భారీ వర్షాల వలన నీట మునిగిన పంట పొలాలను గోకుల కృష్ణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ సమీపంలో ఆర్డీవో మరియు సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం పడమటి కండ్రిగ రహదారిపై ప్రవహిస్తున నీటి ప్రవాహాన్ని, నీట మునిగిన వరి పైరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంఛార్జి సహాయ సంచాలకులు వ్యవసాయ శాఖ కవిత వివరిస్తూ పడమటి కండ్రిగ రహదారి …

Read More »

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 82 అర్జీలు

-ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పి జి ఆర్ ఎస్ ) కు వచ్చిన అర్జీదారుల సమస్యలను సావధానంగా వింటూ వచ్చిన అర్జీలను స్వీకరించిన జాయింట్ కలెక్టర్ -అర్జీలకు గడువులోపు పరిష్కారం చూపాలి : జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS ) కార్యక్రమంలో వచ్చిన అర్జీలను గడువు లోపు సకాలంలో అర్థవంతoగా పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం …

Read More »

సూళ్లూరుపేట ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) లో ప్రజల నుండి అర్జీలు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. ఎస్

సూళ్లూరుపేట, నేటి పత్రిక ప్రజావార్త : నేటి సోమవారం ఉదయం సూళ్లూరుపేట పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయ సమీపంలోని సత్యసాయి కళ్యాణ మండపం నందు సూళ్లూరుపేట నియోజక వర్గ ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) గ్రీవెన్స్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ గారు ఆర్డీఓ సూళ్లూరుపేట కిరణ్మయి తో కలిసి పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరిస్తున్నారు. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సూళ్లూరుపేట డివిజన్ పరిధిలోని డివిజనల్ అధికారులు, మండల అధికారులు తదితరులు హాజరయ్యారు. కంప్యూటర్ల ఏర్పాటుతో …

Read More »

టెన్‌పిన్ జాతీయ బౌలింగ్‌లో స‌త్తా చాటిన తెలుగు తేజం

-ఛాంపియ‌న్‌గా నిలిచిన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన సుమ‌తి న‌ల్ల‌బంటు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : బెంగళూరులోని అమీబా బౌలింగ్ సెంటర్‌లో న‌వంబ‌రు 30న జ‌రిగిన ఏఆర్సీ 33వ జాతీయ టెన్‌పిన్ బౌలింగ్ ఛాంపియన్‌ షిప్‌లో కర్ణాటకకు చెందిన ఆకాశ్ అశోక్ కుమార్, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన సుమతి నల్లబంటు ఛాంపియన్‌లుగా నిలిచారు. వరుసగా తన 7వ ఫైనల్‌ను ఆడుతున్న కర్ణాటకకు చెందిన ఆకాష్ రెండు గేమ్‌ల టైటిల్ పోరులో ఢిల్లీకి చెందిన షేక్ అబ్దుల్ హమీద్ (425-353)పై సునాయాసంగా విజయం సాధించి తన 3వ టైటిల్‌ను …

Read More »

మంత్రి అమిత్ షాని కలిసిన వల్లభనేని బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీలో కేంద్ర హోం వ్యవహారాల మంత్రి అమిత్ షా ని సోమవారం మర్యాద పూర్వకంగా కలిసి, ఇటీవల మహారాష్ట్ర లో జరిగిన ఎన్నికలలో విజయం సాధించినందుకు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి అభినందనలు తెలియ జేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ మహారాష్ట్ర లో జనసేన అధ్యక్షులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  ప్రచారం నిర్వహించిన అన్ని ప్రాంతాలలో తమ అభ్యర్థులు విజయం సాధించారని, పవన్ కళ్యాణ్ కు అక్కడి …

Read More »

కార్మిక రాజ్య భీమా (ESI) స్కీమ్ వృద్ధి గణనీయంగా ఉంది…

-సుమితా దావ్రా, సెక్రటరీ – కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ, భారతదేశ ప్రభుత్వం వారు ఈ‌ఎస్‌ఐ హాస్పిటల్ గుణదల, విజయవాడ మరియు ఈ‌ఎస్‌ఐ డిస్పెన్సరీ – ఆటోనగర్, విజయవాడ, ఆంధ్రప్రదేశ్‌లో రోగులను సందర్శించి మరియు వారితో సంభాషించారు -సెక్రటరీ, కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం వారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈ‌ఎస్‌ఐ పథకం పురోగతిని సమీక్షించి, ధానితో పాటు ఈ‌ఎస్‌ఐ‌సి మరియు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను ప్రశంసించారు -సెక్రటరీ, కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ, …

Read More »

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలు జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : “ప్రధానమంత్రి ఫసల్ భీమ యోజన” పథకం రైతులు సద్వినియోగం చేసుకునే విధంగా వారిలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలు జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం సోమవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పథకం మంచి పథకమని, ప్రీమియం చాలా తక్కువ, రైతులకు పంట నష్టం జరిగినప్పుడు …

Read More »

అర్జీదారు సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలి… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : తమ సమస్యల పరిష్కారానికి ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి అధికారుల దృష్టికి తీసుకువచ్చిన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశపు మందిరంలో ఆయన మీకోసం కార్యక్రమం నిర్వహించి డిఆర్ఓ కే చంద్రశేఖర రావు, కె ఆర్ ఆర్ సి డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, అదనపు ఎస్పి వివి నాయుడు, బందరు ఆర్టీవో కే స్వాతితో కలిసి వివిధ ప్రాంతాల నుంచి తరలి …

Read More »